breaking news
Srinivas Chakravarthy
-
ఆ ‘నర్తనశాల’తో సంబంధం లేదు– నాగశౌర్య
నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాణంలో రూపొందనున్న ‘నర్తనశాల’ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా చేసిన శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హీరో నాగశౌర్యపై దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ ఇచ్చారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది డ్యాన్స్ బేస్డ్ చిత్రమని, పాత ‘నర్తనశాల’ చిత్రానికి రీమేక్ అని చాలామంది అనుకుంటున్నారు. కానే కాదు. ఫుల్ ఎంటర్టైనర్. నవ్వుకునే చిత్రం. రెండో సినిమాకు కూడా బయటివారిని కాకుండా నన్నే హీరోగా పెట్టినందుకు మా అమ్మకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘భిన్నమైన కథను సరిగ్గా జడ్జ్ చేసి, సినిమా చేద్దామని ఒప్పుకుని, నాకు ఫ్రీడమ్ ఇచ్చిన హీరో నాగశౌర్య, నిర్మాతలు శంకర్‌ప్రసాద్, ఉషగార్లకు థ్యాంక్స్. ‘ఛలో’ను మించిన హిట్‌ను ఐరా క్రియేషన్స్‌కు అందిస్తానన్న నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. నందిని రెడ్డి, శ్రీనివాస్ అవసరాల, నటుడు అజయ్,ఎడిటర్ చంటి, డీఓపీ విజయ్ సి. కుమార్, ఎమ్ఎన్ఎస్. గౌతమ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మహతి స్వర సాగర్, కెమెరా: విజయ్. సి. కుమార్. -
భయం...భయంగా!
నలుగురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల చుట్టూ సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. జై హనుమాన్ ఫిలిమ్స్ పతాకంపై రామ్పట్నాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వామిచంద్ర దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కామెడీ, హర్రర్ నేపథ్యంలో, సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రం సాగుతుంది. సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక,నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ చక్రవర్తి, సంగీతం, పాటలు: రామ్స్ గోతట.