Telangana states
-
'తెలుగులో చదువుకున్నవాళ్లకు నష్టం'
'నీట్' పై సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ వాదనలు న్యూఢిల్లీ: నీట్‌పై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఏపీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు తమ తమ వాదనలను వినిపించాయి. ఈ ఏడాది ఈ పరీక్ష నుంచి తమ విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని సదరు మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. నీట్‌కు సిద్ధమయ్యేందుకు విద్యార్థుల వద్ద పుస్తకాలు లేవని ఏపీ, తెలంగాణ వాదించాయి. స్పల్పకాలంలో సీబీఎస్ఈ పుస్తకాలు అందుబాటులోకి తేవడం అసాధ్యమని... గతంలో ఏపీ, జమ్ముకాశ్మీర్‌లను నీట్ నుంచి మినహాయించారని, దీనికి రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయని ఏపీ, తెలంగాణ ఈ సందర్భంగా పేర్కొన్నాయి. సీబీఎస్ఈ సిలబస్ వల్ల తెలుగు విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ, తెలంగాణ తరఫున వాదనలు వినిపించిన పీపీ రావు, బసవప్రభు పాటిల్ చెప్పారు. భాషా పరమైన సమస్యలు ఉన్నాయని ఈ సందర్భంగా గుజరాత్ తన వాదనలు వినిపించింది. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదలాయించాలని కపిల్ సిబాల్ వాదించారు. 371 (డి)కి ఈ తీర్పు విఘాతం కల్గిస్తోందని ఆంధ్రప్రదేశ్ తన వాదనలు వినిపించింది. తమ విద్యార్థులకు రాజ్యాంగపరంగా రక్షణ ఉందని పేర్కొంది. తెలుగులో చదువుకున్న విద్యార్థులకు నీట్ వల్ల నష్టం కలుగుతుందని అభిప్రాయపడింది. సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు తెలుగులో ఇప్పటికిప్పుడు లభ్యం కావడం కష్టమని అభిప్రాయపడింది. నీట్ తీర్పు వల్ల జోనల్ వ్యవస్థకు కూడా విఘాతమే అని ఏపీ పేర్కొంది. ఏపీ ప్రస్తావించిన అంశాలనే తెలంగాణ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. పునర్విభజన చట్టం, ఆర్టికల్371 డీ, తెలుగు మీడియం విద్యార్థుల సమస్యలను తెలంగాణ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ కోరింది. -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట
-
ఏపీ, తెలంగాణ లలో స్వల్పంగా పెరిగిన చక్కెర ఉత్పత్తి
న్యూఢిల్లీ: 2014-15లో (అక్టోబర్-జనవరి) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చక్కెర ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది. గతేడాది 5.08 లక్షల టన్నులుగా ఉన్న చక్కెర ఉత్పత్తి ఈ ఏడాది 5.61 లక్షల టన్నులకు పెరిగిందని ఇండియన్ షుగర్ మిల్ అసోషియేషన్ (ఐఎస్ఎంఏ) తెలిపింది. చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర 30 శాతం వృద్ధితో (54 లక్షల టన్నులు) దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత 21 శాతం వృద్ధి (33.8 లక్షల టన్నులు)తో యూపీ రెండో స్థానంలో నిలిచింది. 22.7 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తితో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో చక్కెర ఉత్పత్తి తగ్గింది. -
వీలైనంత త్వరగా ఉద్యోగుల పంపిణీ : జితేందర్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగులు, అఖిలభారత సర్వీసు అధికారుల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ జేడీ శీలం అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘రాష్ట్ర విభజన జరగగానే అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా పంపిణీ చేశాం. తుది కేటారుుంపు ప్రక్రియ పూర్తిచేసేందుకు అపాయింటె డ్ డే జూన్ 2 నుంచి ఏడాది కాలం పాటు మాకు గడువు ఉంది. అంతకంటే ముందుగానే పంపిణీ పూర్తిచేస్తాం. సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీ కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం శాఖ కార్యదర్శి కూడా ఉన్నారు. ఆ కమిటీ అందరితో సంప్రదింపులు జరిపింది. స్థానికత, ఆప్షన్లు ఇలా అనేక రకాల అంశాలతో పూర్తి పారదర్శకతతో ఈ పంపిణీ ఉంటుంది. అందువల్లే కొంత సమయం తీసుకుంటున్నాం. కేటాయింపు వివరాలను ప్రకటించిన తరువాత ప్రతి అధికారి నుంచి ఇబ్బందులు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే స్వీకరిస్తాం. అలాగే రాష్ట్రస్థాయి అధికారుల పంపిణీకి కమల్‌నాథన్ కమిటీ పనిచేస్తోంది. ఈ కమిటీ ఇప్పటికే మార్గదర్శకాలు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించే పనిలో ఉంది...’ అని పేర్కొన్నారు. జేడీ శీలం మాట్లాడుతూ.. ‘శాశ్వత కేటాయింపులు లేకపోవడంతో పాలనలో అనిశ్చితి నెలకొంది. అధికారులు తమ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో తెలియక, విధులు సక్రమంగా నిర్వర్తించలేని గందరగోళంలో ఉన్నారు. అందువల్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ప్రధాని సమావేశం ఏర్పాటుచేయాలి..’ అని కోరారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ ‘ఎఫ్ 18 నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయి. దీనిని సమీక్షించాలి. పాలన సజావుగా సాగడం లేదు’ అని పేర్కొన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.ఎస్.చౌదరి సైతం పాలన సజావుగా సాగడం లేదని పేర్కొన్నారు. సభ్యులంతా ఉద్యోగుల పంపిణీకి కచ్చితమైన గడువు చెప్పాల్సిందిగా కోరారు. దీంతో ‘కొన్ని వారాల్లోనే పూర్తవ్వొచ్చు..’ అని మంత్రి చెప్పారు.