టిప్పర్-లారీ ఢీ:సజీవ దహనమైన టిప్పర్ డ్రైవర్
రంగారెడ్డి: జిల్లాలోని షాబాద్ మండలం ఆస్పల్లిగూడ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్-లారీ పరస్పరం ఢీకొనడంతో మంటలు ఎగసి పడి టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మంటలకు సజీవ దహనమైన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని టిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలకు టిప్పర్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ అగ్నికి ఆహుతి అయ్యాడు. రెండు వాహనాలు అతి వేగంగా రావడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.