
డీఎంహెచ్‌వోగా హైమావతి
అనకాపల్లి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఎం.హైమావతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఆర్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న ఆమెను సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ నియమించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌వోగా పనిచేసిన కె.బాలాజీ తన మాతృ సంస్థ అయిన జిల్లా లెప్రసీ విభాగానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.హైమావతి మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల్లోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను పరిశీలించి అక్కడ రోగులు, ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వర్షాలు పడుతున్న కారణంగా గ్రామీణ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.