breaking news
Sakshi cartoonist Shankar
-
నేడు కార్టూనిస్ట్ శంకర్ చిత్రాల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ ఆర్టిస్ట్, ‘సాక్షి’కార్టూనిస్ట్ శంకర్ కార్టూన్ చిత్రాల ప్రదర్శన శనివారం రవీంద్రభారతి ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఇండియా ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’పేరుతో నిర్వహించే ఈ 20 ఏళ్ల రాజకీయ చిత్రాల ప్రదర్శన ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, సూర్యప్రకాశ్, ప్రజా కవి గోరటి వెంకన్న, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొంటారు. -
అవతరణ వేడుకల్లో 62 మందికి సన్మానం
- జర్నలిజం విభాగంలో ఎంపికైన సాక్షి కార్టూనిస్ట్ శంకర్ - వివిధ రంగాల ప్రముఖులను సత్కరించనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 62 మందిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు గతంలో ఏర్పాటు చేసిన కమిటీ 62 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి సమర్పిం చింది. ఆ జాబితాకు ప్రభుత్వం ఆమోదం తెలి పింది. ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులతోపాటు, ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీ, మండలం, పురపాలక సంఘం, స్వచ్ఛంద సంస్థలకు కూడా జాబితా లో చోటు దక్కింది. పురస్కారగ్రహీతలను జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేదికపై రూ.లక్షా నూట పదహార్ల నగదు పురస్కారంతో పాటు శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సన్మానించనున్నారు. జర్నలిజం విభాగంలో సాక్షి పత్రిక కార్టూనిస్టు శంకర్‌ను కమిటీ ఎంపిక చేసింది. సన్మానానికి ఎంపికైన వారి వివరాలివీ.. సాహిత్యం: కోవెల సుప్రసన్నాచార్య (వరంగల్), కపిలవాయి లింగమూర్తి (మహబూబ్‌నగర్), ముదిగంటి సుజాతారెడ్డి (కరీంనగర్), సంగిశెట్టి శ్రీనివాస్ (నల్లగొండ), కె.వి.నరేందర్ (కరీంనగర్), అబ్దుల్ రెహమాన్ ఖాన్ (హైదరాబాద్), సర్ మీర్ ఇబ్రహీం హమీ (హైదరాబాద్) నృత్యం: దీపికారెడ్డి (హైదరాబాద్), డి.ప్రకాశ్-పేరిణి జానపద నృత్యం: ఎ.నాగరాజు (ఆదిలాబాద్) సంగీతం: మిట్ట జనార్దన్-సితార్ (హైదరాబాద్), కె.రామాచారి-లైట్ మ్యూజిక్(మెదక్) జానపద సంగీతం: ఎస్.ప్రభాకర్ (మెదక్), జంగిరెడ్డి (మహబూబ్‌నగర్), ధర్మానాయక్ (నల్లగొండ), సి.రవి (ఆదిలాబాద్), గంగ (నిజామాబాద్) ఉద్యమ గానం: యశ్పాల్ (ఖమ్మం), పద్మావతి (కరీంనగర్), తేలు విజయ (కరీంనగర్) చిత్రలేఖనం: వై.బాలయ్య-బతిక్ (మెదక్) వైదిక పాండిత్యం: మాడుగుల మాణిక్య సోమయాజులు (రంగారెడ్డి) అర్చకత్వం: ఎన్.నరసింహాచార్యులు-యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధానార్చకులు (నల్లగొండ) ఆధ్యాత్మిక పండితులు: కొడకండ్ల నరసింహరామ సిద్ధాంతి (వరంగల్), ముఫ్తీ అజీమొద్దీన్, రెవరెండ్ నల్లా థామస్-సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ శాస్త్రవేత్త: డాక్టర్ వి.రామ్‌గోపాల్‌రావు-డెరైక్టర్ ఐఐటీ ఢిల్లీ, అంకటి రాజు- అగ్ని ప్రాజెక్టు, డీఆర్డీఎల్ (నల్లగొండ) జర్నలిజం: సి.ఆర్.గౌరీశంకర్ (హైదరాబాద్), నూర శ్రీనివాస్ (వరంగల్), ఆకారపు మల్లేశం(హైదరాబాద్), ఎం.ఎ.మాజీద్, కవిత-ఎలక్ట్రానిక్ మీడియా,శంకర్-కార్టూనిస్టు హస్తకళలు: ది నిర్మల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నిర్మల్ క్రీడలు: అనూప్ కుమార్-రోలర్ స్కేటింగ్, ఆనంద్ ఖోఖో ఉద్యోగం: హనుమంతరావు-జీఏడీఏ, డాక్టర్ రావుల ఉమారెడ్డి, సి.ప్రభాకర్-ఎస్ఈ టీఎస్ఎస్పీడీసీఎల్ (నిజామాబాద్), ఎ.శ్రీనివాసు లు-డీఈ టీఎస్ఎస్పీడీసీఎల్ (సూర్యాపేట), పి.రాజామోహన్-ఏడీఈ కేటీపీఎస్, పి.హనుమంతరావు-డిపో మేనేజర్ టీఎస్ఆర్టీసీ (జగిత్యాల), వి.సుభాష్-కండక్టర్ టీఎస్ఆర్టీసీ (ఆదిలాబాద్), ఎండీ తజాముల్ హుస్సేన్-డ్రైవర్ టీఎస్ఆర్టీసీ కామారెడ్డి. వైద్యం: డాక్టర్ ఎ.గోపాలకృష్ణ-నెఫ్రాలజిస్టు స్వచ్ఛంద సంస్థ: ‘గ్రామ్య’ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సామాజిక సేవ: డాక్టర్ విజయభాస్కర్ - బీఎల్ఎన్ చారిటీ (గోదావరిఖని) రైతు: ఎం.అంజిరెడ్డి-వ్యవసాయం(ఇబ్రహీంపట్నం-రంగారెడ్డి), వర్ని శంకర్-ఉద్యానవనం(పోతంగల్, కోటగిరి-నిజామాబాద్) పురపాలక సంఘం: ఖమ్మం గ్రామ పంచాయతీ: మల్కాపూర్ (మెదక్), మాదాపూర్ (బెజ్జంకి-కరీంనగర్) ఔత్సాహిక పారిశ్రామికవేత్త:ఎ.లక్ష్మీనారాయణ (హైదరాబాద్) న్యాయవాది: గుడిమల్ల రవికుమార్ (వరంగల్) మండలం: వనపర్తి (మహబూబ్‌నగర్) బోధన:గోల్డీ బల్బీర్‌సింగ్ కౌర్-ప్రిన్స్‌పల్ టీఎస్ మోడల్ స్కూల్, గంగాధర(కరీంనగర్) వినూత్న సాగు: మధుసూదన్‌రెడ్డి- బోన్సాయ్ మాజీ సైనికోద్యోగి: లెఫ్టినెంట్ కల్నల్ గల్బా శివకిరణ్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ ఎ.బాలకృష్ణ సాహసకృత్యాలు: జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ (ఆదిలాబాద్)