breaking news
sacrificials
-
‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం, తనపై కొందరు తాంత్రిక పూజలు జరుపుతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కాంగ్రెస్ ప్రభుత్వం, నాపై కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎప్పటి నుంచి ఆ పూజలు చేస్తున్నారలో నాకు తెలుస్తునే ఉంది. ఈ పూజలను కొందరు నాతో పాటు సీఎం సిద్ధరామయ్యపై కూడా చేయిస్తున్నారు. కేరళలోని రాజ రాజేశ్వరీ ఆలయంలో శత్రువులను తొలగించటం కోసం కొందరు ‘‘శత్రు భైరవీ యాగం’’ (అగ్నిబలి) పేరిట పూజలు చేస్తున్నారు. పంచబలి(ఐదు వస్తువులను బలి ఇవ్వటం) చేస్తున్నారు. దీని కోసం ఎర్రమేక, 21 బర్రెలు, మూడు నల్ల మేకలు, ఐదు పందులను బలి ఇచ్చారు. దీని ఫలితంగా అగ్ని బలి జరుగుతుంది. ఫలితంగా శత్రువులు తొలిగిపోతారని నమ్మకం ఉంది’’ అని డీకే శివ కుమార్ అన్నారు.ఈ పూజలు ఇంకా కొనసాగుతున్నాయని డీకే తెలిపారు. ఆ పూజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతోందని అన్నారు. అయితే ఈ పూజలు ఎవరూ జరిపిస్తున్నారన్న విషయాన్నిమాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఓ ప్రతిపక్ష నాయకుడి ఆదేశాల మేరకు ఈ తాంత్రిక పూజులు జరుగుతున్నాయని తెలిపారు.‘‘అలా చేయటం వారి నమ్మకం. దాన్ని వారికే వదిలేస్తున్నా. వారు ఏం చేయాలకుంటే అది చేసుకోవచ్చు. వాళ్ల పూజల నుంచి మమ్మల్ని రక్షించే శక్తి మా వెంటే ఉంది’’ అని డీకే శివకుమార్ అన్నారు. -
స్వరాజ్య స్ఫూర్తి..గణతంత్ర దీప్తి
అనంతపురం కల్చరల్ : భారతావని దాస్యశృంఖలాలను ఛేదించి భరతమాతకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దేశానికి దిశాదర్శనం చేసేందుకు జాతీయనాయకులు ఎంతో శ్రమించి సర్వోత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. 1950 జనవరి 26న అధికారికంగా దీనికి శ్రీకారం చుట్టారు. అహింసే నాటి ఆయుధం.. త్యాగం, శాంతి, నిస్వార్థం.. దేశభక్తే ఆనాటి ప్రధాన ఆయుధంగా తెల్లవారిని తరిమికొట్టిన ఆనాటి దేశభక్తులలో అనంత వాసులు తమదైన పాత్రను పోషించి భరతమాత సంకెళను తెంచడంలో తోడ్పడ్డారు. నాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచినవారి మనోగతాలు ఇలా... అప్పటి నిజాయితీ కనపడదు స్వాతంత్ర పోరాటంలో ప్రతి పౌరుడూ తమ వంతు పాత్ర పోషించారు. ప్రత్యక్షంగా పోరా డి, జైళ్లకు వెళ్ళిన వారిని మాత్రమే స్వాతంత్య్ర సమర యోధులుగా గుర్తిస్తున్నారు. ఆనాడు దేశంలోని ప్రతి వ్యక్తి భరత మాత ధాస్య శృంఖలాలను తెంచడానికి నిరుపమాన త్యా గాన్ని చేశారు. అనంత వాసులు ఆనాటి కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు, నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి తదితరులున్నారు. వారిని చూసిన కళ్లతో ఇప్పటి రాజకీయ నాయకులను చూడలేకపోతున్నాం. - పెద్ద కొండప్ప (95), అనంతపురం దేశభక్తిని నింపే కార్యక్రమాలు చేపట్టాలి అనేక మంది త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్రం స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 1952లో స్వాతంత్య్రానికి గుర్తుగా నగరంలో ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన అప్పటి ప్రధాని నెహ్రూ కోసం స్వయంగా పీటీసీ స్టేడియం ప్రాంతాన్ని స్వయంగా శుభ్రపరిచారు. కల్లూరు సుబ్బారావు, ఆర్ఎస్ నాగేశ్వరరావు వంటి వారు తమ కుటుంబాలను కాదని దేశం కోసం తమ ఆస్తులను ధారపోశారు. వారి ఆశయాల కోసం ఈతరం వారిలో దేశభక్తిని నింపే కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలి. - అబ్దుల్ సత్తార్ (85), అనంతపురం