ఆ కుటుంబాలకే పల్లె పగ్గాలు
భైంసారూరల్: నిర్మల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఈసారి భిన్నమైన తీర్పు ఇచ్చారు. యువతను, చదువుకున్నవారిని ఎన్నుకున్నారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం.. సంప్రదాయాన్ని కొనసాగించారు. గత పాలకుల కుటుంబీకులకే మరో
అవకాశం కల్పించారు.
వరుసగా రెండోసారి..
భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కథ్‌గాం గ్రామానికి సర్పంచ్‌గా వరుసగా దెగ్లూర్ రాజు రెండోసారి ఎన్నికయ్యాడు. భైంసాలో దంతవైద్యుడిగా పనిచేస్తూ మొదటిసారి సర్పంచుగా ప్రజాజీవితంలోకి వచ్చాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాజు ప్రస్తుతం గ్రామంలో ప్రజాప్రతినిధిగానే కొనసాగుతున్నారు. మొదటిసారి జిల్లాలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సైతం అందుకున్నాడు. అప్పటి కలెక్టర్లు ప్రశాంతి, ముషారఫ్ అలీ ఫారూఖీ, వరణ్‌రెడ్డి రాజు చేసిన సేవలను ప్రసంసించారు. పల్లె ప్రకృతి వనం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్ల మెప్పు పొందారు. రెండోసారి వరుసగా సర్పంచుగా ఎన్నికయ్యాడు.
మహాగాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి అప్పాల రాజ్యలక్ష్మి ఎన్నికై ంది. గడిచిన ఐదేళ్లలో అప్పాల రాకేశ్ సర్పంచ్‌గా పనిచేశారు. రిజర్వేషన్ మహిళకు కేటాయించడంతో భార్యను పోటీలో దింపి సర్పంచ్‌గా గెలుపించుకున్నారు. అప్పుడు రాకేశ్ ఇప్పుడు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి సర్పంచ్‌గా పని చేస్తున్నారు.
ఆ కుటుంబాలకే పల్లె పగ్గాలు


