breaking news
Tennis grande slam
-
తగ్గేదేలే..! టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఇవే
టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన ఏ ఆటగాడైనా గెలవాలనే కసితోనే పోరాడతాడు. కొందరు ప్లేయర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకుంటే... మరికొందరు తుదికంటా పోరాడుతూ శక్తి మేరకు ప్రయత్నిస్తారు! టెన్నిస్ కోర్టులో అప్పుడప్పుడు సమఉజ్జీల సమరాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి క్షీణిస్తున్నా... చెమట ధారగా కారుతున్నా లెక్కచేయకుండా మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడినపుడు ఆ మ్యాచ్‌లు గంటలకొద్దీ సాగుతూ ఉంటాయి. ఇరువురు ప్లేయర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు చెలరేగిన మ్యాచ్‌లు సుదీర్ఘ పోరాటాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంటున్నాయి. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అలా రికార్డుల్లోకెక్కిన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే... శారీరక శ్రమ అధికంగా ఉండే టెన్నిస్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగడం పరిపాటే. తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) మధ్య పోరు 5 గంటల 35 నిమిషాల పాటు సాగి అభిమానులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇదే సుదీర్ఘమైన మ్యాచ్ కాగా.. గతంలో వింబుల్డన్ టోరీ్నలో ఇంతకుమించిన మ్యాచ్‌లు చాలా జరిగాయి. 2010 వింబుల్డన్ టోర్నీలో జాన్ ఇస్నెర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన పోరు ఇందులో ముందు వరుసలో నిలుస్తుంది.వర్షం అంతరాయం కలిగించడంతో... వరుసగా మూడు రోజులు సాగిన ఈ మారథాన్ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన పోరుగా రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే 7 గంటలకు పైగా సాగగా... మరో 14 మ్యాచ్‌లు ఆరు గంటలకు పైగా జరిగాయి. ప్లేయర్ల అలసట, అభిమానుల అసౌకర్యం, నిర్వాహకులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన టోర్నీల్లోని చివరి సెట్లోనూ ‘టైబ్రేకర్’ నిబంధనలు తీసుకొచ్చారు. 1970 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ‘టైబ్రేకర్’ అమలు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘ పోరాటాలకు ఒకింత బ్రేక్ పడింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో... 6 గంటల 33 నిమిషాలుసీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మారథాన్ మ్యాచ్‌లకు కొదువలేదు. 2004 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుదీర్ఘ మ్యాచ్ జరిగింది. రెండు రోజుల పాటు సాగిన పోరులో ఫ్రాన్స్‌కే చెందిన ఫాబ్రిస్ సాంతోరో, ఆర్నాడ్ క్లెమెంట్ తుదికంటా పోరాడారు. 6 గంటల 33 నిమిషాల తర్వాత ఫాబ్రిస్ సాంతోరో 6–4, 6–3, 6–7 (5/7), 3–6, 16–14తో ఆర్నాడ్ క్లెమెంట్పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదే సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. వింబుల్డన్‌లో ఇస్నెర్ డబుల్ ధమాకాటెన్నిస్ చరిత్రలో అత్యంత పురాతన గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్‌లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నెర్ ఒకటికి రెండుసార్లు ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. 2010 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఇస్నెర్, నికోలస్ మహుత్ మధ్య పోరు వరుసగా మూడు రోజుల పాటు నడిచింది. వర్షం కారణంగా అంతరాయాల నడుము జరిగిన పోరులో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై విజయం సాధించాడు. 11 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ పోరాటం... ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యంత సుదీర్ఘ పోరుగా చరిత్రకెక్కింది. ఇరువురు ఆటగాళ్లు గంటలకొద్దీ పట్టు వదలకుండా పోరాడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. మరో ఎనిమిదేళ్ల తర్వాత 2018 వింబుల్డన్ సెమీఫైనల్లో మరోసారి ఇలాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. 6 గంటల 36 నిమిషాల పాటు సాగిన పోరులో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో ఇస్నెర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో... 5 గంటల 53 నిమిషాలుటెన్నిస్ చరిత్రలో దిగ్గజ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా సుదీర్ఘ పోరాటాల్లో భాగస్వాములయ్యారు. గిరిగీసి బరిలోకి దిగితే అంతుచూసేవరకు వదలని స్వభావం గల ఈ ఇద్దరూ ఎన్నో సార్లు హోరాహోరీగా తలబడ్డారు. అందులో 2012 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఒకటి. 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ 5–7, 6–4, 6–2, 6–7 (5/7), 7–5తో నాదల్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి)అత్యంత సుదీర్ఘంగా సాగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్గానూ ఈ పోరు చరిత్రకెక్కింది. 1975కంటే ముందు టైబ్రేక్ నిబంధన లేదు.ఫలితంగా డేవిస్‌కప్‌లోనూ ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. 1975 తర్వాత నిర్ణాయక ఐదో సెట్ మినహా ఇతర సెట్లలో టైబ్రేక్లను అమలు చేయడం మొదలుపెట్టారు. 12 పాయింట్ల టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన ప్లేయర్‌కు సెట్ లభించేది. ఒకవేళ మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే స్కోరు 5–5 తర్వాత రెండు గేమ్‌ల ఆధిక్యం సంపాదించిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటించేవారు. 2016 నుంచి డేవిస్ కప్‌లోనూ నిబంధనలు మార్చారు. మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ 5 సెట్స్’ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ 3 సెట్స్’గా నిర్వహించడం ప్రారంభించారు. సెట్లో స్కోరు 6–6తో సమంగా నిలిస్తే టైబ్రేక్‌ను అమలు చేస్తున్నారు.డేవిస్ కప్‌లో సుదీర్ఘ పురుషుల సింగిల్స్ మ్యాచ్లుసమయం- విజేత -పరాజిత- ఏడాది- స్కోరు 👉6గం:43ని- లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)- జొవా సౌజా (బ్రెజిల్)- 2015- 7–6 (7/4), 7–6 (7/5), 5–7, 5–7, 15–13 👉6గం:22ని-జాన్ మెకన్రో (అమెరికా)-విలాండర్ (స్వీడన్) -1982- 9–7, 6–2, 15–17, 3–6, 8–6 👉6గం:21ని-బోరిస్ బెకర్ (జర్మనీ)-జాన్ మెకన్రో (అమెరికా)-1987-6–3, 6–2, 4–6, 14–12 👉6గం:15ని-జోస్ లూయిస్ క్లెర్క్ (అర్జెంటీనా)-జాన్ మెకన్రో (అమెరికా)-1980-6–3, 6–2, 4–6, 14–12 👉6గం: 04ని-హార్స్ స్కాఫ్ (ఆ్రస్టియా)- విలాండర్ (స్వీడన్)-1989-6–7 (5/7), 7–6 (9/7), 1–6, 6–4, 9–7 – సాక్షి క్రీడావిభాగం -
జొకోవిచ్‌కు షాక్!
వియన్నా: ప్రపంచ నంబర్ వన్, 17 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు ఊహించని ఓటమి ఎదురైంది. ఆస్ట్రియా రాజధానిలో జరుగుతున్న వియన్నా ఓపెన్‌లో అనామక ఆటగాడు లొరెంజో సొనెగొ (ఇటలీ) చేతిలో అతను కంగుతిన్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జొకోవిచ్ 2–6, 1–6తో లొరెంజో చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2005 ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ ఓటమి తర్వాత జొకోవిచ్‌కు ఎదురైన దారుణ పరాభవం ఇదే కావడం విశేషం. ఈ రెండు మ్యాచ్‌ల్లో జొకోవిచ్ కేవలం మూడు గేములను మాత్రమే సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే తడబడ్డ జొకోవిచ్... ఎక్కడా ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారి కూడా సఫలం కాలేదు. ఈ మ్యాచ్‌లో లొరెంజో ఎనిమిది ఏస్‌లను కొట్టగా... జొకోవిచ్ కేవలం మూడు ఏస్‌లను మాత్రమే సంధించాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఓడి ఈ టోర్నీకి ముందుగా అర్హత సాధించలేకపోయిన 42వ ర్యాంకర్ లొరెంజో...అదృష్టం కలిసొచ్చి ‘లక్కీ లూజర్’గా అడుగు పెట్టడం విశేషం. గతంలో 12 సార్లు ఇలాంటి లక్కీ లూజర్లపై తలపడి ఓటమి ఎరుగని జొకోవిచ్, తొలిసారి పరాజయం పాలయ్యాడు. -
చాంపియన్ వెంకట్ అనికేత్
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్లామ్ జూనియర్, పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో వెంకట్ అనికేత్ విజేతగా నిలిచాడు. మెట్టుగూడలోని షఫిల్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అనికేత్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో అనికేత్ 8–6తో ఆనంద్‌పై గెలుపొందాడు. అండర్–16 బాలుర ఫైనల్లో జి. రఘునందన్ 6–3తో మొహమ్మద్ ఇర్షద్ను ఓడించాడు. అండర్–14 కేటగిరీలో ఇషాన్ సయ్యద్ మొహమ్మద్, తనిష్క యాదవ్ టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో ఇషాన్ 6–4తో అభిరామ రెడ్డిపై గెలుపొందగా, తనిష్క 6–1తో దీక్షితను ఓడించింది. అండర్–12 బాలుర ఫైనల్లో శ్రీహిత్ 6–4తో సంకీర్త్పై, బాలికల విభాగంలో హాసిని 6–2తో శ్రీవల్లిపై గెలుపొందారు. అండర్–10 బాలికల టైటిల్‌పోరులో శ్రీయుక్త 6–1తో శ్రీయ గుప్తాపై నెగ్గింది. అండర్–8 విభాగంలో తనవ్ వర్మ 6–2తో గీతన్ రెడ్డిపై గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. -
ముర్రే మెరిసేనా!
లండన్: గత పదేళ్లలో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ నలుగురు క్రీడాకారుల (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) ఖాతాలోకి వెళ్లింది. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో ఈసారీ ఆ నలుగురే టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు. గతేడాది 77 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తొలి బ్రిటన్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన ఆండీ ముర్రేపై అందరికంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ మహిళా క్రీడాకారిణి అమెలీ మౌరెస్మోను కోచ్‌గా నియమించుకున్నాక ముర్రే ఆడుతోన్న తొలి ప్రధాన టోర్నీ ఇదే కావడం విశేషం. నిరుడు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తర్వాత ముర్రే ఇప్పటిదాకా మరే టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. తొలి రౌండ్లో బెల్జియం రైజింగ్ స్టార్ డేవిడ్ గాఫిన్తో తలపడనున్న ముర్రేకు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు ఇటీవల రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్కు రెండేళ్లుగా వింబుల్డన్ టోర్నీ కలసిరావడం లేదు. 2012లో రెండో రౌండ్లో ఓడిన ఈ స్పెయిన్ స్టార్... గతేడాది తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. తొలి రౌండ్లో మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా)తో పోటీపడనున్న నాదల్ ఈసారి ఏం చేస్తాడో వేచి చూడాలి. వింబుల్డన్ టోర్నీని రికార్డు స్థాయిలో ఏడుసార్లు గెల్చుకున్న రోజర్ ఫెడరర్ ఖాతాలో 2012 నుంచి మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరలేదు. యువ ఆటగాళ్ల జోరులో వెనుకబడిపోయిన ఈ స్విస్ దిగ్గజానికి ఈ టోర్నీ పరీక్షగా నిలువనుంది. గత నాలుగేళ్లుగా ఈ టోర్నీలో కనీసం సెమీఫైనల్‌కు చేరుకుంటున్న టాప్ సీడ్ జొకోవిచ్ 2011 తర్వాత మరోసారి చాంపియన్‌గా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. గతేడాది ఫైనల్లో ముర్రే చేతిలో ఓడిన ఈ సెర్బియా స్టార్‌కు కాస్త అనుకూలమైన ‘డ్రా’నే పడింది. మహిళల విభాగానికొస్తే కచ్చితమైన ఫేవరెట్స్ ఎవరూ కనిపించడంలేదు. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), రెండో సీడ్ నా లీ (చైనా), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్), ఐదో సీడ్ షరపోవా (రష్యా), నిరుటి రన్నరప్ సబైన్ లిసికి (జర్మనీ), ఎనిమిదో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 17 లక్షల 60 వేల పౌండ్ల (రూ. 18 కోట్లు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. నేటి ముఖ్య మ్యాచ్‌లు పురుషుల విభాగం ఆండీ ముర్రే (3) x డేవిడ్ గాఫిన్ నొవాక్ జొకోవిచ్ (1) x గొలుబేవ్ థామస్ బెర్డిచ్ (6) x విక్టర్ హనెస్కూ మహిళల విభాగం నా లీ (2) x పౌలా కానియా అగ్నెస్కా రద్వాన్‌స్కా (4) xఆండ్రియా మితు పెట్రా క్విటోవా (6) x హలవకోవా నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్