
జిల్లా అధికారుల సంఘం కార్యవర్గం ఏకగ్రీవం
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన
జిల్లా అధికారుల సంఘం కార్యవర్గం
తుమ్మపాల: జిల్లా అధికారుల సంక్షేమం కోసం జిల్లా అధికారుల సంఘం నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. సోమవారం జరిగిన జిల్లా అధికారుల సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. వివిధ అంశాలపై చర్చ అనంతరం, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడిగా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జి.రామారావు, గౌరవ అధ్యక్షుడిగా జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జనరల్ సెక్రటరీగా డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, జాయింట్ సెక్రటరీగా డ్వామా పీడీ పూర్ణిమాదేవి, కోశాధికారిగా జిల్లా పౌర సరఫరాల అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్‌డీసీ రమామణి, డీఈవో అప్పారావు నాయుడు, ఏపీసీఎస్‌ఎస్ ఎ.సూర్యప్రకాష్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు కలెక్టర్ కె.విజయ కృష్ణన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.