breaking news
Science fiction writings
-
సమంతాకు ‘బుకర్’
లండన్: బ్రిటిష్ రచ యిత్రి సమంతా హార్వే ను 2024 బుకర్ ప్రైజ్ వరించింది. అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమ గాముల జీవితంలో ఒక్క రోజు జరిగే ఘటనలను వర్ణిస్తూ ఆమె రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ‘ఆర్బిటాల్’కు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు సాధించిన తొలి అంతరిక్ష నేపథ్య రచనగా ఆర్బిటా ల్ నిలిచింది. ఈ నవలను 2023 నవంబర్‌లో ప్రచురించారు. బ్రిటన్‌లో అత్యధికంగా అమ్ముడు పోయిన నవలగా నిలిచింది. అంతరిక్షపు అందాలను అద్భుతంగా కళ్లముందు ఉంచిందని జడ్జింగ్ ప్యానెల్ చైర్మన్ ఎడ్మండ్ కొనియాడారు. -
ఇదో రకం ప్రేమ లేఖ!
ప్రియమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. రెండేళ్లలో నువ్వు ఆకాశంలోకి చేరాక అన్నీ మారిపోతాయి. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారన్నది స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఏయే గ్రహాలపై నివసిస్తారో తెలిసే చాన్సుంది. నిజానికి మేం నీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నాం. 2007లో తొలిసారి నిన్ను ప్రయోగిస్తారని విన్నాం. కానీ కొంత ఎదురుచూపు తప్పలేదు. ఏమైతేనేం.. 2021 మార్చికల్లా నువ్వు 25 అడుగుల పొడవైన బంగారు అద్దంతో ఐదు పొరల సూర్యరక్షణ కవచంతో దర్శనమిస్తే అది అద్భుతంగానే ఉంటుంది. నీక్కొంచెం కష్టం కావచ్చుగానీ.. భూమికి 10 లక్షల మైళ్ల దూరంలో కుదురుకుంటావనే ఆశిస్తున్నాం. అక్కడి నుంచి నీ చూపులు విశ్వం మొత్తం ప్రసరించనున్నాయి. మేమెవెవ్వరం చూడని, చూడలేని లోకాలను నీ కళ్లు చూడనున్నాయి. సాంకేతిక అద్భుతం నువ్వు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. నువ్వో సాంకేతిక అద్భుతమనడంలో అతిశయోక్తి లేదు. సూర్యుడి నుంచి నిన్ను రక్షించేందుకు ఉద్దేశించిన ఐదు పొరల రక్షణ కవచం కోసం ఏకంగా ప్రత్యేక పదార్థాన్ని తయారు చేయాల్సి వచ్చింది. ఎల్2 లాంగ్రేంజ్ పాయింట్లో కుదురుగా తిరిగేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సిద్ధం చేశాం. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి నువ్వు నింగికెగసే సమయానికి బంగారు అద్దం, రక్షణ కవచం ఎంచక్కా ఏరియన్ 5 రాకెట్లో ఒదిగిపోతాయి. కక్ష్యలోకి చేరాక ఇవన్నీ వారం రోజుల్లో నెమ్మదిగా విచ్చుకుంటాయిలే! అప్పటి నుంచే మాకు ఈ విశ్వం గురించి బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. ఈగల్స్ నెబ్యులాలోని సృష్టి స్తంభాల రహస్యాలతో పాటు మన సౌర కుటుంబంలోని వాటి గురించి కొత్త విషయలు తెలియనున్నాయి. కొత్త లోకాలపైనే ఆసక్తి.. నీ పనిపై నాకు అమితాసక్తి పెంచేది ఏంటో తెలుసా? భూమికి అవతల ఇంకా ఎన్ని భూమిలాంటి గ్రహాలున్నాయో నువ్వు చెబుతావన్న విషయం. అలాగని సౌరకుటుంబంలోని గ్రహాలపై నాకు చిన్నచూపేమీ లేదుగానీ.. ఎక్కడో దూరంగా ఉండే ఇంకో సూర్యుడి వెలుగు నాలో ఆసక్తి పెంచుతోందంతే. ఆకాశంలో రెండు సూర్యుళ్లు ఉండే గ్రహాలు.. లేదా సూర్యుడు అటూ ఇటూ కదలకుండా ఒకే చోట ఉండే గ్రహాలు... రోజంతా ఇంధ్రధనుస్సులాంటి రంగులు వెదజల్లే సూర్యుడు ఉండే గ్రహాలు.. అబ్బో తలచుకుంటేనే ఒళ్లు పులకరిస్తోంది. తన చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణంలోకి సూర్యుడి కాంతి ఎలా చేరుతుందో నిశితంగా పరిశీలిస్తే అక్కడ ఎలాంటి రసాయనాలున్నాయన్నది నీవు కనిపెట్టగలవు. ఆయా గ్రహాల్లో నీరు ఉంటే నీ పరారుణ కాంతి కెమెరా కంటిని అవి తప్పించుకోలేవు. కార్బన్డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు బోలెడున్న గ్రహాల్లోని గ్రహాంతర జీవరాశులను గుర్తించిన తొలి టెలిస్కోపు నువ్వే అవుతావా? అచ్చం మన భూమి మాదిరిగానే ఉండే గ్రహాన్ని నువ్వే గుర్తించి మాకు చెబుతావా..? ఈ విశాల విశ్వంలో కాంతి సంవత్సరాల దూరంలో మనిషికి ఇంకో ఇల్లు ఉందని నీ ద్వారానే మాకు తెలుస్తుందా..? ఎప్పటికైనా ఇలాంటి మరో ప్రపంచాన్ని చేరాలనుకున్న మా ఆశలు సజీవంగా ఉంచేది నీవే. ఎప్పుడెప్పుడు నింగికెగురుతావా అని వేయి కళ్లతో ఎదురుచూస్తూ.. నువ్వంటే ఆశ్చర్యపడుతూ.. సైన్స్ ఫిక్షన్ రచయిత చార్లీ జేన్ ఆండర్స్.. ఇంకో రెండేళ్లలో ప్రయోగించనున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు ఓ ఉత్తరం రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు ప్రతిరూపం ఈ లేఖ. లక్షల మైళ్ల అవతల అంతరిక్షంలో ఉంటూ ఇప్పటివరకూ విశ్వగవాక్షంగా పనిచేసిన హబుల్ టెలిస్కోపు స్థానాన్ని జేమ్స్ వెబ్ త్వరలో భర్తీ చేయనుంది. – నేషనల్ జియోగ్రాఫిక్తో ప్రత్యేక ఏర్పాటు -
‘రోబోటిక్స్’ను సృష్టించిన రచయిత
పీఛేముడ్ సైన్స్ ఫిక్షన్ రచనలకు పితామహుడు అనదగ్గ రచయిత ఇసాక్ అసిమోవ్. రికార్డుల్లో ఆయన 1920 జనవరి 2న పుట్టినట్లుగా నమోదైనా, ఆయన అంతకు ముందే పుట్టి ఉండవచ్చనేది చరిత్రకారుల అంచనా. రష్యాలో పుట్టిన అసిమోవ్ బాల మేధావిగా పేరు పొందాడు. ఐదేళ్ల వయసులో స్వయంగా చదవడం నేర్చుకున్నాడు. పదిహేనేళ్ల వయసులోనే హైస్కూల్ చదువు పూర్తి చేశాడు. పంతొమ్మిదో ఏట తొలి కథను ప్రచురణకర్తలకు అమ్మాడు. శాస్త్ర సాంకేతిక రంగం అంతగా అభివృద్ధి చెందని ఇరవయ్యో శతాబ్ది తొలి రోజుల్లోనే ఎవరూ ఊహించని శాస్త్ర సాంకేతిక పరిణామాలను ఊహించాడు. న్యూయార్క్‌లో స్థిరపడి దాదాపు ఐదువందలకు పైగా పుస్తకాలను రాశాడు. వాటిలో కొన్నింటికి సంపాదకత్వం వహించాడు. సైన్స్ ఫిక్షన్ రచనలు ఆయనకు పేరు, డబ్బు తెచ్చిపెట్టినా, లిమరిక్కులు రాయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. ‘రోబో’ల గురించి రాసిన ఒక నవలలో తొలిసారిగా ‘రోబోటిక్స్’ పదాన్ని ఉపయోగించిన ఘనత అసిమోవ్కే దక్కుతుంది. ఆయన ఆ మాట వాడిన దశాబ్దాల తర్వాత ‘రోబోటిక్స్’ ఒక ప్రత్యేక సాంకేతిక శాస్త్రంగా ఎదిగింది. విల్ స్మిత్ రూపొందించిన హాలీవుడ్ సూపర్‌హిట్ ‘ఐ, రోబో’కు అసిమోవ్ రచనే ఆధారం. అయితే, అంతరిక్షానికి సంబంధించి చాలా కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించిన అసిమోవ్ తన జీవితకాలంలో రెండు సార్లు మాత్రమే విమాన ప్రయాణం చేయడం విచిత్రం. నైలు నదిని తస్కరించాలనుకున్న బ్రిటన్ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక నదిని తస్కరించగలరా? కనీసం అలాంటి ఊహనైనా ఊహించగలరా? ‘రవి అస్తమించని’ ప్రాభవం సన్నగిల్లిన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచన చేసింది. ఈజిప్టు నుంచి నైలు నదిని తస్కరించాలనే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలించింది. ఆ ప్రతిపాదనలో చాలా ప్రతికూలతలు ఉండటంతో విరమించుకుంది. అందువల్ల అదృష్టవశాత్తు నైలు నది ఇప్పటికీ క్షేమంగానే ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 1956 నాటికి ప్రపంచంలో బ్రిటన్ ప్రాభవం దాదాపు అవసాన దశకు చేరుకుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ దళాలు కీలకమైన సూయజ్ కాలువపై అనధికారికంగా పెత్తనం చలాయించసాగాయి. ఈ పోకడలను అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నసీర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. సూయజ్ కాలువ నుంచి బ్రిటిష్ బలగాలు వెనక్కు మళ్లాల్సిందేనని కరాఖండిగా హెచ్చరించాడు. గత్యంతరం లేక బ్రిటిష్ బలగాలు వెనక్కు మళ్లాయి. సూయజ్ కాలువ నుంచి తమను వెళ్లగొట్టిన ఈజిప్టుకు బుద్ధి చెప్పాలంటే, నైలు నదిని తస్కరించడమే తగిన పని అని ఆఫ్రికాలోని బ్రిటిష్ కొలోనియల్ కార్యాలయం ప్రతిపాదనను పంపింది. నైలు నది ఆవిర్భావ ప్రాంతమైన ఉగాండా అప్పటికి ఇంకా బ్రిటన్ అధీనంలోనే ఉండేది. దానిపై బ్రిటిష్ ప్రభుత్వం డ్యాము కూడా నిర్మించింది. అక్కడి నుంచి నియంత్రిస్తే, ఈజిప్టులోకి చేరే నైలు నది నీరు దాదాపు ఎనభై శాతం వరకు తగ్గిపోతుంది. ఆ దెబ్బకు ఈజిప్టు ప్రభుత్వం దిగివస్తుందనేది ఆ ప్రతిపాదన సారాంశం. లండన్‌లోని బ్రిటిష్ పెద్దలు దీనిపై చాలా తర్జన భర్జనలు పడ్డారు. ఇలా చేస్తే ఈజిప్టు చుట్టుపక్కల మరో రెండు దేశాలకు కూడా నీరు అందకుండా పోయి అంతర్జాతీయంగా బ్రిటన్ పరువు మంటగలుస్తుందని భావించి, ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. మందు కోసం వెర్రి పందెం పెను తుపానులు చెలరేగినప్పుడు ఎవరికి వారే సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకుంటారే తప్ప తుపానులకు ఎదురీదాలనే వెర్రి ప్రయత్నాలేవీ చేయరు. ప్రాణాలపై ఆశలు ఉన్న వాళ్లెవరైనా కనీసం అలాంటి దుస్సాహసాలను కలలోనైనా ఊహించలేరు. అయితే, బ్రిటిష్ నావికాదళంలో పనిచేసిన కల్నల్ జోసెఫ్ డక్‌వర్త్ అలాంటిలాంటి మనిషి కాదు. ‘సాహసమే నా ఊపిరి’ అనే టైపు! ఆ సంగతిని నిరూపించుకోవడానికి ఎంతటి దుస్సాహసాలకైనా తెగించేవాడు. ఇతగాడి దళం అమెరికాలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు 1943 జూలై 27న టెక్సాస్‌లో పెనుతుపాను చెలరేగింది. విమానాలన్నింటినీ నిలిపివేశారు. అలాంటి పెను తుపానులో విమానాలు ఎగిరితే అవి గల్లంతవడం ఖాయం. సైనిక స్థావరంలో ఇదే విషయాన్ని కొందరు మాట్లాడుకోవడం విన్నాడు డక్‌వర్త్. తుపాను మీదుగా విమానాన్ని నడిపి, సురక్షితంగా రాగలనని వాళ్లకు సవాలు చేశాడు. మాటా మాటా ముదరడంతో పందెం... అంటే పందెం అనుకున్నారు. పందెం కాసిందేమీ డబ్బూదస్కం, నగానట్రా వంటి విలువైనదేదీ కాదు. కేవలం ఒక సీసా విస్కీ, దానికి అనుపానంగా తగినంత సోడా! ఏదైతేనేం... పందెమంటే పందెమే... అంటూ విమానం తీసుకుని బయలుదేరాడు డక్‌వర్త్. ఈ ఆలోచనకు అప్పటికే భయంతో బిక్కచచ్చి ఉన్న లెఫ్టినెంట్ రాల్ఫ్‌ను తనకు తోడుగా తీసుకుపోయాడు. ఈ దుస్సాహసాన్ని అందరూ కళ్లప్పగించి చూశారు. వాళ్లు చూస్తుండగానే విమానం నింగికెగసింది. తుపాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం వైపుగా దూసుకుపోయింది. తుపాను సుడులు తిరుగుతున్న కేంద్ర ప్రాంతం మీదుగా విమానాన్ని భూమికి తొమ్మిదివేల అడుగుల ఎత్తుకు పోనిచ్చాడు డక్‌వర్త్. తుపాను తాకిడికి విమానం చిగురుటాకులా కంపించింది. తుపానును చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోయింది. రెండుసార్లు తుపాను మీదుగా చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి యథాస్థానానికి చేరుకుంది. విమానం దిగిన తర్వాత డక్‌వర్త్ విజయగర్వంతో విస్కీ బాటిల్ అందుకున్నాడు. కూర్పు: పన్యాల జగన్నాథదాసు