breaking news
Warda Cyclone
-
తిరువళ్లూరులో వర్ద బీభత్సం
తిరువళ్లూరు:తిరువళ్లూరు జిల్లాను వార్దా తుపాన్ అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో జిల్లాలో బీభత్స పరిస్థితి ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లాలో వార్దా తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందుకు రెట్టింపు ప్రభావాన్ని చూపింది. జిల్లాలో ఆదివారం రాత్రి 12 గంటలకు ప్రారంభమైన వర్షం సామవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతలా కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో రాత్రి నుంచే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో అంధకారంగా మారింది. జిల్లా అంతా నిర్మాణుష్యంగా మారింది. దీంతో పాటు సెల్ఫోన్లు, ఇంటర్నెట్, బీఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా స్తంభించాయి. ఉదయం నుంచే భారీ వర్షం పడడంతో ఆవడి, పట్టాభిరాం, ఏకాటూరు తదితర ప్రాంతాల్లో రైలు తీగలు తెగిపడడంతో రైలు సేవలను పూర్తిగా నిలిపి వేశారు. దీంతో వేలాది మంది ప్రయాఇకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరువళ్లూరు నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైలు పెట్టేల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి తాగునీరు, అన్నంతో పాటు ఇతర వస్తువులు దొరక్కపోవడంతో అవస్థలు పడ్డారు. జిల్లా నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపి వేశారు. రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తరలించారు. మత్స్యకారులను చేపల వేటకు అనుమతించకపోవడంతో పాటు సముద్రతీర ప్రాం తాలకు చెందిన ప్రజలను ఎప్పటికప్పడు అధికారులు అప్రమత్తం చేశారు. జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్‌ను సిద్ధంగా ఉంచారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 విద్యుత్ స్తంభాలు కూలిపోగా, పోలీవాక్కం, కడంబత్తూరు తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది ఇలా వుండగా జిల్లాలో నీ ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉదయం నుంచే కారు చీకటి కమ్ముకుంది. ఉదయం నుంచి స్వల్పగాలులు వీచినా మధ్యాహ్ననానికి గాలి మరింత పెరిగి బీభత్సం సృష్టించింది. ఇప్పటికే జిల్లా అంతటా వందలాది విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో మరో రెండు రోజుల వరకు విద్యుత్ వచ్చే పరిస్థితి ఉండదని అధికారులు వెల్లడించారు. అచ్చిరాని డిసెంబర్: తిరువళ్లూరు జిల్లాకు డిసెంబర్ నెల అచ్చిరావడం లేదన్న అభిప్రాయం ఉంది. గత డిసంబర్‌లో కురుసిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేయగా, ప్రస్తుతం భారీ ఈదురు గాలీతో తమ ప్రతాపాన్ని చూపింది. దీంతో జిల్లాలో డిసెంబర్ నెలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. -
వర్ద విలయం
ఊహించని రీతిలో వర్ద పెను ప్రళయ తాండవం చేసి వెళ్లింది. 192 కిమీ వేగంతో వీచిన గాలులు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగాయి. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. వర్ద తీరం దాటినా ఈదురు గాలుల ప్రభావం మరీ ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. సాక్షి, చెన్నై : డిసెంబరు నెల అంటే చాలు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం వాసుల్ని వణికి పోతున్నారు. గత ఏడాది వర్షం ఈశాన్య రుతు పవనాలతో పెను ప్రళయాన్ని చవి చూస్తే, ఈ ఏడాది వర్దరూపంలో కొన్ని గంటల పాటుగా ఊపిరి బిగ పెట్టుకుని ఉత్కంఠగా కలాన్ని గడపాల్సిన పరిస్థితి.వర్ద్ద తుపాన్ రూపంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలకు ముప్పు తప్పదన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. పెను ›ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. తీర వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం వేకువ జాము నుంచి చిరుజల్లులతో మొదలైన వర్షం క్రమంగా తీవ్ర రూపం దాల్చడం మొదలెట్టింది. దీంతో సరిగ్గా పన్నెండున్నర ఒంటి గంట సమయంలో ఎక్కడిక్కకడ వాహనాల రాకపోకల్ని నిలిపి వేశారు. జనం రోడ్ల మీదకు రాకుండా ఇళ్లకు పరిమితం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. చెన్నైలో ప్రధాన రోడ్లన్నీ మూత పడ్డట్టుగా నిర్మానుష్యం అయ్యాయి. ఎలక్ట్రిక్ రైళ్ల సేవల్ని నిలుపుదల చేశారు. చెన్నై నుంచి సూలూరు పేట వైపుగా వెళ్లే రైళ్లను రేణిగుంట వైపుగా దారి మళ్లించారు. క్రమంగా వర్షం తీవ్రత పెరగడంతో ఒంటి గంట సమయంలో చెన్నై విమానాశ్రయాన్ని సైతం మూసి వేస్తూ చర్యలు తీసుకున్నారు. నాలుగు గంటల ప్రళయం సరిగ్గా ఒంటి గంట సమయంలో వర్షం తీవ్రతతో పాటుగా ఈదురు గాలుల ప్రభావం పెరిగింది. ఎదురుగా ఎవ్వరున్నారో అన్నది కూడా తెలియని రీతిలో గాలుల బీభత్సం, వర్షం జోరు వెరసి జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశాయి. వర్ద చెన్నై హార్బర్ సమీపంలోకి దూసుకు వస్తున్న కొద్ది గాలుల తీవ్రత తాండవం చేసింది. ఎక్కడిక్కడ హోర్డింగ్‌లు, వృక్షాలు, చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, తీగలు అనేక చోట్ల విరిగి పడ్డాయి. మూడు, నాలుగు అంతస్తుల్లోని డాబా లాంటి గృహాలకు వేసిన రేకులు గాల్లో ఎగిరాయి. ఇళ్ల మీదున్న ప్లాస్టిక్ వాటార్ ట్యాంక్‌లు గాల్లో ఎగిరాయి. అనేక చోట్ల హోర్డింగ్‌లు, పెట్రోల్ బంకుల షెడ్డులు గాలిలో తేలియాడాయి. మూడున్నర నాలుగు గంటల సమయంలో అయితే, తీవ్రత మరింత జఠిలం కావడంతో అర చేతిలో ప్రాణాల్ని పెట్టుకుని జనం బిక్కు బిక్కు మంటూ ఇళ్లల్లో గడిపారు. ఏమి జరుగుతుందో, ఎలాంటి ప్రళయాన్ని మళ్లీ ఎదుర్కొనాలో, మళ్లీ వరదలు వస్తాయో అన్నంత ఉత్కంఠతో కాలం గడిపినా, ఐదున్నర , ఆరు గంటలకు గాలి భీబత్సం, వర్షం విలయం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినా, గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో మళ్లీ వర్షం వస్తుందేమోనన్న ఆంధోళన తప్పలేదు.ఏ రోడ్డు చూసినా : చెన్నై మహానగరంలో ఏరోడ్డులో చూసినా విరిగిన చెట్టు కొమ్మలు , నేల కొరిగిన చెట్లే, రోడ్డుకు ఇరు వైపులా అనేక చోట్ల ఉండే దుకాణాల బోర్డులు, వివిధ సంస్థల బోర్డులన్నీ రోడ్ల మీద వచ్చి పడ్డాయి. దుకాణాలన్నీ ముందుగానే మూత పడటంతో ప్రాణ, వ్యక్తిగత ఆస్తినష్టాల నుంచి ఆయా యజమానులు బయట పడ్డారు. సముద్ర తీరం వెంబడి ఉన్న ఎన్నూరు, తిరువొత్తియూరు, పట్టినంబాక్కం, హార్బర్ పరిసరాల్లో అయితే, అలల తాకిడికి అడ్డుగా వేసిన రాళ్లు పెద్ద ఎత్తున రోడ్డ మీదకు వచ్చి పడ్డాయి. చెన్నై సైదా పేట నుంచి కోట్టూరు పురం వరకు రోడ్డుకు ఇరు వైపులా ఆహ్లాదకరంగా ఉ ండే చెట్లు ఇప్పుడు కానరాలేదు. అవన్నీ నేలకొరిగాయి. చెన్నైలో 224 రోడ్లను తాత్కాళికంగా మూసి వేశారు. దీన్ని బట్టి చూస్తే, ఇతర జిల్లాల్లో, శివారుల్లో పరిస్థితి ఏ మేరకు ఉంటుందో అన్న ఆందోళన తప్పదు. ఏ రోడ్లులో చూసినా ఏదో ఒక కారు లేదా ఆటో, మోటారు సైకిల్ చెట్ల శిథిలాల కింద నుజ్జు నుజ్జు కాక తప్పలేదు. ఇక, సముద్ర తీరాల్లోని వందలాది రేకుల ఇళ్ల పైకప్పులు గాల్లోకి ఎగరడంతో అక్కడి బాధితులను అధికార వర్గాలు ఆగమేఘాలపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుడిసె వాసుల వేతలు వర్ణణాతీతం. అనేక చోట్ల అధికారులు హెచ్చరించినా, ఖాతరు చేయని వాళ్లు , చివరకు గాలి వాన భీబత్సంలో చిక్కుకుని తల్లడిల్లక తప్పలేదు. యుద్ద ప్రాతిపదికన: ఆయా ప్రాంతాల్లో యువత, స్థానికులు స్వచ్చందంగా ముందుకు కదిలారు. రోడ్ల మీద పడ్డ కొమ్మల్ని తొలగించే పనిలో పడ్డారు. అయితే, అతి పెద్ద చెట్లను తొలగించేందుకు కష్టతరంగా మారాయి. అర్థరాత్రిలోపు వీటిని తొలగించేందుకు తగ్గట్టుగా ఇతర ప్రాంతాల నుంచి ఆగమేఘాలపై సిబ్బందిని రప్పించి ఉన్నారు. చెన్నై విమానాశ్రయం రన్ వేల్లోకి నీళ్లు చేరడం, కొన్ని చోట్ల దెబ్బ తినడం వెరసి విమానాల సేవలన్నీ అర్థరాత్రి వరకు రద్దు అయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈదురుగాలులలకు, వర్షం తోడవడంతో ఆందోళన తప్పడం లేదు. వర్ష బీభత్సంలో నలుగురు మరణించినట్లు సమాచారం. ఆగమేఘాలపై పునరుద్ధరణ చర్యల అనంతరం అర్థరాత్రి తర్వాత సేవలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక, చెన్నైలో తెగి పడ్డ విద్యుత్ తీగలను యుద్ద ప్రాతిపదికన సరి చేసే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. అర్థరాత్రిలోపు చెన్నై నగరానికి, మంగళవారం సాయంత్రంలోపు చెన్నై శివారుల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని ఆ శాఖ మంత్రి తంగమణి తెలిపారు. అంత వరకు అందకారంలో మునగాల్సిన పరిíస్థితి. ఇక, యుద్ద ప్రాతిపకన సాగుతున్న చర్యల్లో జాతీయ విపత్తుల నివారణ బందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏ మేరకు నష్టం తీవ్ర అన్నది ఉంటుందో మంగళారం నాటికి తేలే అవకాశాలు ఉన్నాయి. ఇక, అధికారుల్ని సీఎం పన్నీరు సెల్వం అప్రమత్తం చేస్తూ, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యల్లో సిబ్బంది ఉన్నారని ప్రజలు సహకరించాలని కోరారు. రాజ్‌నాథ్ ఆరా : చెన్నై తీరాన్ని వార్ధా సమీపించినానంతరం కేంద్ర హోం శాఖ మంత్రి తమిళనాడు సీఎఎం పన్నీరు సెల్వంతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో కేంద్రం సహకారం అందిస్తుందని పన్నీరుకు ఆయన హామీ ఇచ్చారు. 22 ఏళ్ల అనంతరం : ప్రళయాలన్నీ చెన్నైను డిసెంబరు నెలలోనే వెంటాడుతున్నాయి. గతంలో అనేక తుఫాన్లు వచ్చినా, వాటి ప్రభావం తక్కువే. 1994లో వచ్చిన తుఫాన్ వంద కి.మీ వేగంతో చెన్నై వైపుగా దూసుకొచ్చి ప్రళయాన్ని సష్టించింది. తదుపరి గత ఏడాది వర్షాలతో వరద విలయం. ఈ ఏడాది గతంలో ఎ న్నడూ లేని రీతిలో తాండవం. వర్షం తీవ్ర కన్నా, గాలి ప్రభావం మరీ ఎక్కువగా ఉండటంతో జనం విల విలలాడాల్సి వచ్చింది. 192 కి.మీ వేగంతో గాలులు దూసుకొచ్చినట్టుగా వాతావరణ కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక, మీనంబాక్కంలో నాలుగు గంటల పాటుగా అత్యధికంగా 18 సె.మీ వర్షం పడింది. -
తీవ్ర పెను తుపానుగా ‘వార్దా’
విశాఖపట్నం/ అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను రోజు రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. నిన్నటిదాకా తీవ్ర తుపానుగా కొనసాగిన వార్దా.. ఆదివారం ఉదయానికి తీవ్ర పెను తుపానుగా మారింది. ఇది గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు దూసుకువస్తోంది. శనివారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 520, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 490, చెన్నైకి తూర్పున 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈతీవ్ర పెను తుపాను పశ్చిమ వాయువ్య దిశగా అదే తీవ్రతతో ఆదివారం సాయంత్రం వరకు పయనించనుంది. అనంతరం క్రమేపీ బలహీనపడుతూ దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించి చెన్నై–ఒంగోలు మధ్య ఈనెల 12న (సోమవారం) మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురుస్తుందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాను, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని వివరించింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి గంటకు 130 నుంచి 155 కిలోమీటర్ల వేగంతోను, కోస్తాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అందువల్ల వచ్చే 48 గంటలపాటు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు అప్రమత్తం... వార్దా తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కోస్తా, రాయలసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తుపానును ఎదుర్కొనేందుకు సర్వ సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు నిత్యావసర సరుకులు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వాన రావొచ్చు,కుప్పలు వేస్కోండి! బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుపాను నెల్లూరు వైపు వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోసి పనలపై ఉన్న వరిని తక్షణమే కుప్పలు వేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ కె.ధనుంజయ్‌రెడ్డి ఆదేశాల మేరకు కోస్తాంధ్రలోని వ్యవసాయాధికారులు గత మూడు రోజులుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోసిన పంటను సాధ్యమైనంత త్వరగా కుప్పలు వేసుకోవాలని, ఒకవేళ కోతకు వచ్చి ఉంటే ఒకట్రెండు రోజులు వాయిదా వేయాలని, పాయలు తీసి నీళ్లు పోయే మార్గం ఏర్పాటు చేయమని రైతులకు సలహా ఇచ్చారు. వాస్తవానికి వర్షాభావంతో అల్లాడుతున్న రాష్ట్రానికి ఈ తుపానుతోనైనా వర్షం పడుతుందన్న ఆశాభావంతో వ్యవసాయ శాఖ ఉంది. రబీలో ఇప్పటికే దాదాపు 90 శాతం లోటు ఏర్పడింది. -
అతి తీవ్ర తుపానుగా ‘వార్దా’