breaking news
teliscope
-
గెలాక్సీల గుట్టు విప్పనున్న నాసా
వాషింగ్టన్ : విశ్వ పరిణామక్రమాన్ని తెలుసుకునే దిశగా నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ కొత్త తలుపులు తెరిచింది. ఈ టెలిస్కోప్ విశ్వంలో సుదూరంలో ఉన్న 15 వేల గెలాక్సీల్లో ఉన్న 12 వేల నక్షత్రాల ఆవిర్భావానికి సంబంధించి సంపూర్ణ ఛాయా చిత్రాలను తీసి పంపింది. నక్షత్రాల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునేందుకు ఇవి సహాయపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బిగ్‌బ్యాంగ్ విస్ఫోటనం తర్వాత 300 కోట్ల ఏళ్ల కింద, అంటే ఇప్పటికి 11 వందల కోట్ల ఏళ్ల కిందట నక్షత్రాలు ఆవిర్భవించిన తీరును ఈ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చట! హబుల్ స్పేస్ టెలిస్కోప్‌లో వాడుతున్న అతినీలలోహిత కిరణాల సహాయంతో విశ్వం గుట్టు విప్పడం సాధ్యం కాకపోవడంతో పరారుణ, గోచర కిరణాల పరిజ్ఞానం కలిగిన ఇతర టెలిస్కోప్‌ల సాంకేతికతను దానికి జోడించారు. అనంతరం ఈ కిరణాలను విశ్వంతరాల్లోకి పంపి నక్షత్రాల సంపూర్ణ ఛాయా చిత్రాలను తీశారు. -
‘మరో మనిషి’ కోసం డ్రాగన్ వేట
గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఉన్నారో లేదో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ఈ జీవులపై ఎన్నో కథలు మరెన్నో ఊహాగానాలను మనం వింటున్నాం. వీటి ఆధారంగా ఎన్నో సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతరవాసులపై అందరికీ అంతులేని ఆసక్తి. కొందరు గ్రహాంతరవాసులను చూశాం అంటారు..మరికొందరు గుడ్రంగా ఉండే పళ్లాల్లో వచ్చారు అంటారు. అసలు భూమి మీద తప్ప మరో గ్రహాంపై జీవం ఉండే అవకాశం లేదని కొంత మంది శాస్త్రవేత్తలు ఈ వదంతులను కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రహాంతర వాసుల జాడ కోసం ఏళ్లుగా కొనసాగుతున్న పరిశోధనకు మరింత ఉపయోగపడేలా ఒక పెద్ద టెలిస్కోపును చైనా నిర్మించింది. ఇప్పటికే టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా దీంతో మరో రికార్డు సొంతం చేసుకుంది. ఈ భారీ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోని ఇతర జీవజాతుల ఆనవాళ్లు పసిగట్టేందుకు ఉపయోగించనున్నారు. ఏలియన్ల గురించి పరిశోధనలు జరుగుతున్న తరుణంలో దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాల సైజులో చైనా నిర్మించిన 500 మీటర్ల అపర్చర్ స్పెరికల్ టెలిస్కోపు ప్రపంచంలోని పెద్ద టెలిస్కోపుల్లో ఒకటి. దాదాపు 4,450 ప్యానల్స్ ఉపయోగించి తయారు చేసిన దీని వ్యాసార్థం 500 మీటర్లు, కటక సామర్థ్యం 140 మీటర్లు. 2016 సెప్టెంబరు నుంచి దీనిని చైనా సైంటిస్టులు వాడుకలోకి తీసుకురానున్నారు. ఈ టెలిస్కోప్ చాలా శక్తివంతమైన భూమి ఆకర్షణ తరంగాలను సృష్టిస్తుంది. టెలిస్కోపు ద్వారా భూమి, విశ్వం, మిగతా గ్రహాల గురించి కూడా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా లభించిన సమాచారాన్ని విశ్లేషించి ఇతర గ్రహాల మీద ఉన్న జీవజాతులు, ఏలియన్ల గురించి త్వరగా కనుక్కునే వీలుందని సమాచారం. దీనిని నైరుతి చైనాలోని గాయిజూ ప్రావిన్సులో గల కార్ట్స్ వ్యాలీలో ఏర్పాటు చేశారు. దీనిని నిర్మించేందుకు దాదాపు రూ. 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు.