ఇక్కడ రూ.10 | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ రూ.10

Jul 4 2025 4:00 AM | Updated on Jul 4 2025 4:00 AM

ఇక్కడ

ఇక్కడ రూ.10

మన్యంలో పైనాపిల్‌ రైతులు ధరలేక ఉసూరు మంటున్నారు. వర్షాల వల్ల వ్యాపారులు రావడం లేదు. అరకొరగా వచ్చిన వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఒక పైనాపిల్‌కు సైజును బట్టి సగటున రూ.10 వరకు ధర చెల్లిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు తరలించి మూడింటిని రూ.90 నుంచి రూ.100కు విక్రయించి ఆదాయం పొందుతున్నారు. వ్యాపారుల పరిస్థితి లాభసాటిగా ఉండగా కష్టపడి పండించిన గిరి రైతులు మాత్రం పెట్టుబడి రాక నష్టాలు పాలవుతున్నారు.
అక్కడ రూ.30
ధర పతనంతో పైనాపిల్‌ రైతు ఉసూరు

సాక్షి,పాడేరు: మన్యంలో పైనాపిల్‌ రైతుకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తుండటంతో వ్యాపారులు రాకపోవడంతో రైతులు మార్కెటింగ్‌ సమస్య ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ధర కూడా పతనమైంది. మరోపక్క పంటను కోయకుండా వదిలేయడంతో వర్షాలకు కాయలు కుళ్లిపోతుండటంతో గిరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

దిగుబడి బాగున్నా..

ఏజెన్సీలోని పాడేరు, అనంతగిరి, హుకుంపేట, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో 610 ఎకరాల విస్తీర్ణంలో పైనాపిల్‌ను సాగు చేస్తున్నారు. కొండపోడు, మెట్ట భూముల్లో సేంద్రియ విధానంలో పండించడం వల్ల రుచిలో నంబర్‌ వన్‌గా నిలుస్తున్నాయి. జూన్‌ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పంట దిగుబడి ఉంటుంది. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు.

ఈ ఏడాది దారుణంగా..

ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది పైనాపిల్‌ ధరలను వ్యాపారులు పతనం చేశారు. గత నెల సీజన్‌ ప్రారంభంలో ఒకొక్క కాయను రూ.20నుంచి రూ.25 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధరను బాగా తగ్గించేశారు. గత పది రోజుల నుంచి సైజునుబట్టి రూ.5 నుంచి రూ.13కు కొనుగోలు చేస్తుండటంతో గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. సమీపంలోని అనకాపల్లి జిల్లా వి.మాడుగుల సంతకు నేరుగా తీసుకువెళ్లినా అక్కడ వ్యాపారులు కూడా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని వారు వాపోతున్నారు.

ముందుకురాని వ్యాపారులు : పైనాపిల్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటికీ వ్యాపారుల రాక తగ్గింది. గతంలో తుని, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వచ్చేవారు. ఈ ఏడాది వ్యాపారుల నుంచి డిమాండ్‌ కూడా తగ్గింది.దీంతోపాటు వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పైనాపిల్‌ను కొనుగోలు చేసేవారు కరువయ్యారని గిరి రైతులు వాపోతున్నారు.

● పైనాపిల్‌ సాగుకు పేరొందిన వంట్లమామిడి, సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల పరిధిలోని గిరిజనులకు ఏటా ఈ పంట ద్వారా ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది కనీసం రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

తీవ్ర నష్టం కలిగిస్తున్న వర్షాలు

ఏకధాటిగా కురుస్తుండటంతో

కానరాని వ్యాపారులు

మార్కెటింగ్‌ లేక నష్టపోతున్న గిరి రైతులు

గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి

వ్యాపారుల వద్దకు తీసుకెళ్లినా తక్కువ ధరే..

అనకాపల్లి జిల్లా వి.మాడుగుల సంతలో కూడా పైనాపిల్‌కు తక్కువ ధరే లభిస్తోంది. వ్యాపారులు రూ.12కు మించి కొనుగోలు చేయడం లేదు. గత ఏడాది రూ.20కి అమ్ముకున్నాం. ఈ ఏడాది మాత్రం గిట్టుబాటు ధర కరువైంది. ప్రభుత్వం స్పందించి రైతుబజార్లకు తరలించి అమ్ముకునేలా ఏర్పాట్లు చేయాలి.

– కిముడుబోయిన శ్రీరాములు, పైనాపిల్‌ రైతు, కందులపాలెం, పాడేరు మండలం

ఐటీడీఏ మార్కెటింగ్‌ చేయాలి

ఈఏడాది పైనాపిల్‌కు గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. చిన్న కాయను రూ.5కు కొంటున్నారు. మైదాన ప్రాంతాల వ్యాపారులు గ్రామాలకు రావడం లేదు. మైదాన ప్రాంతాలకు రైతులు పైనాపిల్‌ను తరలించి అమ్ముకునే విధంగా ఐటీడీఏ మార్కెటింగ్‌కు సహకరించాలి. ఇలా చేయగలిగితే నష్టాల నుంచి బయటపడగలుగుతాం.

– కిల్లు కృష్ణ, గిరిజన రైతు,

పులుసుమామిడి, పాడేరు మండలం

ఇక్కడ రూ.101
1/4

ఇక్కడ రూ.10

ఇక్కడ రూ.102
2/4

ఇక్కడ రూ.10

ఇక్కడ రూ.103
3/4

ఇక్కడ రూ.10

ఇక్కడ రూ.104
4/4

ఇక్కడ రూ.10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement