
గో ఆధారిత ఉత్పత్తులపై వర్క్ షాపు
పాయకరావుపేట: స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో డిపార్టుమెంట్ ఆఫ్ జువాలజీ ఆధ్వర్యంలో గో ఆధారిత ఉత్పత్తులపై రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. గోపూజతో ప్రారంభమైన ఈ వర్క్ షాపులో పంచగవ్య ఉత్పత్తులు, గోఆధారిత వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. మొదటి రోజు దంతమంజన్, ప్రమిదలు, ఫేస్ ప్యాక్, హెయిర్ ఆయిల్, షాంపూ, సబ్బులు, తదితర 20 రకాల ఉత్పత్తులను తయారు చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షకులు – క్షేత్ర గో సేవ సంయోజక్ ఆకుతోట రామారావు మాట్లాడుతూ గోవు మన సంస్కృతిలో పవిత్రమైనదన్నారు. అది మన జీవన శైలికి పునాదిగా నిలిచిందని అటువంటి గో ఆధారిత ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్నారు. గో సంస్కృతిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రాంత గోసేవ సంయోజక్ రాంజీ, ఆంధ్ర ప్రాంత శిక్షణ ప్రముఖ కృషి వడ్డీ, ఆంధ్ర ప్రాంత గోసేవ సహా సంయోజక్ ఓలేటి నారాయణ కుమార్, స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.రామకృష్ణరెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.