breaking news
siva sankar
-
తెచ్చిన అప్పులంతా వారి జేబుల్లోకే: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: లెక్కా జమ లేకుండా ఏడాదిన్నరలోనే రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించకపోయినా అప్పులు మాత్రం రూ. 2.80 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కలుంటే చూపించాలని శివశంకర్ డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ నుంచి రూ.18 వేల కోట్లు అప్పులు తెచ్చి కూడా మామిడి రైతులకు మద్ధతు ధర కింద చెల్లించాల్సిన రూ. 260 కోట్లు కూడా ఇవ్వలేదని వివరించారు. చంద్రబాబు అప్పుల ద్వారా తెస్తున్న డబ్బంతా ఆయన బినామీల జేబుల్లోకే చేరుతోందని, అప్పులు తెచ్చిన డబ్బుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా కేవలం రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేశారని, అందులోనూ రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 2.80 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క దానికీ బాధ్యతగా లెక్కలు చూపించడం లేదని చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి వాటి ద్వారా వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నాయకులు దోచుకుతింటున్నారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్కికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే అప్పులు రూ.2.80 లక్షల కోట్లను మించిపోయాయి. మంగళవారం వారం వచ్చిందంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు రూ.1,58,880 కోట్లు కాగా వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ చేసిన అప్పులు రూ. 71,295 కోట్లు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూనే రాజధాని కోసం చేసిన అప్పు రూ. 47,387 కోట్లు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు.రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సంగతి పక్కనపెడితే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చడం లేదు. పదిహేనో తేదీ వచ్చినా కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు జమ కావడం లేదు. కానీ అప్పు చేసి తెచ్చిన ఈ డబ్బంతా ఏమవుతున్నట్టు అని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఒక్కొక్కరు 70 సార్లకు మించి హైదరాబాద్‌కి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ తెచ్చిన అప్పులతో జల్సాలు చేస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు తన బినామీలకు రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు.సంపద సృష్టి లేదు.. దోచుకోవడమేవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు, గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లీనిక్‌లు నిర్మించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.ఈ విధంగా రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద సృష్టించారు. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎల్లో మీడియా మాత్రం రూ.14 లక్షల అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో జమ చేయడం జరిగింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 70 శాతంకిపైగా అప్పులు ఏడాదిన్నరలోనే చేశారు.మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి రూ. 9 వేల కోట్లు అప్పురైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేకపోయినా మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు చేశారు. మామిడి రైతులకు మద్ధతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రూ.260 కోట్లు చెల్లించాలి. మామిడి రైతులు మద్ధతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. మైనింగ్ ఆదాయాన్ని ప్రైవేటు యాజమన్యాలకు కట్టబెడుతూ రూ. 9 వేల కోట్లు అప్పులు చేశారు. విమానాశ్రయాల కోసం సెంట్ భూమి కొనకపోయినా ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పేరుతో వెయ్యి కోట్లు అప్పులు తెచ్చారు.ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.5,400 కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి 6.5 శాతంకి మించి వడ్డీ ఉండకూదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 9.15 శాతం భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి అప్పులు తెస్తే, వ్యంగ్యంగా హెడ్డింగులు పెట్టి ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తూలనాడింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే దారుణంగా అప్పులు చేస్తుంటే రుణ సమీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తనకిష్టమైన చంద్రబాబు అధికారంలో ఉండటంతో అప్పుల వార్తలను లోపలి పేజీల్లో చిన్నవార్తగా ప్రచురించి మమ అనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను పంచుకుతింటున్నారు. రెండేళ్లు కూడా నిండకుండానే ఏపీని దివాళా అంచున నిలబెట్టారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. -
Putha Siva Sankar: తక్షణమే నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి..
-
పవన్ కళ్యాణ్ పై పుత్తా శివశంకర్ ఫైర్
-
స్టెప్పులతో ఇరగదీసిన పల్నాడు జిల్లా కలెక్టర్
-
కలెక్టర్ సాబ్.. మీరు చేసిన పనికి హ్యాట్యాఫ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ధర్మవరం జెడ్పీ హైస్కూల్... ఎస్.కోట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన ఆ విద్యాలయం ఇప్పుడు ఆధునికీకరణకు అద్దం పడుతోంది. ధర్మవరం జెడ్పీ హైస్కూల్ స్టూడెంట్‌నని అక్కడి విద్యార్థులు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి రెండు కారణాలు... ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు. మరొకటి అక్కడి పూర్వ విద్యార్థి, పల్నాడు జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్ కృషి. విద్యాబుద్ధులు నేర్పడమే గాక తాను ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యానికి బీజం వేసిన పాఠశాలకు గురుదక్షిణ సమర్పించిన తీరు స్ఫూర్తిదాయకమైంది. సొంతంగా రూ.8.5 లక్షలు ఖర్చు చేసి డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు. ఏదో చేశామంటే చేశామని గాకుండా ఆధునికీకరణ, సౌకర్యాల కల్పన, పుస్తకాల బహూకరణ... ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. లోతేటి శివశంకర్ పదో తరగతి (1995–96 బ్యాచ్) వరకూ ధర్మవరం జెడ్పీ హైస్కూల్లో చదివారు. తర్వాత ఐఏఎస్ సాధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నా ఆ స్కూల్‌ను ఆయన మరచిపోలేకపోయారు. అత్యున్నత సర్వీసు సాధించడంలో తనను స్ఫూర్తి ప్రదాతగా భావిస్తున్న విద్యార్థులకు తన వంతు తోడ్పాటు అందించడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అప్పటికే తన పదో తరగతి బ్యాచ్ స్నేహితులతో కలిసి బాహుదా సేవాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ధర్మవరం గ్రామంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తిత్లీ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను రెండ్రోజుల్లోనే పునరుద్ధరించగలిగారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా గ్రామంలో వైద్య సేవలు అందేలా ఆ సంఘం విశేష కృషి చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో ధర్మవరం జెడ్పీ హైస్కూల్‌కు రూపురేఖలు మారాయి. మన బడి నాడు–నేడు కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. ఆర్నెల్ల క్రితం ఆ పాఠశాలను సందర్శించిన శివశంకర్... అక్కడి విద్యార్థుల విద్యా మనోవికాసానికి ఉపయోగపడేలా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తండ్రి పేరుతో రూ.8.5 లక్షల విరాళం.. డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి పాఠశాల ప్రాంగణంలోనే ఒక హాల్‌ను శివశంకర్ ఎంపిక చేశారు. తన తండ్రి లోతేటి సన్యాసప్పడు పేరుతో రూ.8.5 లక్షల విరాళంగా సమకూర్చారు. ఆ నిధులతో చక్కని మార్చుల్స్, సీలింగ్, గోడలకు పుట్టీ, పెయింటింగ్‌తో ఆహ్లాదంగా ఆ హాల్‌ను అభివృద్ధి చేశారు. ఏసీ సౌకర్యంతో పాటు స్టడీ టేబుళ్లు, కుషన్ కుర్చీలు సమకూర్చారు. రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక పుస్తకాలను సమకూర్చడంలో శివశంకర్ తన వంతు కృషి చేశారు. తాను చదువుకున్న, సేకరించిన పుస్తకాలను లైబ్రరీకి ఇచ్చేశారు. చలం మాస్టారి సహకారంతో వైజ్ఞానిక, సాహిత్య, పోటీ పరీక్షల పుస్తకాలన్నీ అందుబాటులోకి తెచ్చారు. అవన్నీ భద్రంగా ఉంచేందుకు ప్రత్యేక కప్‌బోర్డులను ఏర్పాటు చేశారు. అత్యధిక కాలం లైబ్రరీలో పుస్తక పఠనంలోనే గడిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ డిజిటల్ లైబ్రరీకి ఆయన పేరుతోనే నామకరణం చేశారు. అంతేకాదు పుస్తక పఠనం వైపు విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి పోటీ కూడా పెట్టారు. రానున్న దసరా సెలవుల్లో బాహుదా సేవాసంఘం సభ్యులు వారికి పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన తొలి 20 మంది విద్యార్థులను ఐదు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తానని శివశంకర్ హామీ ఇవ్వడం విశేషం. -
జిల్లా కేంద్రం సాధించే వరకు పోరాటం
మెదక్: కాకతీయుల కోటగా.. నిజాం నవాబుల ఖిల్లాగా వినుతికెక్కిన మెదక్ సుభా మరో ఉద్యమానికి వేదికైంది. జిల్లా కేంద్రం కోసం 57ఏళ్లుగా పోరాటం చేస్తున్నా..తమకు న్యాయం జరగడం లేదంటూ మూడు రోజుల క్రితం మరోమారు పట్టణ ప్రజలు మహోద్యమానికి ఊపిరి పోశారు. ఇంకెన్నాళ్లు ఈ దగా..ఇకపై సహించేది లేదు, ప్రాణాలైన ఫణంగా పెడతాం..జిల్లా కేంద్రం సాధించి తీరుతాం అంటూ..నిరవధిక దీక్షలకు శ్రీకారం చుట్టారు. నిజాం కాలంలో మెదక్ పట్టణం నాలుగు జిల్లాలకు సుభాగా పరిపాలనా కేంద్రంగా విరాజిల్లింది. నేటి తెలంగాణ రాజధాని హైదరాబాద్ జిల్లా సైతం మెదక్ సుభాలోనే భాగమై ఉండేది. కాని అధికారులు, పాలకుల స్వార్థంతో 1932లో జిల్లా కేంద్రాన్ని సంగారెడ్డి పట్టణానికి తరలించారు. నాటి నుంచి జిల్లా కేంద్రం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. 1957లో సంఘ సేవకులు రాందాస్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 43రోజుల పాటు దీక్షలు చేపట్టారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కళావెంకట్రావ్ ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించారు. కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో 1976లో డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మళ్లీ నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పటి మంత్రి బాగారెడ్డి బుజ్జగింపుతో దీక్షలు ఆగిపోయాయి. 1982లో తిరిగి మెదక్‌ను జిల్లా కేంద్రం చేయకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని పట్టణ ప్రజలు హెచ్చరించారు. అప్పటి కేంద్ర మంత్రి శివశంకర్, బాగారెడ్డిలు మెదక్‌కి వచ్చి ఇందిరమ్మను గెలిపిస్తే ప్రధాన మంత్రి అవుతారని, అనంతరం మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా అమలుకు నోచుకోక పోవడంతో 2009లో రాంరెడ్డి కన్వీనర్‌గా మల్కాజి సత్యనారాయణ కార్యదర్శిగా జిల్లా కేంద్ర సాధన సమితి ఏర్పడింది. నాటి నుంచి పోరాటం కొనసాగుతూనే ఉంది. 2010లో 57 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టి, లక్ష సంతకాలు సేకరించి 14 డిసెంబర్ 2010న మెదక్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 23న అప్పటి ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా వినతిపత్రం సమర్పించారు. అప్పటి నుంచి బైక్ ర్యాలీలు, జెండావిష్కరణలు, ప్రజాప్రతినిధుల తీర్మానాలు సేకరిస్తూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. సెప్టెంబర్ ప్రకటనతో అడియాశలు: తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఒక ప్రకటన వెలువడడంతో మెదక్ పట్టణ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. వెంటనే స్పందించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందన్న ప్రకటన వెలువడింది. అయినప్పటికీ మెదక్ ప్రజల్లో జిల్లా కేంద్రం ఏర్పాటుపై కమ్ముకున్న అనుమానపు నీడలు తొలగిపోలేదు. నిరవధిక రిలేదీక్షలు ప్రారంభం: మెదక్ జిల్లా కేంద్రం కోసం గురువారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరవధిక దీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు. ప్రజ సంఘాలు, మేధావులు ఉద్యమానికి మద్దతిస్తున్నారు.


