
అల్లూరి జయంతి ఏర్పాట్ల పరిశీలన
పార్కులో ఏర్పాట్లు పరిశీలిస్తున్న
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128 జయంతి వేడుకలను ఈ నెల 4న కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధులు వద్ద ఘనంగా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ అల్లూరి పార్కును ఆయన మంగళవారం పరిశీలించారు. పార్కులో ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అధికారులు, కమిటీ సభ్యులు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ, అధికారులు పాల్గొన్నారు.