
పాయకరావుపేట హాస్టల్‌నుపరిశీలించిన అధికారులు
వివరాలు తీసుకుంటున్న అధికారి
పాయకరావుపేట: హోం మంత్రి భోజనంలో బొద్దింక వచ్చిన బీసీ బాలికల కాలేజి హాస్టల్‌ను ఆర్డీవో వి.వి.రమణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీదేవి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ జయంతి బుధవారం పరిశీలించారు. సోమవా రం రాత్రి వసతి గృహాన్ని సందర్శించి, బాలికలతో కలిసి భోజనం చేసి, నాణ్యత దారుణంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యం వహించిన వసతి గృహం వార్డెన్ గంగభవానీని సస్పైండ్ చేశారు. జిల్లా అధికారులు బుధవారం హాస్టల్‌కు వెళ్లి మెనూ అమలు, రైస్ నాణ్యత, తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన వార్డెన్ గంగభవానీని కూడా వివరణ అడిగినట్లు తెలిపారు. విచారణ రిపోర్టును జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని చెప్పారు. తహసీల్దార్ ఎస్.ఆదిమహేష్ పాల్గొన్నారు.