breaking news
Tanu Nenu Mohammad Rafi
-
మహ్మద్ రఫి పాటలు
‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టాం, కథ ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. హీరో సంజిత్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. లండన్ వెళ్లి యాక్టింగ్ కూడా నేర్చుకొచ్చాడు. హీరోయిన్ పాత్ర కూడా ఈ సినిమాకు కీలకం’’ అని దర్శకుడు ఓంప్రకాష్ మార్తా చెప్పారు. సంజిత్, శ్రావణి ఆర్లెండ్ జంటగా కె.అనేష్బాబు నిర్మించిన ‘తను-నేను-మహ్మద్ రఫి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. రామ్నారాయణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆవిష్కరించి, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత సైబర్ నేరాలకు, ఐటీ మోసాలకు అద్దం పట్టే చిత్రమిదని నిర్మాత తెలిపారు. అయిదు పాటలూ బాగా కుదిరాయని సంగీత దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అనిల్ కుందారెడ్డి, పెద్దిరెడ్డి, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ క్రైమ్ నేపథ్యంలో...
సంజిత్, శ్రావణి హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘తను... నేను... మహ్మద్ రఫీ’. ఓం ప్రకాష్ మార్తా దర్శకుడు. కె.అనేష్బాబు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్, ఐటీ మోసాలకు అద్దం పట్టే సినిమా ఇది. ఇందులో సంగీతం హైలైట్. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు. రష్ చూసి చాలా సంతృప్తి చెందామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, సంగీతం: నాని, సమర్పణ: తమ్మినేని పూర్ణారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగుల జగన్నాథ్.