breaking news
waste land
-
బంజరు భూమిని బంగరు భూమి చేసింది
‘కలిసి ఉంటేనే కాదు కష్టపడితే కూడా కలదు సుఖం’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది సంతోష్ దేవి.తన రెక్కల కష్టంతో బంజరు భూమిని బంగరు భూమిగా మార్చింది. ఎంతోమంది రైతులను తన మార్గంలో నడిపిస్తోంది.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా బేరి గ్రామంలో... 1.25 ఎకరాల బంజరు భూమితో సంతోష్ దేవి ఖేదార్ ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబం వీడిపోవడంతో తన భర్త వాటాగా 1.25 ఎకరం భూమి వచ్చింది. భర్త రామ్ కరణ్ హోంగార్డ్. చాలీచాలని జీతం. దీంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపింది సంతోష్‌దేవి.‘పది, ఇరవై ఎకరాలు ఉన్నవారికే దిక్కు లేదు. ఎకరంతో ఏం సాధిస్తావు? అప్పులు తప్ప ఏం మిగలవు!’ అన్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయం లాభసాటి వ్యాపారం’ అని నిరూపించడానికి రంగంలో దిగింది సంతోష్ దేవి.‘నేను చదువుకోవాలని మా నాన్న కోరుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడే నాకు చదువుల కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం’ అంటుంది సంతోష్‌దేవి. తాతగారి పొలంలో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడకున్నా మంచి దిగుబడి వచ్చేది. ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి. చాలా ఏళ్లుగా రసాయనాలు వాడడం వల్ల పొలం నిస్సారంగా మారింది. చుట్టు పక్కల నీటి వనరులు లేకపోవడంతో జొన్న, సజ్జలాంటి సంప్రదాయ పంటలే పండించేవారు.కలుపు మొక్కలతో గందరగోళంగా ఉన్న పొలాన్ని ఒక దారికి తేవడంతో మొదటి అడుగు వేసింది. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని నిర్ణయించుకుంది. దానిమ్మ పండించమని, తక్కువ భూమిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని సికార్ వ్యవసాయ అధికారి సలహా ఇచ్చాడు. ఆ సలహా వారి జీవితాన్నే మార్చేసింది.220 దానిమ్మ మొక్కలను కొనడానికి గేదెను అమ్మేయాల్సి వచ్చింది. మొక్కలు కొనగా మిగిలిన డబ్బుతో పొలంలో గొట్టపు బావిని వేయించింది. నీటి ఎద్దడి ఉన్న ఆప్రాంతంలో బిందు సేద్య పద్ధతిని నమ్ముకుంది. చుక్క నీరు కూడా వృథా చేయవద్దని నిర్ణయించుకుంది. జనరేటర్‌ను అద్దెకు తీసుకుంది. గ్రామంలోని ఎంతోమంది రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ ఎరువు తయారీ మొదలుపెట్టింది. లేయర్ కటింగ్, సేంద్రియ పురుగు మందులకు బెల్లం కలపడంలాంటి రకరకాల టెక్నిక్‌ల గురించి తెలుసుకుంది. మూడేళ్ల కఠోర శ్రమ ద్వారా దానిమ్మ పండ్ల తొలి దిగుబడితో మూడు లక్షల లాభం వచ్చింది. సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం వల్ల నేల సారవంతంగా మారింది.భర్త పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తరువాత, పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత నేరుగా పొలానికే వెళ్లేవాళ్లు. ‘ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు. కాని బాగా కష్టపడాలనుకున్నాం’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంది సంతోష్‌దేవి. పండ్లతోటను నిర్వహించే అనుభవం రావడంతో యాపిల్‌లాంటి ఇతర పండ్లను పండించడంపై దృష్టి పెట్టింది.దానిమ్మ మొక్కల మధ్య నిర్దిష్టమైన దూరం ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో కలుపు లేకుండా చూడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీల మధ్య మోసంబి మొక్కలు నాటింది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత నిమ్మ నుంచి బెల్‌లాంటి ఎన్నో మొక్కలను నాటింది. పొలంలో సోలార్ ΄్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఖర్చు తగ్గింది.‘మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలకు కారణం వారు పండిస్తున్న దానికి సరైన ధర లభించకపోవడమే. దళారులు లాభాలన్నీ అనుభవిస్తున్నారు’ అంటున్న సంతోష్‌దేవి ఒక్క పండును కూడా దళారులకు అమ్మదు. అన్ని పండ్లూ నేరుగా పొలంలోనే అమ్ముతారు.సంతోష్ సాధించిన విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా దానిమ్మ మొక్కలను పెంచడంప్రారంభించారు. అయితే చాలామంది విఫలమయ్యారు. అలాంటి వారు సంతోష్‌దేవిని సలహా అడిగేవారు. నాణ్యమైన మొక్కల కొరత వల్లే వారు విఫలమవుతున్నారు అని గ్రహించిన సంతోష్ దేవి ఆ లోటును భర్తీ చేయడానికి కొత్త మొక్కల కోసం ‘షెకావది కృషి ఫామ్ అండ్ నర్సరీ’ప్రారంభించింది.కష్టఫలంనేను, నా భర్త, పిల్లలు మాత్రమే పొలంలో పనిచేసేవాళ్లం. కూలీలతో పనిచేయించే స్థోమత మాకు లేదు. అయితే ఎప్పుడూ కష్టం అనుకోలేదు. ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటామో, పొలంలో అలాగే ఉండేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూనే కష్టపడేవాళ్లం. మా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది.– సంతోష్‌దేవి -
గూడు గోడు ‘పట్టా’ని సర్కార్
– ఇంటిపట్టాల కోసం ఎమ్మెల్యే విశ్వ దశలవారీ పోరాటాలు – అయినా స్పందించిన పాలకులు – సీఎం పర్యటన నేపథ్యంలోనైనా పట్టాల పంపిణీకి మోక్షం కలిగేనా? ఉరవకొండ: నిరుపేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉరవకొండ పట్టణంలోని పేదలకు ఇంటి పట్టాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 2008లో 88 ఎకరాల స్థలాన్ని రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుంచి పట్టాలు పంపిణీ చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. మున్సిపాలిటీ హోదా కల్గిన ఉరవకొండ పట్టణంలో 45 వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇందులో 70 శాతం వరుకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలూ అధికమే. అందుకే బాడుగ ఇళ్లలో అంటూ అద్దెలు కట్టలేక వారంతా అల్లాడిపోతున్నారు. ఇల్లు మంజూరు చేయకపోయినా కనీసం పట్టాలైనా ఇస్తే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తామని పేదలంతా అధికారులను కోరుతున్నారు. కానీ వారి గూడుగోడు ఎవరికీ పట్టడం లేదు. పట్టాల పంపిణీకి గ్రహణ టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా నియోజకవర్గంలో ఏ మంఽఽడలంలో కుడా పేదలకు పట్టాలు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజురు చేసిన పాపాన పోలేదు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎవరూ చేయని విధంగా దశల వారీగా పోరాటాలు చేశారు. అయితే ఎమ్మెల్యే ఆందోళనతో దిగొచ్చిన అధికారులు పూటకో ప్రకటన చేస్తూ పట్టాలు పంపిణీ చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేస్తే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని భావించిన స్థానిక టీడీపీ నాయకులు అధికారుల పైఒత్తడి తెచ్చి పట్టాలు పంపిణీ కాకుండా చూస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈనెల 8న సీఎం చంద్రబాబు ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో తమకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారని అర్హులైన పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. స్థలమున్నా పట్టాలివ్వడం లేదు ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి పట్టాల కోసం ఎదురు చూస్తున్నాం. వైఎస్సార్ హయాంలో భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో పట్టాలిచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయింది. మాలాంటి పేదేళ్ల బాధలు వాళ్లకు ఎప్పుడు అర్థమవుతాయో. అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. -జైబూన్, ఉరవకొండ కనికరం చూపండి ఇంటి పట్టాల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా మా మీద కనికరం చూపాలి. కూలీ పనులు చేసుకుని బతికే మేము.. బాడుగ చెల్లించలేక పోతున్నాం. కనీసం ఇప్పుడైనా అధికారులు మాకు పట్టాలివ్వాలి. -నిర్మల, ఉరవకొండ