serenity
-
సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులు
మలబార్ హిల్ పరిసరాల్లో ఇటీవల ప్రారంభించిన ‘వాక్‌వే’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా రాకపోకలు సాగించి ప్రకృతి అందాలను ఆస్వాదించగా కొందరికి టెకెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరో రెండు వారాల వరకు బుకింగ్ ఫుల్ కావడంతో ఈ వాక్‌వే సందర్శనకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. టికెట్లు ఆన్లైన్లో తప్ప నేరుగా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల్లో 300మందికి పైగా పర్యాటకులు మలబార్ హిల్ అందాలను చూడకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఒక్క చెట్టుకూ హాని కలగకుండా.. నిర్మాణం మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యాన వనం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచి్చతంగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచి్చన పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని పంచాలన్న ఉద్దేశ్యంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సింగపూర్‌లోని ‘ట్రీ టాప్ వాక్’తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిరి్మంచింది. ఇలాంటి మార్గాన్ని ముంబైలోని ఉద్యానవనంలో నిర్మించడం ఇదే ప్రథమం. అందుకు బీఎంసీ దాదాపు రూ.30 కోట్లకుపైనే ఖర్చు చేసింది. వందలాది చెట్ల మధ్యనుంచి ఈ మార్గాన్ని నిర్మించినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు. రూ.25తో మానసికోల్లాసం.. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. ఒక్కొక్కరూ రూ.25 చెల్లించి చెట్ల మధ్యలోంచి ఈ మార్గం మీదుగా వెళుతూ ఉద్యాన వనంలో ఉన్న వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అదేవిధంగా కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చరి్నరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్ ¯ð నెక్లెస్ (మెరైన్ డ్రైవ్)లను తిలకించవచ్చు. దీంతో శని, ఆదివారాల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ చోటుచేసుకుంటోంది. ‘ఆన్లైన్’మాత్రమే ఎందుకు? అయితే సందర్శకులు ఆఫ్‌లైన్‌లో టికెట్లు లభించకపోవడంపై ఇక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంచడంపై నిలదీస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, చదువుకోని వారు ఆన్లైన్లో టికెట్లు ఎలా పొందగలరని ప్రశి్నస్తున్నారు. నేరుగా టికెట్లు కొనే వీలు లేక చాలా దూరం నుంచి వచి్చన పర్యాటకులు వెనుదిరుగుతున్నారని, ఇలాంటి వారికోసం ఆఫ్‌లైన్‌లో కొన్ని టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. పర్యాటకుల క్షేమంకోసమే.. ఈ వాక్‌వేపై మొబైల్లో ఫొటోలకు అనుమతి లేదు. దీని వల్ల ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ నిబంధనను అతిక్రమించి ఎలివేటెడ్ మార్గంపై నిలబడి వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. రీల్స్ పేరుతో ప్రాణాంతక స్టంట్లు చేస్తున్నారు. ఈ కారణంగా రద్దీ ఏర్పడి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఇందువల్లే మొబైల్ ఫోన్లకు అనుమతించడం లేదని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎంసీ సిబ్బంది తెలిపారు. View this post on Instagram A post shared by MANISH DEO | Travel Photographer (@deomanish) -
బుద్ధుడిలా ట్రంప్ విగ్రహాలు
డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడూ కాసింత చిరాకు ప్రతిబింబించే ముఖం. అలాంటి ముఖానికి హాంగ్ జిన్ షి అనే చైనా గ్రామీణ కళాకారుడు బుద్ధుడి ప్రశాంతతను ఆపాదించాడు. శాంతచిత్తంతో ఉన్న ట్రంప్ విగ్రహాలను తయారు చేశాడు. బుద్ధుని మాదిరిగా కళ్లు మూసుకుని దైవ చింతనలో కూర్చుని ఉన్న విగ్రహాలను పింగాణీతో రూపొందించాడు. సైజును బట్టి వీటిని 140 నుంచి 2,700 డాలర్ల దాకా విక్రయిస్తున్నాడు. 2021లో ఇ–కామర్స్ ప్లాట్‌ఫాం టావోబావోలో వైరలైన ఈ ట్రంప్ విగ్రహాలు ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మరోసారి ఆకర్షిస్తున్నాయి. సరదాగా మొదలెట్టి... 47 ఏళ్ల హాంగ్ ఇప్పటిదాకా కొన్ని వందల సిరామిక్ వస్తువులను తయారు చేశాడు. ‘‘రాజకీయ నాయకులు సాధారణంగా బోరింగ్‌గా ఉంటారు. కానీ ట్రంప్ అందుకు భిన్నమైన నేత. అందుకే తొలుత సరదాగా ఆయన విగ్రహాలను రూపొందించా. ట్రంప్ వ్యక్తిత్వం, విగ్రహం ఆకారం పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. దాంతో వాటిని కొనేందుకు బాగా ఇష్టపడుతున్నారు’’అని చెప్పుకొచ్చాడు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’నినాదంతో ట్రంప్ గెలిస్తే, హాంగ్ మాత్రం ప్రతి విగ్రహం ప్యాక్‌పైనా ‘మీ కంపెనీని మళ్లీ గొప్పగా చేయండి’అని రాస్తున్నాడు. దీన్ని అనుసరిస్తూ అమెరికాలో పలు ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాంలలో కొన్ని వెర్షన్లు వచ్చాయి. ట్రంప్ పాలనలో ప్రధాన పాత్ర పోషించనున్న కుబేరుడు ఎలాన్ మస్క్ విగ్రహాన్ని కూడా హాంగ్ డిజైన్ చేస్తున్నాడు. అందులో మస్‌్కను ఐరన్ మ్యాన్‌గా చూపిస్తున్నాడు. ట్రంప్‌కు చైనాలో ఇప్పటికీ చాలామంది అభిమానులున్నారని చెప్పాడు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విందామా... ప్రకృతి గీతం
ప్రకృతి నుండి వచ్చే వివిధ వైవిధ్యభరితమైన ధ్వనులు...... పక్షుల కువకువలు, నదీ ప్రవాహాలు, గాలి వీచికలు, సాగర ఘోషలు, జలపాత జోరులు, తుమ్మెద ఝంకారాలు, కీటక శబ్దాలు... వెరసి భూమి మనకు అందించే సంగీత కచేరి. ఆ దృష్ట్యా చూసేవారికీ భూమి అద్భుత సంగీతకారిణిగా గోచరిస్తుంది. నదులు, వాగులు, సాగరాలను, సెలయేళ్ల గలగలలను వివిధ సంగీత సాధనాలను వాయించే సంగీతకారులుగా చేసి, పక్షుల కుహూ కుహూలను గాత్రధారులను చేసి, ఈ అద్భుత మేళవింపుతో మనకు సంగీతాన్ని వినిపించే గొప్ప సంగీతవేత్త. శోధించ గలిగేవారికి మరెన్నో వివిధ సంప్రదాయ సంగీతాలు, అనేక రాగాలను శ్రవణానందకరంగా వినిపించే గొప్ప సంగీత దర్శకురాలు. అవును. భూమికి సంగీతం ఉంది. వినగలిగేవారికి అది సంగీతాన్ని వినిపిస్తుంది. అయితే మనం దృష్టి సారించి చూసి, తెలుసుకోగలగాలి. వినగలగాలి. అసలు మనకు జిజ్ఞాస, వినే మనస్సుండాలి. ఈ భూమి, దీని మీద నివసించే మానవులు, ప్రకృతి జంతుకోటి చేసే కదలికలకు, శబ్దాలకు లేదా ధ్వనులకు, ఓ తూగు, ఊగు, లయ ఉంటుంది. వాటికి మనస్సును పులకింపచేసే ఒక శక్తి ఉంది. అవి వీనులకు విందు కలిగిస్తాయి. ఓ హాయినిస్తాయి. మనస్సుకు ఒక ప్రశాంతతనిచ్చి, ఒక అలౌకిక ఆనందానికి లోను చేస్తాయి. అనేకమంది కవులు, రచయితలు భూమి వినిపించే సంగీతం గురించి చక్కగా వర్ణించారు విశ్వవ్యాప్తంగా. అది వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, షేక్స్పియర్, కీట్స్, వర్డ్స్‌వర్త్ లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. నదులు ప్రవాహపు తీరు వినసొంపుగా ఉంటుంది. ప్రవహించే భూ విస్తీర్ణాన్ని బట్టి వివిధ రకాలుగా నది ధ్వనిస్తుంటుంది. అవన్నీ చెవులకు హాయినిస్తాయి. నదులను తనలో కలుపుకునే సముద్రం నిరంతరం గర్జిస్తూనే ఉంటుంది. పర్వతాల, కొండల మీదనుండి భూమి ఒడిని చేరాలని తహతహలాడుతూ దుందుడుకుగా దూకే ఝరులు వీక్షకుల గుండెలను ఝల్లుమనిపిస్తూ విభ్రాంతిని కలిగించినా శ్రవణాలకు ఒకే సంగీత వాద్యాన్ని వందలమంది వాయించినంత అనుభూతినిస్తాయి. ఇహపరమైన ఇక్కట్లను, బాధను కొద్దిసేపైనా మనం మరిచేటట్టు చేస్తుంది. శ్రవణానందకరమైన ఏ శబ్దమైనా మనసును రసమయం చేయగల మహత్తును కలిగి ఉంటుంది. గాలి ఈలలు వేస్తుందని, ఎన్నెన్నో ఊసులు చెప్పగలదని ఎంతమందికి తెలుసు? వేసవి తాపాన్ని తొలగిస్తూ మనస్సులను ఝల్లుమనిపిస్తూ భూమిని ముద్దాడటానికి అనూహ్యమైన వేగంతో వచ్చే తొలకరిజల్లు శ్రవణ పేయమై మన ఉల్లాన్ని ఆనందలహరిలో ప్రవహింప చేయదూ! తెలతెలవారుతుండగానే చెట్ల మీద ఉండే పక్షులు బద్ధకాన్ని వదిలించుకునే క్రమంలో ఒళ్ళు విరుచుకుంటూ, రెక్కల సవరింపులో చేసే విదిలింపులు, టపటపలు, గొంతు సవరించుకుంటూ చేసే కిల కిలకిలలు ఉదయపు నడకలో ఉన్నవారికి నిత్యానుభవమే. తెల్లవారుతోందన్న సంగతిని సూచిస్తూ... కొక్కోరో కో.. అని కుక్కుటం చేసే శబ్దం మేలుకొలుపుకు చిహ్నం. సూర్యాస్తమయాన్ని సూచించే ఇంటికి వడివడిగా చేరుకునే పశువుల గిట్టల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తూ... ముచ్చటను కలుగచేస్తాయి. ఈ భూమి మీద జంతువులు కూడ నివసిస్తున్నాయి. మనుషుల స్వరాలలోని వైచిత్రి వాటిలో కూడ చూస్తాము. అడవికి రాజుగా భాసిల్లే సింహం చేసే గర్జన, మదమెక్కిన గజరాజు పెట్టే ఘీంకారం, చెడు భావనను కలిగించే నక్కల ఊళలు, పాము బుసలు, శిరోభారాన్ని, చికాకును కలిగించే కీచురాళ్ళ ధ్వనులు మనలను భీతిల్లేటట్లు చేస్తాయి. మానవ ప్రమేయం లేక ప్రకృతి చేసే శబ్దాలను అనాహతమని, మానవ ప్రేరితంగా వచ్చే శబ్దాలను లేదా ఆహతమని అంటారు. మన ఊపిరి నిలిపేందుకు నిరంతరం పరిశ్రమించే ఊపిరితిత్తుల ఉచ్వాస నిశ్వాసాలలో ఓ లయ ఉంది. శ్రుతి ఉంది. ఇవి సంగీత ధ్వనులే. మన ప్రాణాన్ని నిలిపే గుండె లబ్.. డబ్ ల ధ్వనిని ఎంత లయబద్ధంగా చేస్తుంది! శ్రుతి లయలలో రవ్వంత అపశ్రుతి వచ్చినా ఫలితం మరణమే కదా! మన శరీరాన్ని.. నాదమయం.. అన్నారు ప్రాజ్ఞలు. నాదం ఒక ప్రాణశక్తి. సంగీతానికి మనసును పరవశింపచేసే శక్తి ఉంది. ఒక గొప్ప సంగీత గాత్రధారి ఆలాపన చాలు మనల్ని తన్మయులను చేయటానికి. మాటను చక్కగా ఉచ్చరిస్తూ, కావలసిన ఊనికనిస్తూ మాటలలోని భావాన్ని గొంతులో పలికిస్తూ భాషించే వ్యక్తి సంభాషణ శ్రోతలనలరిస్తుంది. ఈ పోహళింపులకు మాధుర్యాన్ని జోడిస్తూ పాడగల పశువుల కాపరి పాట మనలను ఎంతగా అలరించగలదో, అంతగానే ఉన్నత శ్రేణి కి చెందిన సంగీతకళాకారుని త్యాగరాజ కీర్తన కూడ. ఇంతటి మహత్తును కలిగి ఉన్న సంగీతాన్ని భూమి మనకు నాదరూపంలో అందిస్తుంది. దీన్ని ఆనందించి పరవశించి, దాన్ని ఒక అనుభూతి చేసుకుని మనసు పొరల్లో పొదవుకోగల ఏకైక బుద్ధిజీవి మానవుడు ఒక్కడే. భూమి తన సంగీతంతో మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను, సాంత్వన చేకూర్చి మనలను ఆనంద రసజగత్తులోవిహరించేయగల ఓ గొప్ప సంగీతజ్ఞురాలు. ఈ ఆనందస్థితిలో మనిషి తన విధిని చక్కగా నిర్వర్తించగలడు. ఈ ఆనందమే స్వర్గమైతే దీన్ని మనకు అందచేసే భూమి స్వర్గ తుల్యమే. దీన్ని మనం కాపాడుకోవాలి. సంరక్షించుకోవాలి. జీవనశైలి, నాగరికత, సాంకేతికతలనే పేరుతో దీన్ని విధ్వంసం చేసే హక్కు మనకెక్కడుంది? ఇప్పటికే ఈ గ్రహం మీద మన జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాం. ఈ భూ గ్రహాన్ని పూర్తిగా ఓ అగ్నిగుండంగా మార్చి భావితరానికి కానుకగా ఇద్దామా! ప్రస్తుతానికి మనిషి నివసించే, నివసించగల ఒకే ఒక గ్రహం ఈ భూమి. మన ముందు తరాలు, మన తరం నివసించిన ఈ.. ఆనందనిలయాన్ని... ముందు తరాలకు అందించే బాధ్యత మనందరిదీ. పక్వానికొచ్చిన పంటను పడతులు ఒకచేత ఒడుపుగా పట్టుకుని మరొక చేత కొడవలితో కోసే వేళ అది చేసే శబ్దంలో క్రమముంటుంది. అది సంగీతమే! కోసిన కంకులను మోపులుగా కళ్లాలలో కర్రలతో కొడుతున్నవేళ, తూర్పార పట్టే వేళ చేట చెరుగుళ్ల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తాయి. ఎంత ఆహ్లాదాన్నిస్తాయి! ఒకనాటి పల్లెటూళ్లు చక్కని సంగీత కచేరిలు చేస్తుండేవి. పాలు పితికే క్షణాన ఆ ధార పాత్రను తాకుతున్నప్పుడు వచ్చే ధ్వనికి ఓ లయ ఉంది. తరుణులు పెరుగును చిలికే వేళ కవ్వం, కవ్వపు తాడు చేసే ధ్వని, కవ్వపు గుత్తి కుండను తాకే శబ్దానికి ఎంత లయ! వీటికి తోడు అ ఆ మగువల చేతిగాజులు చేసే ధ్వని ఓ నాదమే. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
పరిశుభ్రతకు మారుపేరు ఆ గ్రామం..!
మేఘాలయ రాష్ట్రం తూర్పు కాశీహిల్స్ కు సమీపంలోని మాలినాంగ్.. ఒకప్పుడు జనసంచారమే అంతగా కనిపించని కుగ్రామం. రోడ్డు సౌకర్యం కూడా లేని ఆ పల్లెకు చేరాలంటే కొండ కోనల మధ్య సన్నని దారులనుంచీ కాలిబాట పట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. టూరిస్టులకు ప్రధాన కేంద్రంగా కూడా మారింది. షిల్లాంగ్ శిఖర పర్వత ప్రాంతాలు పల్లెసీమల అందాలతో ఆకట్టుకుంటాయి. ప్రకృతి సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. రాష్ట్రానికే గుర్తింపు తెచ్చిన ఈ ప్రాంతంలో నెలకొన్న మాలినాంగ్ గ్రామం ఏకంగా ఆసియాలోనే పరిశుభ్రత కలిగిన గ్రామంగా పేరు తెచ్చుకుంది. రోడ్డుకు ఇరుపక్కలా ఏర్పాటు చేసిన వెదురు చెత్త బుట్టలు... పర్యావరణ పరిరక్షణకు నిలువుటద్దాలుగా కనిపిస్తాయి. తరచుగా వాలంటీర్లు రోడ్లను ఊడ్చి చెత్తను ఆ బుట్టలలో వేస్తుంటారు. ఖాశీ గిరిజనుల నివాస స్థలమైన మాలినాంగ్ కు మరో ప్రత్యేకత కూడ ఉంది. ఇక్కడ అరుదుగా మాతృస్వామ్య సమాజం కొనసాగడంతోపాటు... వారసత్వ సంపద తల్లినుంచీ కూతుళ్ళకు చేరుతుంది. అంతేకాదు తల్లి ఇంటిపేరే పిల్లలకు వర్తిస్తుంది. భారత నగరాల్లో ఉండే శబ్దాలు, దుమ్ము, ధూళి లేని గ్రామంగా కూడ ఈ పల్లె గుర్తింపు పొందింది. పన్నెండు సంవత్సరాల క్రితం మొట్ట మొదటిసారి ఈ గ్రామానికి రోడ్డు మార్గాన్ని నిర్మించినట్లు ప్రచురించిన ఇండియా డిస్కవరీ మాగజిన్ 'ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్' గా ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచ పర్యావరణ వేత్తలు, టూరిస్టులు మాలినాంగ్ బాట పట్టారు. ఐదు వందలమంది మాత్రమే ఉండే ఈ గ్రామాన్ని ఇప్పుడు రోజుకు సుమారు 250 మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. అయితే పరిశుభ్ర గ్రామంగా గుర్తింపు పొందడం కూడ ఈ గ్రామానికి ఓ రకంగా నష్టాన్ని కలిగిస్తోంది. ఇతర ప్రాంతాలనుంచీ వరదలా వచ్చి పడుతున్న జనానికి... శబ్ద, వాయు కాలుష్యాలతో నిండిపోతోంది. దీంతో స్థానిక గెస్ట్ హౌస్ యజమాని ఊరికి చివర పార్కింగ్ స్థలాన్ని సూచించమంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడ చేశారు. ఇటువంటి సందర్భం వచ్చే ప్రమాదం ఉందని టూరిజం డెవలప్మెంట్ శాఖకు అప్పుడే సూచించినట్లు మేఘాలయా మాజీ పర్యాటక అధికారి దీపక్ లాలూ అంటున్నారు. ఈ పరిణామాలతో గ్రామంలోని సామాజిక సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొట్టమొదట కలరా వ్యాప్తి చెందిన సమయంలో 130 సంత్సరాల క్రితమే మాలినాంగ్ లో పరిశుభ్రతను పాటించడం ప్రారంభించారు. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి గ్రామంలో వైద్య సౌకర్యాలతో పాటు పరిశుభ్రతను కీలకంగా అమలు చేశారు. ప్లేగు, కలరా వంటి వ్యాధులు రాకుండా సంరక్షించుకోవాలంటే పరిశుభ్రత పాటించాలని పూర్వీకులు సూచించినట్లు అక్కడి క్రిస్టియన్ మిషనరీలు చెప్తున్నాయి. దీనికి తోడు దేశంలోని గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మాలినాంగ్ ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లలో కూడ ముందుంది. గ్రామంలో నివసించే సుమారు 95 కుటుంబాలు ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవడం అందుకు నిదర్శనంగా చెప్పాలి. నగర రోడ్లపై చెత్త పేరుకుపోవడం దేశానికే అప్రతిష్ట కూడగడుతోందంటూ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... మాలినాంగ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. స్వచ్ఛతకు, పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన ఓ గ్రామం ఇండియాలో ఉండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, భారతీయులంతా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అయితే మాలినాంగ్ సాధించిన ప్రత్యేకతలకు గర్వ పడటంతో పాటు.. వాటిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా టూరిస్టులకు అనుమతిని నియంత్రించడం ఎంతో అవసరమని పర్యాటక శాఖ నిపుణులు సూచిస్తున్నారు.