పబ్‌లో కాల్పులు..ఇద్దరి మృతి
ఇజ్రాయిల్: ఇజ్రాయిల్‌లోని ఓ పబ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం టెల్ అవివ్ సమీపంలోని 130 డైజెంగ్ఆఫ్ స్ట్రీట్‌లో చోటు చేసుకుంది. అయితే ఈ దాడి వెనక ఉగ్రవాదుల హస్తం ఉందా అన్నా కోణంలో ఇజ్రాయిల్ పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.