breaking news
tharik
-
బీజేపీకి మద్దతు ఇవ్వబోం
ఎన్సీపీ నేత తారిఖ్ స్పష్టీకరణ పాట్నా: మతతత్వ పార్టీలకు తాము దూరంగా ఉంటామని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకిగాని, శివసేనకు గాని తమ పార్టీ మద్దతు ఇచ్చే అంశం ఏదీ పరిశీలనలో లేదని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీకి తమ పార్టీ మద్దతు ఇవ్వనుందా అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. సైద్ధాంతికంగా తమ పార్టీల మధ్య ఉన్న వైరుద్ధ్యాల నేపథ్యంలో మద్దతు ఇవ్వబోమని కుండబద్దలు కొట్టారు. అవసరమైతే లౌకిక పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి విడిపోవడంతో మిగిలిన పార్టీలు లాభపడే అవకాశముందని ఆయన ఒప్పుకున్నారు. తమ కూటమి విడిపోవడం రెండు పార్టీలకూ పెద్ద దెబ్బేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఒంటరిగా బరిలో దిగడం వల్ల ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడనుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కేవలం 31 శాతం ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 69 శాతం ఓట్లు సాధించిన మిగిలిన పార్టీలు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని, అదే పరిస్థితి ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కానున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్‌లో వేరే పార్టీ అధికారంలో ఉన్నందున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపుతోందని తారిఖ్ విమర్శించారు. అలాగే గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీపై కేంద్రం ఇప్పుడు మాట్లాడటంలేదని ఆరోపించారు. -
తారిఖ్, సిమర్ ప్రీత్‌లకు అభినందన
హైదరాబాద్: జాతీయ స్థాయి టోర్నీలో రాణించిన హైదరాబాద్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు తారిఖ్, సిమర్ ప్రీత్‌లను స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) అభినందించింది. వీరిద్దరు రాజీవ్‌గాంధీ సాకర్ టోర్నమెంట్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇందులో రాణించిన తారిఖ్, సిమర్ ప్రీత్‌లు భారత ఫుట్‌బాల్ శిబిరానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్సీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో భారత సాకర్ జట్టు మాజీ సారథి విక్టర్ అమల్‌రాజ్ హాజరై వారిద్దరిని ప్రశంసించారు. రతిభ వుండి ఆర్థికంగా వెనుకబడిన ఇలాంటి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఎస్సీఎఫ్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని ఆ సంస్థ అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. యువతలోని ప్రతిభాపాటవాలను వెలికితెచ్చి వారి కలల్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని సీఏఏఆర్ఎంఐసీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రతినిధి కార్తీక్ దంతు పేర్కొన్నారు.