
ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు
● ఎస్సీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: విద్యార్థి దశనుంచి ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, తద్వారా ఉజ్వల భవిష్యుత్తు సొంతమవుతుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఈ ఏడాది టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలకు బుధవారం స్కాలర్ షిప్‌లు, ప్రశంసాపత్రాలు అందజేసి, సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది పిల్లల ఉన్నత చదువులకు తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలో 26 మంది విద్యార్థినీవిద్యార్థులకు రూ. 1.30 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, సీఐలు బాల సూర్యారావు, రమేష్, రామకృష్ణ్ణ, పోలీస్ అసోసియేషన్ అడహక్ అధ్యక్షుడు సీసీఎస్ సీఐ అప్పలనాయుడు, కోశాధికారి లలిత, సభ్యులు మొహిద్దీన్, అచ్చయ్య, భూలోక, సత్యనారాయణ, మల్లీశ్వరి, శేషాద్రి, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘ సభ్యుడు, ఎస్‌ఐ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.