‘వనబంధు’ను విస్తరించండి: కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజనుల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వనబంధు కల్యాణ యోజన పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వాంఖిడి పరిధిలో ఈ కార్యక్రమం కింద విద్య, ఉపాధికల్పన, రక్షిత మంచినీరు, క్రీడలు వంటి ఆయా పనులు చేపడుతున్నారు. ఈ పథకాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని పేర్కొంది.
సోమవారం కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శి అశోక్ ఝా, సంయుక్త కార్యదర్శులు మనోజ్‌కుమార్ పింగ్వూ, పాయ్ 18 రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి జీడీ అరుణ, కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, అధికారులు పాల్గొన్నారు.