breaking news
tax Defaulters
-
రూ.5.91 లక్షల కోట్లు బాకీ.. కట్టాల్సినవారు మాయం!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆశ్చర్యపరిచే గణాంకాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు అందించింది. ప్రత్యక్ష పన్నుల్లో 47,674 మంది పన్ను ఎగవేతదారుల జాడ తెలియడం లేదని.. వీరు చెల్లించాల్సిన బకాయిలు రూ.5.91 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.అదే పరోక్ష పన్నుల్లో 60,853 మంది ఎగవేతదారుల ఆచూకీ లభించడం లేదని.. వీరు రూ.43,525 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఈ వివరాలు తెలియజేశారు. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తీసుకున్న చర్యలను సైతం వివరించారు.వ్యక్తిగత లావాదేవీల సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, 360 డిగ్రీల కోణంలో ప్రొఫైల్‌ను ఫీల్డ్ యూనిట్లకు పంపించి.. పన్ను చెల్లింపుదారులను గుర్తించి, పన్ను వసూలు చర్యలకు వీలు కల్పించినట్టు చెప్పారు. పరోక్ష పన్నుల కేంద్ర మండలి పన్ను ఎగవేతదారుల నుంచి వసూలుకు గాను బ్యాంక్ ఖాతాల స్తంభన వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. -
Hyderabad:‘ఇంటెలిజెన్స్’తో లోపాలకు చెక్! 360 డిగ్రీ వ్యూతో పరిశీలన
జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేందుకు అధికారులు దృష్టి సారించారు. వివిధ స్థాయిల్లో ఆస్తిపన్ను విషయంలో తలెత్తుతున్న లోపాలను సవరించి సక్రమంగా పన్నులు రాబట్టాలని, డిఫాల్టర్లను గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని భావిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో వింతలెన్నో. ఒకే ప్రాంతంలో ఒకే విస్తీర్ణంలో ఉన్న భవనాలకే ఒక భవనానికి రూ.12 వేల ఆస్తిపన్ను ఉంటే...ఇంకో భవనానికి రూ.7 వేలే ఉంటుంది. కొందరు యజమానులకు ఒక్క ఏడాది ఆస్తిపన్ను బకాయి ఉంటేనే చెల్లించేంతదాకా ఒత్తిడి తెచ్చే సిబ్బంది, కొందరు ఏళ్ల తరబడి చెల్లించకున్నా పట్టించుకోరు. భవనం ప్లింత్ ఏరియాకు.. ఆస్తిపన్ను విధించే ఏరియాకు పొంతన ఉండదు. వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య భవనాలుగా కొనసాగుతున్న వాటికి సైతం నివాస భవన ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది. అంతేకాదు.. పక్కపక్కనే ఉన్న ఇళ్లకైనా సరే కొందరికి ఆస్తిపన్ను చదరపు మీటరుకు రూ.3 ఉంటే.. కొందరికి రూపాయికన్నా తక్కువే ఉంటుంది. ఇలాంటి వాటితో జీహెచ్ఎంసీ ఖజానాకు వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్ను రావడం లేదని గుర్తించిన అధికారులు ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందో గుర్తించాలనుకున్నారు. అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఆన్‌లైన సంబంధిత ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని నిర్ణయించారు. తద్వారా లోపాలెక్కడున్నాయో గుర్తించి సరిదిద్దాలని భావించారు. అందుకు గాను ప్రతిష్టాత్మక ఐటీ సంస్ధ నుంచి ‘ప్రాపర్టీటాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్’ను సమకూర్చుకోవడంతోపాటు మూడేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు సైతం అప్పగించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సైతం ఈ సిస్టమ్‌ను వినియోగించడంలో శిక్షణ ఇవ్వనున్నారు. అసెస్మెంట్ లోపాలకు చెక్.. ► ఈ ఇంటెలిజెన్స్ ద్వారా, ముఖ్యంగా తక్కువ ఆస్తిపన్ను మాత్రమే ఉన్న భవనాలను గుర్తించి టాక్స్ అసెస్‌మెంట్‌లోనే తక్కువగా ఉంటే సరిచేస్తారు. ► భారీ మొత్తంలో బకాయిలున్నవారిని గుర్తించి వసూళ్ల చర్యలు చేపడతారు. అసెస్మెంట్ కాని భవనాలెన్ని ఉన్నాయో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ► ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించడంలో ఏయే ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారో వంటి వివరాలను సైతం తెలుసుకుంటారు. తద్వారా టాక్స్‌సెక్షన్ సిబ్బంది ప్రమేయాన్ని సైతం తెలుసుకునే వీలుంటుందని సమాచారం. ► రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులశాఖ, తదితర ప్రభుత్వశాఖల నుంచి సేకరించే సమాచారంతోనూ భవన వాస్తవ విస్తీర్ణాన్ని, వినియోగాన్ని గుర్తించి వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును విధిస్తారు. ► 360 డిగ్రీ వ్యూతో భవనాన్ని అన్నివిధాలుగా పరిశీలించి రావాల్సిన ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు..రావాల్సిన ఆస్తిపన్నును ముందస్తుగా అంచనా వేసి..అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ ఖర్చులకు ప్రణాళిక తయారు చేసుకుంటారు. ► ఈ సిస్టమ్ డెవలప్ ఆయ్యాక ఆస్తిపన్నుకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలనుకున్నా వెంటనే పొందే వీలుంటుంది. ► ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)ని సంప్రదించాల్సి వస్తోంది. తమకు ఏ విధమైన వివరాలు కావాలో చెబితే.. తర్వాత ఎన్నో రోజులకు కానీ అది సమకూరడం లేదు. ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. ► ఆస్తిపన్ను డిమాండ్, వసూళ్లను సైతం ప్రాంతాలవారీగా లెక్కించి తక్కువ వసూలవుతున్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటారు. ► ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులను గుర్తించడంతోపాటు వారు మూడేళ్లుగా చెల్లించిన ఆస్తిపన్ను వివరాలను కూ డా బేరీజు వేస్తారు. ప్రత్యేక డ్యాష్‌బోర్డులు విని యోగించి భవనయజమానుల్లో డిఫాల్టర్లను కూ డా గుర్తించి అవసరమైన చర్యలు చేపడతారు. భవన వినియోగం తెలుస్తుంది.. ఖైరతాబాద్‌లోని ఒక వాణిజ్యప్రాంతంలో 90 శాతం వాణిజ్య భవనాలు కళ్లముందు కనబడుతున్నా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నురికార్డుల్లో మాత్రం వాణిజ్య భవనాలు 50 శాతానికి మించి లేవు.మిగతావన్నీ నివాసభవనాలుగా రికార్డుల్లో నమోదయ్యాయి. తద్వారా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు గండి పడుతోంది. ఇలాంటి అవకతవకలు సైతం ఈ సిస్టమ్ద్వారా వెల్లడవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రాపరీ్టట్యాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను వినియోగించనున్నారు. దీని ద్వారా పరిపాలనపరంగా పర్యవేక్షణ సైతం సులభం కానుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: కరోనా కేసుల్లేవ్ -
పన్నుఎగవేతదారుల్లో హైదరాబాద్ టాప్
సాక్షి, చెన్నై: నల్లధనం వెల్లడిలో అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ తాజాగా పన్ను ఎగవేత దారుల జాబితా నగరాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. దేశంలోని నగరాల్లో తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ ఐటీ డిఫాల్టర్స్ లో మొదటి స్థానంలోఉంది. ఇక్కడ 25మంది భారీ పన్ను ఎగవేతదారులున్నారని తాజా నివేదికలు తేల్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 96మంది భారీ పన్ను ఎగవేత దారులుగా తేలగా..20 మందితో అహ్మదాబాద్ రెండవ స్థానంలో ఉంది. 1980 నుంచి ప్రారంభించిన అంచనా సంవత్సరానికి ఆదాయపు పన్ను బకాయిలు రూ. 3,614.14 కోట్లు. మొత్తం 96 ఐటీ డిఫాల్టర్లలో వ్యక్తులు, సంస్థలు, కంపెలు ఉండగా..వీరినుంచి ఒక్కపైసా కూడా వసూలు కాలేదుట. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం, సెక్షన్ 222, 227, 229, 232 సెక్షన్ల కింద ఆదాయపన్ను బకాయిలను వసూలు చేసే అధికారం ఆదాయపన్ను శాఖకు ఉంది ట్టడానికి అధికారం ఉంది. కానీ పన్ను ఎగవేతదారులను గుర్తించడంలో ఆదాయపన్ను విభాగం చాలా కేసుల్లో విఫలమవుతోంది. ముఖ్యంగా ముంబైకి చెందిన ఉదయ్ ఆచార్య (చనిపోయారు) రూ. 779.04 చెల్లించాల్సిఉంది. కానీ అనంతరం దివాలా ప్రకటించడం గమనార్హం. -
పన్నుఎగవేత సంస్థలపై కన్నెర్ర
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ పన్ను ఎగవేతలకు సంబంధించి జాబితాను విడుదల చేసింది. ‘నేమింగ్ అండ్ షేమింగ్’ విధానం కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలను శనివారం ప్రకటించింది. రూ. 448.02కోట్లు బకాయి పడిన 29 సంస్థల పేర్లను బహిర్గతం చేసింది. పదే పదే హెచ్చరించినా, అవకాశాలు ఇచ్చినా బకాయిలు చెల్లించని వారి జాబితాను ప్రముఖ జాతీయ దినపత్రికలకు ఐటీ శాఖ విడుదల చేసింది. ఆదాయం పన్ను మరియు కార్పొరేట్ పన్ను చెల్లించని వారి జాబితా ప్రకటనను జారీ చేసింది. పన్ను బకాయిలను తక్షణమే చెల్లించాల్సిందిగా కోరింది. వ్యక్తిగత లేదా సంస్థల పేర్లు, పాన్ కార్డు, ఆఖరి చిరునామా, అంచనా పరిధి, బకాయి పడిన పన్ను మొత్తం వివరాలను ప్రకటించినట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ జాబితాలో ఉన్న పేర్లకు సంబంధించిన అసెస్సీలు ఎక్కడ ఉన్నా...తక్షణం పన్ను బకాయిలను చెల్లించాలని కోరారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉంచిన సమాచారం ప్రకారం వారి గురించి తెలిస్తే, సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అటు సీబీడీటీ వెబ్సైట్లో కూడా డిఫాల్టర్ల జాబితాను పోస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆదాయ పన్ను శాఖకు చెందిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) దీర్ఘకాలిక రుణాలు చెల్లించని వారి పేర్లను బహిరంగం ప్రకటించే వ్యూహాన్ని ఆరంభించింది. ఈ జాబితాను దాని అధికారిక వెబ్ సైట్ లో ఈ జాబితాను పోస్ట్ చేయడం కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.