breaking news
vibration
-
ఇక చక్కెరతో సెల్ ఫోన్ ఛార్జింగ్!
చక్కెర తింటే మనకు వెంటనే కొంత శక్తి వస్తుంది కదూ.. ఇదే శక్తిని సెల్‌ఫోన్ బ్యాటరీలకు అందించగలిగితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే స్మార్ట్ఫోన్లకు పది రోజుల పాటు చార్జింగ్ అందించే టెక్నాలజీకి దారితీసింది. వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్ట్యూట్లో పరిశోధకులు కొత్తగా ఓ బయో బ్యాటరీని రూపొందించారు. దీని బరువు సెల్ఫోన్లలో ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీ కంటే చాలా తక్కువ, శక్తి చాలా ఎక్కువ. సాధారణంగా మన శరీరంలో చక్కెర జీవక్రియ ద్వారా శక్తిగా మారుతుంది. అక్కడ కార్బన్ డయాక్సైడ్, నీరుగా మారి.. ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. బయో బ్యాటరీలు కూడా ఇదే పద్ధతిలో పనిచేసీ, ఈ ఎలక్ట్రాన్లను ఉపయోగించుకుని శక్తిగా మారుస్తాయి. ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. అందువల్ల సంప్రదాయ బ్యాటరీల కంటే వెయ్యిరెట్లు నయమన్నమాట. లిథియం అయాన్ బ్యాటరీతో ఫోను కేవలం ఒక్కరోజు పనిచేస్తే.. చక్కెర బ్యాటరీతో పదిరోజులు పనిచేస్తుంది. -
ఇక వైబ్రేషన్ తోనే ఫోన్ ఛార్జింగ్!
న్యూయార్క్: ఏదైనా వాహనంలో వెళుతున్నప్పుడు మన వద్ద నున్న స్మార్ట్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే ఎంతో సతమవుతూ ఉంటాం. ఆఫీస్ కి వెళ్లే సమయంలోనో.. ఇంటికి వెళ్లే సమయంలోనో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇదే పరిస్థితి దాపురిస్తే ఎంతో మదనపడుతుంటాం. ఇక నుంచి ఆ బాధలను విముక్తి చేసేందేకు ఇంజనీర్లు వినూత్న ఛార్జింగ్ విధానాన్ని అభివృద్ది చేశారు. రైలు, బస్సు, బైక్..వాహనం ఏదైనా గానీ ఛార్జింగ్ అయిపోయినా సెల్ ఫోన్ కు వైరు లేకుండా ఛార్జింగ్ అయ్యే పద్ధతిని త్వరలో మనముందుకు తీసుకురానున్నారు. ఎలాంటి విద్యుత్ వైరూ అవసరం లేని నానో-జనరేటర్‌ను సెల్ ఫోన్లోనే అంతర్గతంగా అమర్చుతారు. అది సెల్‌ఫోన్ గురయ్యే వైబ్రేషన్ల ద్వారా తనకు తానే విద్యుత్‌ను ఉత్పత్తిచేసుకుని సెల్‌ఫోన్‌ను చార్జ్ చేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జుడాంగ్ వాంగ్, చైనాలోని సన్ యట్సేన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిన్నొసెటా శాస్త్రవేత్తల బందం దీనిని ఆవిష్కరించారు. ఈ నానో-జనరేటర్ ద్వారా వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు తనకు తానుగానే ఛార్జింగ్ చేసుకునేందుకు కొత్త పరిష్కారం లభిస్తుందని వాంగ్ తెలిపారు.