
రోజంతా వర్షమే
● జిల్లాలో 338.2 వర్షపాతం నమోదు ● పాయకరావు పేటలో అత్యధికంగా 30 మి.మీ.
అనకాపల్లి టౌన్ : జిల్లా అంతటా బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరుజల్లులతో వాన కురుస్తూనే ఉంది. దీనివల్ల పాదచారులు, ద్విచక్రవాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు. మోత్తం 338.2 మి.లీ మీటర్లు కురవగా పాయకరావు పేట 30.0, దేవరాపల్లి 28.2, మాడుగుల 26.2 , కె కోటపాడు 25.6 , మాకవరపాలెం 24.6, సబ్బవరం 22.0, నక్కపల్లి 21.4, అనాకాపల్లి 18.2, కోటవురట్ల 16.8, ఎస్ రాయవరం 14.6, చీడికాడ 14.4, చోడవరం13.4, బుచ్చయ్యపేట 12.8, రావికమతం 12.4, రాంబిల్లి9.6, రోలుగుంట 8.8, పరవాడ 8.2, మునగపాక 7.2, నర్సిపట్నం 5.4, అచ్చుతాపురం 5.0, యలయంచిలి 4.6, నాతవరం 3.8, గొలుగొండ 3.2, కశింకోట 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు ఇదే విధంగా చిరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అఽధికారులు తెలిపారు.