breaking news
subregistrar offices
-
ఆయన సంపాదనకు ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు
లక్షణమైన ఉద్యోగం..అయినా లంచానికి అలవాటుపడ్డాడు. జలగలా ప్రజలను పీల్చేస్తూ రోజూ రూ.లక్షల్లో సంపాదించడం అలవాటు చేసుకున్నాడు. ఆయన అవినీతి పర్వం తారస్థాయికి చేరుకోగా.. ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా కార్యాలయంలో సోదాలు చేసి రూ.2.15 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. ఒక్కరోజే అంతమొత్తం అనధికారికంగా లభించడంతో ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు. అనంతపురం సెంట్రల్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం మధ్యాహ్నం అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోకి ప్రవేశించగానే ఏసీబీ అధికారులు తలుపులు మూసేశారు. కార్యాలయంలో ఉన్న సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు...చివరకు సబ్‌రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తిని కూడా సోదా చేశారు. కార్యాలయంలోని గదులున్నీ తనిఖీ చేశారు. అంతా కలిపి రూ. 2.15 లక్షల అనధికార నగదును స్వాదీనం చేసుకున్నారు. ఒకరోజే ఏకంగా రూ. 2.15 లక్షలు అనధికార నగదు లభించడంతో ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు. ఇక సబ్‌రిజిస్ట్రార్ నెల సంపాదనం ఎంత ఉంటుందోనని అంచనాకు వచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఫిర్యాదుల వెల్లువ అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కొంతకాలంగా ఏసీబీ అధికారుల టోల్‌ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదులు వెల్లాయి. దీంతో స్పందించిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం సదరు కార్యాలయంపై మెరుపుదాడులు నిర్వహించారు. ఏసీబీ సీఐలు ప్రభాకర్, చక్రవర్తి, సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయం మొత్తం క్షుణంగా తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ, అతని బినామీగా ఉన్న ప్రైవేటు వ్యక్తి ఇమ్రాన్, మధ్యవర్తిత్వం వహిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు పీఎన్‌మూర్తి, నూర్‌మహ్మద్, ప్రభాకర్‌స్వామి, మురళీలను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: 'చిన్నబాబుకు నమ్మకస్తుడిగా కోట్లకు పడగలు' డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్! భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ మూర్తి, అతని బినామీ, మధ్యవర్తిత్వం వహిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అందువల్లే ఒక్కరోజే రూ. 2.15 లక్షలు అనధికార నగదు దొరికినట్లు వారు భావిస్తున్నారు. అనంతరం ఏసీబీ సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ... అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద, సబ్ రిజిస్ట్రార్ వద్ద రూ.2.15 లక్షల నగదు దొరికిందన్నారు. నగదును స్వాదీనం చేసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. -
వెండర్ల రాజ్యం!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద వారిదే హవా అందుబాటులో లేని స్టాంపులు అవస్థలు పడుతున్న వినియోగదారులు అనంతపురం టౌన్ : జిల్లాలో అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. హిందూపురం పరిధిలోకి బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు కార్యాలయాలు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు స్టాంప్ వెండర్లు ఉన్నారు. కొంతకాలంగా నాన్ జ్యుడీషియల్, స్పెషల్ అడెస్సివ్ స్టాంపుల కొరత వేధిస్తోంది. అప్పుడప్పుడూ జిల్లాకు స్టాంపులు వస్తున్నా.. అధిక శాతం ‘ వెండర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం కార్యాలయాల్లో ఎక్కువ స్టాంపులు అందుబాటులో ఉంచాలి. జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది స్టాంప్ వెండర్లతో ముందుగానే చేసుకున్న ఒప్పందం మేరకు వాళ్లకే పెద్దపీట వేస్తున్నారు. వెండర్లు స్టాంపులను ముందుగానే కొనేయడం వల్ల అక్కడ మిగిలిన వారికి లభించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రజలకు అత్యంత అవసరమైన 10, 20 స్టాంపుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులకు సంబంధించి అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ ఏడాది మేలో రూ.50 విలువైన స్టాంపులు 96 వేలు వచ్చాయి. వీటి మొత్తం రూ.48 లక్షలు. రూ.100 స్టాంపులు లక్షా 60 వేలు వచ్చాయి. వీటి విలువ రూ.కోటి 60 లక్షలు. అలాగే జూలైలో రూ.10 విలువైన స్టాంపులు 24 వేలు, రూ.20 విలువైన స్టాంపులు 32 వేలు వచ్చాయి. వీటి మొత్తం రూ.8 లక్షల 80 వేలు. ఇలా వచ్చిన స్టాంపులను రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపిణీ చేశారు. అయితే..వీటిలో ఎక్కువ శాతం వెండర్లకే పంపిణీ చేశారు. ఒక్క అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నెలకు రూ.50 లక్షల వరకు విలువైన స్టాంపులు అవసరం. మిగిలిన ప్రాంతాల్లో కూడా రూ.20 లక్షల వరకు విలువైన స్టాంపులు అవసరమవుతాయి. అనంతపురం కార్యాలయ పరిధిలో 40 మంది వరకు స్టాంప్ వెండర్లు ఉండగా.. రూ.10, రూ.20 స్టాంపులను అధిక శాతం వారికే ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కార్యాలయాల్లో ఇవి అందుబాటులో లేవు. వెండర్లు అవసరాన్ని బట్టి సాంపుపై రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అనంతపురం నగరంలో కొంత మంది కార్యాలయం వద్దే తిష్టవేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. అవస్థలు పడుతున్నా.. ఆస్తులు, భూములు, వాహనాలు, ఆర్థిక లావాదేవీలు, లీజులు తదితర వాటికి నాన్‌జ్యుడీషియల్ స్టాంపులు కావాల్సిందే. రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపులు ప్రజలకు అందించడంలో రిజిస్ట్రేషన్ శాఖ విఫలమవుతోంది. జిల్లాలోని ఎక్కువ శాతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.10, రూ.20 స్టాంపులు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రికార్డులు చూస్తే గానీ చెప్పలేం స్టాంపులు విజయవాడ నుంచి వస్తాయి. ఆ వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతాం. సబ్ రిజిస్ట్రార్లే స్టాంప్ వెండర్లకు ఇస్తారు. కార్యాలయాల్లో తక్కువ పెట్టుకుని వెండర్లకు ఎక్కువ ఇస్తున్నారనే విషయం అక్కడి రికార్డులు చూస్తేగానీ చెప్పలేం. తనిఖీలు చేసి అలా జరుగుతుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – దేవరాజ్, రిజిస్ట్రార్, అనంతపురం