breaking news
Virgin Galactic
-
అంతరిక్షయానం టికెట్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
అంతరిక్షంలోకి ప్రయాణించాలనే వారి కోసం అమెరికాకు చెందిన వర్జిన గెలాక్టిక్ అనే సంస్థ టికెట్లను తిరిగి అమ్మడం ప్రారంభించింది. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లను నడపాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది. గత ఏడాది జూలైలో వర్జిన్ గెలాక్టిక్ పూర్తి సిబ్బందితో అంతరిక్షయానం చేసిన ఆరుగురిలో కంపెనీ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఉన్నారు. ఆ అంతరిక్షయానం విజయవంతం కావడంతో ఆసక్తి గల పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని నిర్ణయించింది. ఈ టికెట్ ధరను 4.5 లక్షల డాలర్లు(సుమారు రూ. 3.37 కోట్లు)గా నిర్ణయించినట్లు పేర్కొంది. టికెట్ కావాలనుకున్న వారు ముందుగా 1.5 లక్షల డాలర్లను డిపాజిట్ చేయాలని.. మిగిలిన మెుత్తాన్ని ప్రయాణానికి ముందు చెల్లించవచ్చని వర్జిన్ గెలాక్టిక్ స్పష్టం చేసింది. "ఈ సంవత్సరం చివరి నాటికి 1000 మంది ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు" సీఈఓ మైఖెల్ కాల్ గ్లాజియెర్ అన్నారు. గత ఏడాది నవంబర్ నాటికి కంపెనీ 700 టికెట్స్ విక్రయించినట్లు తెలిపింది. 2004లో స్థాపించబడిన వర్జిన్ గెలాక్టిక్ గత జూలైలో హై ప్రొఫైల్ టెస్ట్ మిషన్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. 2022 చివరి నాటికి తన మొదటి చెల్లింపులు చేసిన వినియోగదారులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలి అనేది సంస్థ లక్ష్యం. There are few things as transformative as seeing Earth from above. Reserve your seat to experience something extraordinary. Spaceflight reservations are now open at https://t.co/5UalYT7Hjb. pic.twitter.com/9hnrjwBdG7 — Virgin Galactic (@virgingalactic) February 16, 2022 అంతరిక్షయానం కోసం టికెట్ బుక్ చేసుకునే టూరిస్టులకు న్యూ మెక్సికో, యూఎస్ఏలోని స్పేస్ పోర్ట్ అమెరికా హోటల్ లో కొన్ని రోజుల పాటు విడిధి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విడిధి పర్యటనకు ముందు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మెుదటి స్పెస్ ఫ్లైట్ టూర్ ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రయాణం సుమారు 90 నిమిషాలు పాటు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులు వెయిట్ లెస్ నెస్ స్థితిని అనుభూతి చెందుతారని వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. ఇప్పటికే వాణిజ్య ప్రయాణీకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్, ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థలు స్పేస్ టూరిజం రంగంలో ఒకదాని వెనుక మరొకటి పోటీ పడుతున్నాయి. (చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త..!) -
అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్‌లో ఎగిరేందుకు ఆఫర్ ఇచ్చి..!
అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్‌లో ఎగిరేందుకు ఆఫర్ ఇవ్వడం అంటే ఇదేనేమో. ఆంటిగ్వా - బార్బుడా దేశానికి చెందిన తల్లికూతుళ్లు ఫ్రీగా స్పేస్ ట్రావెల్ చేసేందుకు టికెట్లను సొంతం చేసుకున్నారు. త్వరలో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూర్‌ను ప్రారంభించనుంది. ఈ టూర్లో పాల్గొనేందుకు ఆంటిగ్వా - బార్బుడాకి చెందిన 44 ఏళ్ల కైషా షాహాఫ్, బ్రిటన్‌లో నివసిస్తున్న ఆమె కూతురు 17 ఏళ్ల సైన్స్ విద్యార్థితో కలిసి ఉచితంగా నింగిలోకి ఎగరనున్నారు. This is the moment we told Keisha Schahaff she’s won @virgingalactic’s @omaze competition and she’s going to space… Her reaction brought tears to my eyes! https://t.co/F6iBgXC5P0 @spacehumanity pic.twitter.com/G9VXuMAhTi — Richard Branson (@richardbranson) November 24, 2021 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం వర్జిన్ గెలాక్టిక్ - స్వీప్స్ టేక్ తో కలిసి ఫండ్ రైజింగ్ 'ఓమెజ్'లో 1.7మిలియన్ డాలర్లు ఫండ్ రైజ్ చేసింది. 8 వారాల పాటు నిర్వహించిన ఈ ఫండ్ రైజింగ్ కోసం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రత్యేకంగా లాటరీ పద్దతిని ఏర్పాటు చేశారు. మినిమం 10డాలర్లతో టోకన్తో ఫండ్ రైజ్ చేయొచ్చు. ఇలా ఈ ఫండ్ రైజింగ్ లో వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, ముఖ్యంగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునేవారికి, లేదంటే నాసాలో పనిచేయాలనుకునే వారికి క్యాష్ రూపంలో కాకుండా బహుమతి రూపంలో అందిస్తున్నట్లు రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో 165,000 మంది ఫండ్ రైజింగ్‌లో పాల్గొన్నారు. 8 వారాల పాటు నిర్విరామంగా జరిగిన అనంతరం ఇందులో విన్నర్స్‌ను రిచర్డ్స్ బ్రాన్స్‌న్ ప్రకటించారు. అంతేకాదు గెలిచిన వారికి స్వయంగా ఇంటికి వెళ్లి బహుమతులందిస్తున్నారు. అలా స్పేస్‌లోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్న కైషా షాహాఫ్ ఇంటికి వెళ్లి రిచర్డ్స్ బ్రాన్స్‌న్ ఆశ్చర్యపరిచారు. దీంతో గెలుపుపై కైషా షాహాఫ్ సంతోషం వ్యక్తం చేశారు. కూతురుతో కలిసి స్పేస్‌లోకి వెళ్లే కోరిక నెరవేరుతుందని అన్నారు. చదవండి: అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్‌బుక్‌కు పెద్ద దెబ్బే..! -
సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..!
ఇంటర్నెట్ అనగానే మనకు సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు, ఇళ్లలో వైఫైలు గుర్తొస్తాయి. కానీ.. ఇక ముందు అవేమీ ఉండవు. సెల్ సిగ్నల్‌తో పనిలేకుండా నేరుగా ఫోన్లకు, ఇంటిమీద చిన్న యాంటెన్నాతో కంప్యూటర్లకు ఇంటర్నెట్ రానుంది. ఇదంతా శాటిలైట్ ఇంటర్నెట్ మహిమ. ఇప్పటికైతే కేబుల్ ఇంటర్నెట్ బాగానే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లపై చైనా ఆధిపత్య యత్నాలు వంటివి శాటిలైట్ ఇంటర్నెట్కు దారులు తెరుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు రంగంలోకి దిగాయి కూడా. ఈ సంగతులు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రస్తుతానికి కేబుళ్లదే రాజ్యం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇంటర్నెట్కు సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే కీలకం. ప్రస్తుతం సముద్రాల అడుగున 13 లక్షల కిలోమీటర్ల పొడవైన 428 ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ఉన్నాయి. అన్నిదేశాల మధ్య మొత్తం ఇంటర్నెట్ డేటాలో 98 శాతం సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతోంది. కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అందులోనూ గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వీటి అనుబంధ కంపెనీలకు సంబంధించిన డేటానే భారీగా ఉంటోంది. అందుకే ఈ కంపెనీలు సబ్‌మెరైన్ కేబుల్స్ వేసే పనిలోకి దిగాయి. ఇందుకోసం గత ఐదేళ్లలోనే రూ.12 వేల కోట్ల వరకు ఖర్చుపెట్టాయి. చైనా కంపెనీల వివాదంతో.. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు నిర్మిస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా చైనా కంపెనీ హువావే పెద్ద మొత్తంలో కేబుళ్ల నిర్మాణ కాంట్రాక్టులు చేస్తోంది. దీనిపై అమెరికా సహా పలు కీలక దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా తమ దేశానికి చెందిన టెక్ కంపెనీల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం, ఇతర విపత్కర పరిస్థితులు వస్తే.. ఆధిపత్యం కోసం చైనా ఏమైనా చేసేందుకు సిద్ధమన్న ఆందోళనలూ ఉన్నాయి. హువావే కంపెనీ నిర్మించి, నిర్వహిస్తున్న సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడవచ్చని.. దేశాలకు, వ్యక్తులకు సంబంధించి రహస్య సమాచారం, వ్యూహాలను తెలుసుకోవచ్చని.. ఇంటర్నెట్ను స్తంభింపజేయవచ్చని అమెరికా కొద్దిరోజుల కింద హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్ సంస్థ, ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల ప్రభుత్వాలు కేబుళ్ల నిర్మాణం, నిర్వహణలో చైనా కంపెనీల భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి. భవిష్యత్తు శాటిలైట్ ఇంటర్నెట్దే.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల విషయంగా టెక్ యుద్ధం జరుగుతుండటంతో.. ప్రత్యామ్నాయమైన శాటిలైట్ ఇంటర్నెట్పై దృష్టి పడింది. ఈ విధానంలో మన ఫోన్ నుంచే నేరుగా శాటిలైట్‌కు అనుసంధానమై ఇంటర్నెట్ను పొందడానికి అవకాశం ఉంటుంది. అదే కంప్యూటర్లు అయితే కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్కు అనుసంధానం కావడానికి వీలుంటుంది. అడవులు, కొండలు, గుట్టలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ అందుకోవచ్చు. ఇప్పటికే నాసా సహా పలు దేశాల అంతరిక్ష సంస్థలు పరిమిత స్థాయిలో శాటిలైట్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో కాలుపెట్టాయి. వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ కూడా వన్‌వెబ్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థను నెలకొల్పారు. త్వరలోనే శాటిలైట్లను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ వంటి పలు కంపెనీలు ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పరిమిత సేవలు అందిస్తున్నాయి. 4,425 శాటిలైట్లతో ‘స్టార్ లింక్’ టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. మొత్తంగా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,600కుపైగా శాటిలైట్లను పంపారు. కేబుల్, శాటిలైట్.. డేటా ప్రయాణం ఇలా.. ఉదాహరణకు మనం అమెరికాలోని వ్యక్తికి ఒక ఈ–మెయిల్ పంపితే.. ఈ–మెయిల్లోని టెక్ట్స్, ఫొటోలు వంటి సమాచారం మన సెల్‌ఫోన్/కంప్యూటర్ నుంచి.. సెల్‌ఫోన్ టవర్/రూటర్ మీదుగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు.. అక్కడి నుంచి సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసే ల్యాండింగ్ ఆఫీస్‌కు చేరుతుంది. తర్వాత సముద్రం అడుగున ఉన్న (సబ్‌మెరైన్) కేబుళ్ల ద్వారా ప్రయాణించి అమెరికా తీరంలోని ల్యాండింగ్ ఆఫీస్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు.. సెల్‌ఫోన్ టవర్/రూటర్ ద్వారా సదరు వ్యక్తి సెల్‌ఫోన్/కంప్యూటర్‌కు డేటా చేరుకుంటుంది. ఇదే శాటిలైట్ ఇంటర్నెట్ అయితే.. మన సెల్‌ఫోన్/ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరం అమర్చిన కంప్యూటర్ నుంచి డేటా నేరుగా సమీపంలోని శాటిలైట్‌కు చేరుతుంది. దాని నుంచి అమెరికాపైన ఉన్న మరో శాటిలైట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని నుంచి నేరుగా సెల్‌ఫోన్/ రిసీవర్ ఉన్న కంప్యూటర్‌కు చేరుతుంది. శాటిలైట్ ద్వారా డేటా బదిలీ కాస్త సులువుగా కనిపిస్తున్నా.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. ఫోన్లు, శాటిలైట్లు, రిసీవర్ల మధ్య డేటా ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు ప్రతిసారి ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరమవుతాయి. అదే కేబుల్ ద్వారా అయితే.. ఇరువైపులా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద మాత్రమే ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరం.