breaking news
samatha ruth
-
52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2021 (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాల్లో తారల సందడి
-
గోవాలో సమంతా, ఆ క్రెడిట్ ఆమెదే: పిక్స్ వైరల్
International Film Festival 2021: అత్యంత ప్రతిష్టాత్మక 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు గోవాలోని పనాజీలో తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. కరోనా మహమ్మారి తరువాత గోవా ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ ఈవెంట్ ఇది. ఈ వేడుకల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతోపాటు, బాలీవుడ్ స్టార్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కరణ్ జోహార్, మనీష్ పాల్ ఈ ఈవెంట్‌కి హోస్ట్‌గా , ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకే టీమ్‌తో సందడి చేసింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పీకర్‌గా ఆహ్వానించబడిన తొలి దక్షిణ భారత నటి సమంత కావడం విశేషం. 52వ ‘ఇఫీ’లో భాగంగా రాజ్, డీకే, అమెజాన్ ఇండియా ఒరిజినల్స్‌కు హెడ్ అపర్ణాపురోహిత్లతో ‘మాస్టర్‌క్లాస్’ గోష్ఠి జరిగింది. అందులో సమంత మాట్లాడుతూ, తెలుగు పరిశ్రమ, హైదరాబాద్ తనకు పుట్టినిల్లు అని పేర్కొంది. ఈ చిత్రోత్సవంలో ఇతర వక్తలుగా దర్శకురాలు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, నటుడు మనోజ్ బాజ్‌పేయి (వర్చువల్, సమంతా కూడా వర్చువల్ గానే పాల్గొంటుందని భావించారు) డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పాల్గొన్నారు. ఇది తనకు మర్చిపోలేని అనుభవం అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయిన మనోజ్ బాజ్‌పేయి వీడియో కాల్ ద్వారా సభనుద్దేశించి ప్రసంగించారు. ది ఫ్యామిలీ మ్యాన్-2 మేకింగ్ ముచ్చట్లను ఆడియెన్స్‌తో పంచుకున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 28వరకు కొనసాగనుంది. కాగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక సినిమా 'శాకుంతలం'లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. రాబోయే చిత్రం 'కత్తువాకుల రెండు కాదల్' షూటింగ్ కోసం చెన్నైలో ఉంది సమంత. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్లో థియేటర్లను పలకరించనుంది. సమంత, విజయ్ సేతుపతి, నయనతార ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఈ కరాటే పిడుగును గుర్తుపట్టారా?
హైదరాబాద్ : 'ఏమాయ చేసావె' చిత్రంతో తెలుగు కుర్రకారు గుండెలను మాయ చేసిన సమంత రూత్ ప్రభు సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుంది. 2010లో తెరంగ్రేటం చేసిన ఈ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. దాదాపు అగ్రహీరోల అందరితోనూ జత కట్టిన ఈ చెన్నై బ్యూటీ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ప్లేస్ దక్కించుంది. అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మనం లో తళుక్కమని ఆకట్టుకున్న సమంత పుట్టినరోజు నేడు. సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించిన సమంత ఇపుడు 29 వ వసతంలోకి అడుగు పెడుతోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్నిముఖ్యమైన ఫోటోలు అభిమానుల కోసం.. మరోవైపు తెలుగులో నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ' చిత్రం, ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో చేస్తోంది. దీంతో పాటు ఆమె సూర్యతో చేసిన '24' మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అటు సమంత పుట్టినరోజును పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షల వెల్లువ కురిసింది. దీంతో ట్విట్టర్ ద్వారా అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది ఈ స్టార్ హీరోయిన్. సో.. లెట్స్ విష్ హెర్ ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే అండ్ గ్రేట్ ఫ్యూచర్.. I hear #HBDSamantha was trending nationwide for 12 hours. Thankyou with all my heart ️ — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 28 April 2016