breaking news
Terms of Service
-
ఇలా చేయకుంటే... హెల్త్ క్లెయిమ్ తిరస్కరణ!
అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే.. ఆదుకుంటుందన్న భరోసాతోనే ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. తీరా అవసరం వచ్చినప్పుడు బీమా సంస్థ చెల్లింపులకు నిరాకరిస్తే..? పాలసీదారులు కంగుతినాల్సిందే. కరోనా ఆరోగ్య విషయంలో ఎంతో మందికి కళ్లు తెరిపించింది. ఆ ఫలితమే తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా పాలసీ నిబంధనలను కచి్చతంగా తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలో లోపం చోటుచేసుకుంటే, భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే రిస్క్ కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఒక్కసారిగా కుటుంబంపై ఆరి్థక భారం పడిపోతుంది. బీమా సంస్థ చెల్లింపులు చేయకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. వీటి పట్ల అవగాహన కలిగి ఉంటే, అలాంటి పరిస్థితులను నివారించొచ్చు. ఈ వివరాలు అందించే కథనమే ఇది. పాలసీ దరఖాస్తు పత్రంలో అప్పటికే తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెల్లడించడం తప్పనిసరి. లేదంటే భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా సమస్యలు ఎదురవుతాయి. పాలసీదారు ఆరోగ్య చరిత్ర ఆధారంగానే క్లెయిమ్ రిస్‌్కను బీమా సంస్థలు అంచనా వేస్తాయి. దానికి అనుగుణంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. చెప్పకపోతే బీమా సంస్థకు తెలియదుగా అని చెప్పి కొందరు అనారోగ్య సమస్యలను వెల్లడించరు. ఇది బీమా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. క్లెయిమ్ సమయంలో బీమా సంస్థలు వీటిని గుర్తించినట్టయితే.. చెల్లింపులకు నిరాకరించడంతోపాటు, కవరేజీని సైతం రద్దు చేయొచ్చు. ముందస్తు వ్యాధులనే కాదు, ఏదైనా అనారోగ్యానికి సంబంధించి లోగడ చికిత్స తీసుకున్నా వెల్లడించడమే మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అయితే, కుటుంబ సభ్యులందరి వైద్య చరిత్రను నమోదు చేయాలి. సరైన సమాచారం ఇవ్వాలిబీమా సంస్థకు సమరి్పంచే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పత్రంలో పూర్తి వివరాలు ఉండాలి. తేదీలు, చికిత్సల ప్రక్రియలకు సంబంధించి చిన్న దోషాలు కూడా ఉండకూడదు. రోగి వయసు, పేరులోనూ వ్యత్యాసాలు ఉండకూడదు. బీమా సంస్థలు ప్రతి క్లెయిమ్ దరఖాస్తును లోతుగా పరిశీలిస్తాయి. ఏవైనా వ్యత్యాసాలు గుర్తిస్తే మరింత సమాచారం కోరడం లేదా తిరస్కరించడం చేయొచ్చు. క్లెయిమ్ వచి్చనప్పుడు, అందులోని వ్యాధి నిర్ధారణ వివరాలను, అప్పటికే పాలసీదారు వైద్య చరిత్రతో పోల్చి చూస్తాయి. హాస్పిటల్ రికార్డులు, డాక్టర్ నోట్లను పరిశీలిస్తాయి. ఈ సమయంలో వ్యత్యాసాలు కనిపిస్తే చెల్లింపులను నిరాకరిస్తాయి. పాలసీ పత్రంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి నట్టు గుర్తిస్తే దాన్ని మోసం కింద పరిగణిస్తాయి. దీంతో క్లెయిమ్ రాకపోవడం కాదు, పాలసీ కూడా రద్దు కావచ్చు. అదనపు సమాచారం, వివరణ, డాక్యుమెంట్లను బీమా కంపెనీ కోరొచ్చు. దీంతో నగదు రహిత క్లెయిమ్ కాకుండా రీయింబర్స్మెంట్ మార్గంలో రావాలని కోరే అధికారం సైతం బీమా సంస్థకు ఉంటుంది. ముఖ్యంగా రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌కు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి.మినహాయింపులు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారు తమ పాలసీ పరంగా ఉన్న మినహాయింపుల గురించి కచి్చతంగా తెలుసుకోవాలి. దీనివల్ల క్లెయిమ్ పరంగా సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. కొన్ని రకాల అనారోగ్యాలు, చికిత్సలు లేదా సేవలకు కొన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. నిబంధనల్లో మార్పులు కొన్ని సందర్భాల్లో పాలసీ నిబంధనలు, ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా క్లెయిమ్‌లకు తిరస్కారం ఎదురవుతుంది. వాస్తవానికి ఇలాంటి వాటి గురించి పాలసీదారులకు బీమా సంస్థలు విధిగా తెలియజేస్తాయి.సకాలంలో తెలపాలి.. ముందస్తుగా నిర్ణయించుకుని తీసుకునే నగదు రహిత చికిత్సలకు కనీసం 48 గంటల ముందు బీమా సంస్థకు తెలియజేయాలి. అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రిలో చేరినప్పుడు నగదు రహిత క్లెయిమ్‌కు సంబంధించి 24 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ పెట్టుకునే వారు సైతం.. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలు అయితే 48 గంటల ముందుగా, అత్యవసరంగా ఆస్పత్రిలో చేరితే 24–48 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సిందే. ఇక రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు, డాక్యుమెంట్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 30 రోజుల్లోపు సమరి్పంచాలి. బీమా సంస్థల మధ్య ఈ గడువులో వ్యత్యాసం ఉండొచ్చు. పాలసీ ల్యాప్స్ పాలసీ ప్రీమియం గడువు మించకుండా చెల్లించాలి. లేదంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఇలా ల్యాప్స్ అయిన పాలసీలకు సంబంధించి క్లెయిమ్‌లను బీమా సంస్థలు అనుమతించవు. పాలసీ గడువు ముగిసిన తర్వాత 15–30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కనీసం ఈ కాలంలో అయినా ప్రీమియం చెల్లించాలి. లేదంటే పాలసీ రద్దయిపోతుంది. దీంతో బీమా కవరేజీ కోల్పోయినట్టు అవుతుంది. ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకునే వరకు కవరేజీ ఉండదు. వెయిటింగ్ పీరియడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న తర్వాత కొన్ని రకాల క్లెయిమ్‌లకు వెయిటింగ్ పీరియడ్ (వేచి ఉండాల్సిన కాలం) ఉంటుంది. ఆ కాలంలో వచ్చే క్లెయిమ్‌లను బీమా సంస్థలు తోసిపుచ్చుతాయి. హెరి్నయా, క్యాటరాక్ట్, చెవి, ముక్కు, గొంతు సమస్యలు (ఈఎన్టీ), మోకాలి చిప్ప మారి్పడి తదితర చికిత్సలకు రెండేళ్ల పాటు వెయిటింగ్ ఉంటుంది. అలాగే, పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు సైతం క్లెయిమ్ కోసం నిర్ధేశిత కాలం పాటు వేచి ఉండాల్సిందే. ఆ కాలంలో క్లెయిమ్‌లను అనుమతించరు. కవరేజీ ఖర్చయిపోతే.. ఒక పాలసీ సంవత్సరంలో నిర్దేశిత కవరేజీ మొత్తం వినియోగించుకున్న తర్వాత వచ్చే క్లెయిమ్‌లకు బీమా సంస్థలు చెల్లింపులు చేయవు. అందుకే అన్ లిమిటెడ్ రీస్టోరేషన్ సదుపాయం ఉన్న పాలసీని తీసుకోవాలి. అప్పుడు బీమా ఖర్చయిపోయినా, తిరిగి అంతే మొత్తాన్ని పునరుద్దరిస్తాయి. ముందస్తు అనుమతి.. కొన్ని రకాల చికిత్సలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ బీమా సంస్థ నిబంధనలు విధించొచ్చు. అలాంటి వాటిపై ముందే అవగాహన ఉంటే క్లెయిమ్ నిరాకరణకు నోచుకోదు.తిరస్కరిస్తే ఏంటీ మార్గం? బీమా సంస్థ సహేతుక కారణం లేకుండా చెల్లింపులకు నిరాకరిస్తే చూస్తూ ఉండిపోనక్కర్లేదు. పాలసీ నియమ, నిబంధనలను ఒక్కసారి పూర్తిగా అధ్యయనం చేయాలి. ‘పాలసీ వర్డింగ్స్’లో పూర్తి వివరాలు ఉంటాయి. క్లెయిమ్ తిరస్కరించడానికి కారణాలు తెలుసుకోవాలి. రిజెక్షన్ లెటర్లో ఈ వివరాలు ఉంటాయి. బీమా సంస్థ నిర్ణయం వాస్తవికంగా లేదని భావిస్తే అప్పుడు అప్పీల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి బీమా సంస్థలోనూ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (ఫిర్యాదుల పరిష్కార) విభాగం ఉంటుంది. క్లెయిమ్ నిరాకరించడానికి తగిన కారణాలు లేవంటూ వారికి ఫిర్యాదు సమరి్పంచాలి. పరిష్కారం లభించకపోతే అప్పుడు బీమా అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే అప్పుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించొచ్చు. క్లెయిమ్ పూర్తిగా కాకుండా, పాక్షికంగా చెల్లింపులు చేసిన సందర్భాల్లోనూ పాలసీదారులు న్యాయం కోరొచ్చు. ఐఆర్డీఏఐ... ఐఆర్డీఏఐ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సెల్‌ను సంప్రదించొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లు 155255 లేదా 1800 4254 732కు కాల్ చేసి చెప్పొచ్చు. లేదా complaints@irdai.gov.inకు మెయిల్ పంపొచ్చు. లేదా ఐఆర్‌డీఏకు చెందిన https://irdai. gov.in/ igms1 పోర్టల్ సాయంతో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. పరిష్కార వేదికలుఅంబుడ్స్మెన్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుల కోర్టుకు వెళ్లినా సరే పెద్దగా ఖర్చు కాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బ్యాంకింగ్ సేవలపై సమ్మె ప్రభావం పాక్షికం
నిల్చిన 21 లక్షల చెక్కుల క్లియరెన్సు లావాదేవీలు న్యూఢిల్లీ: బ్యాంకుల సిబ్బంది సమ్మెతో శుక్రవారం దాదాపు రూ. 16,000 కోట్ల విలువ చేసే 21 లక్షల చెక్కుల క్లియరెన్స్ నిల్చిపోయినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 3,50,000 మంది బ్యాంకర్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు.. క్లరికల్ ఉద్యోగులపై సర్వీసు నిబంధనలను ఏకపక్షంగా రుద్దుతున్నాయన్న ఆరోపణలపై జరిగిన ఒక రోజు దేశవ్యాప్త సమ్మెతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షికంగా ప్రభావం పడింది. ఏఐబీఈఏ బలంగా ఉన్న బ్యాంకుల శాఖల్లో నగదు హ్యాండ్లింగ్, చెక్కుల క్లియరెన్సులు మొదలైన లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడింది. అధికారులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని, సిబ్బందిపై ఏకపక్షంగా నిబంధనలు రుద్దుతున్నాయన్న ఆరోపణలతో ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 28న సమ్మె నోటీసులు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా తమ 3,000 శాఖలు/కార్యాలయాల్లో దాదాపు 10,000 మంది, తెలంగాణలోని శాఖల్లో సుమారు 2,500 మంది పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు ఆంధ్రా బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం జనరల్ సెక్రటరీ ఎన్వీ రమణ తెలిపారు. కాగా, అనుబంధ బ్యాంకుల్లో సర్వీసు నిబంధనలు మార్చని పక్షంలో ఏఐబీఈఏ నిరవధిక సమ్మెకు దిగుతుందని, జనవరి 13న చెన్నైలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని రాజస్తాన్ ప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ మహేశ్ మిశ్రా తెలిపారు. -
సేవారధులు
నిరుపేదలకు అండగా ఉండాలని, వారి పిల్లల చదువులకు ఊతం అవ్వాలని తపిస్తున్న చిత్తా థామస్ రెడ్డి స్వస్థలం కడప జిల్లాలోని పోరుమామిళ్లపల్లి. థామస్‌రెడ్డి భార్య గీత. ఆమె పుట్టి పెరిగిన ఊరు అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఏటిపల్లి. ఈ ఇద్దరి గమ్యం సేవామార్గమే! అవసరార్థులకు సేవ చేయడమంటే ఆ దైవానికి సేవ చేయడమే అనే భావాలు ఇద్దరినీ కలిపాయి. పల్లెల్లో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడి చదువులు ఎలా ఉంటాయో, అర్ధంతరంగా పిల్లల చదువులు ఎందుకు ఆగిపోతాయో వారికి తెలుసు. అందుకే వీలైనంత మందికి విద్యాదానం చేయాలని శ్రమిస్తున్నారు. తమ గ్రామంలో అనారోగ్యంతో మగ్గిపోతున్న ఒంటరి చిన్నారిని చేరదీసి, తనకు తెలిసిన వైద్య సేవలు చేసిన గీతకు అక్కడ ప్రజల బాధలేంటో పన్నెండేళ్ల వయసులోనే అర్థమయ్యాయి. అందుకే పట్టుబట్టి డాక్టర్ అయ్యారు గీత. అలా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలు అందించడం, పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, బాలబాలికలకు ఆరోగ్య అవగాహన కలిగించడం తమ బాధ్యతగా భావించారు ఈ దంపతులు. వీరిద్దరి తపన, ఆరాటాలకు ప్రతిరూపమే పన్నెండేళ్ల క్రితం రూపుదిద్దుకున్న ‘ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్’. చేయూత కోసం అమెరికాలో... ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో తొలుత అక్కల రెడ్డి పల్లెలో చిత్తా శౌరిరెడ్డి స్మారక పాఠశాలను స్థాపించారు. 200 మందికి ఉచిత విద్య, వసతి కల్పించేటట్టుగా నిధులను పరిపుష్టం చేయడానికి ఈ దంపతులు ఎందరి సహకారాన్నో అర్థించారు. ఆ క్రమంలోనే అమెరికాలోని మిత్రులు కొందరు మేమున్నామంటూ ముందుకొచ్చారు. కొందరు వ్యక్తిగతంగా విద్యార్థులను దత్తత (స్పాన్సర్) తీసుకుంటామన్నారు. అప్పుడొచ్చింది వీరికో అద్భుతమైన ఆలోచన. ‘‘అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఎందరో మన దేశంలో నిరుపేదల కష్టాలకు తమ వంతు సేవలు అందించాలనుకున్నా, వారికి సరైన మార్గం దొరకడం లేదు. అలాంటి వారికీ ఇక్కడి అవసరార్థులకూ మధ్య వంతెనగా మారితే బావుంటుందని భావించాం’’అని గీత చెప్పారు. పదేళ్ల క్రితం ఆ ఆలోచనను ఆచరణలో పెడుతూ వీరు అమెరికా చేరారు. చికాగోలో కార్యాలయాన్ని స్థాపించారు. స్వదేశంలో ఉన్న నిరుపేద, అనాథ విద్యార్థులను గుర్తించడం, వారి వివరాలను దాతలకు అందజేయడం, ఆదుకోవడానికి ముందుకు వచ్చిన వారి సాయాన్ని భద్రంగా అవసరార్థులకు చేరేవేయడం.. ఇలా పారదర్శకంగా ఉంటుంది వీరి ఆచరణ. వీరి ప్రచారానికి ప్రభావితులైన వారి దయార్థ్ర హృదయం ఫలితంగా స్వదేశంలో ఈ దంపతుల సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరించాయి. పోరుమామిళ్లపల్లిలోని ఉచిత పాఠశాల విద్యార్థుల సంఖ్యను 400కి చేర్చడంతో పాటు నంద్యాలలోని నవజీవన్ మూగ పాఠశాలలోని 100మంది, మైదుకూరు వికలాంగ్ పాఠశాలలో 50 మంది.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ దంపతుల చేయూతను అందుకుంటున్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 2 వేలకు చేరుకుంది. ఒక్కో విద్యార్థి అవసరాన్ని బట్టి ఏడాదికి కనీసం రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు విద్యా సంబంధ ఖర్చులను వీరు దాతల ద్వారా సమకూరుస్తున్నారు. పుట్టిన గడ్డకు సేవలు... డాక్టర్ థామస్‌రెడ్డి దంపతులు స్టూడెంట్స్ స్పాన్సర్షిప్ ప్రోగ్రాంతో పాటు ఏటేటా డిసెంబరులో పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు, బి.మఠం మండలాల్లోని పేద అనాథ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. వృద్ధులకు నీడనివ్వాలనే ధ్యేయంతో ఆశ్రమం నెలకొల్పారు. మహిళలకు, వికలాంగులకు వృత్తి విద్యా కోర్సులు నేర్పించి బాసటగా నిలుస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో హుదూద్ తుపాన్ బాధితులను చేయూతనందించారు. వైద్యురాలైన గీత తరచుగా మురికివాడల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పల్లెటూరి యువతులు, మహిళల ఆరోగ్యం కోసం మొబైల్ క్లినిక్‌ను సైతం నడుపుతున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని సనత్‌నగర్, జెడ్ కాలనీలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘‘మన దేశానికి చెందిన దాతలకు - పేదలకు మధ్య వారధిగా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని’’ వివరించారు ఈ దంపతులు. ఇన్ని సేవాకార్యక్రమాలు చేస్తున్నారు మీ పిల్లల గురించి చెప్పండి.. అని అడిగితే- ‘‘మాకు రెండు వేల మంది పిల్లలు.. వారి సంఖ్య ముందు ముందు ఇంకా పెరగవచ్చు. వారిందరినీ చదివించి, జీవితంలో స్థిరపడేలా చేయాలన్నదే మా లక్ష్యం’’ అంటూ చెదరని చిరునవ్వుతో తెలిపారు గీతా యెరువా, చిత్తా థామస్ రెడ్డి దంపతులు. విదేశాలలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకొని, అనుకున్నది సాధించాక పుట్టిపెరిగిన నేలను ఏదైనా చేయాలనుకునేవారికి ఈ దంపతుల సేవాపథం తప్పక స్ఫూర్తినిస్తుంది. ఎన్ఆర్ఐలుగా ఉన్న థామస్‌రెడ్డి, గీత దంపతులు గ్రహణమొర్రి ఉన్న పేద పిల్లలకు ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు కర్నూలు జిల్లా నంద్యాలలో అమెరికా వైద్య బృందం చేత ఉచిత ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.