breaking news
rythu bharosa yathra
-
కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ పచ్చి అబద్ధాలు
-
రైతు భరోసా యాత్రలకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా రెండేళ్లుగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోంది. వీటిని వివరిస్తూనే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసా యాత్రలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య, పశు సంవర్ధక శాఖల సమన్వయంతో ఈ నెల 23 వరకు యాత్రలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10,544 ఆర్బీకేల్లో ఈ యాత్రలకు శ్రీకారం చుట్టారు. వీటిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. వీరంతా గ్రామాల్లో కలియ తిరుగుతూ రైతులతో మమేకమయ్యారు. రైతుల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం వైఎస్సార్ రైతు భరోసా యాత్రలకు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆర్బీకేకు అనుబంధంగా ఏర్పాటు చేసిన సీహెచ్‌సీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమైన ఆయన ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన యాత్రల్లో తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని వినిపించారు. యాత్రల ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే వారి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఖరీఫ్ సాగు సన్నద్ధత, మార్కెటింగ్‌కు అనువైన రకాల సాగు, యాజమాన్య పద్ధతులు, ఇతర మెళకువలపై శాస్త్రవేత్తలు వివరించారు. రైతులతో ముఖాముఖిలో వారడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సాగు పద్ధతులపై నమూనా ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేశారు. ఆర్బీకేల్లో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్న యంత్ర పరికరాలు, వాటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. సద్వినియోగం చేసుకోండి.. సాగులో తీసుకొస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెళకువలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. సీఎం యాప్, ఈ–క్రాపింగ్ బుకింగ్ ఆవశ్యకతపై వివరిస్తాం. శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు రైతులతో భేటీ అవుతూ క్షేత్ర స్థాయిలో వారెదుర్కొనే సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపుతారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
కోవిడ్ సంక్షోభంలో.. రైతు కష్టమే ఎక్కువ: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంలో ప్రభుత్వ కష్టం కంటే రైతుల కష్టమే ఎక్కువ అని భావించానని, ఆదాయ వనరులు తగ్గినప్పటికీ రైతులకు ఇచ్చిన మాట మేరకు వరుసగా మూడో ఏడాది రైతు భరోసా కింద ఆయా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సాగులో రైతులు ఏ ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, వారి కోసం గత 23 నెలల్లో ఎన్నో కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడతగా 52.38 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7,500 చొప్పున గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.3,928 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో రైతులు, అధికారులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్ సమూల నిర్మూలనకు వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమని, కానీ దేశంలో తగినంత వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదన్నారు. అందువల్ల కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే ఎదుర్కోక తప్పదని చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు తమ పని చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. వాక్సినేషన్ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. 23 నెలలు.. రూ.89 వేల కోట్లు వినడానికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నప్పటికీ, ఈ 23 నెలల పాలనలో దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో దాదాపు రూ.89 వేల కోట్లు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాము. ఎక్కడా వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా, పక్కాగా సామాజిక తనిఖీలు చేసి, ఏ ఒక్క అర్హుడు మిస్ కాకుండా అందరికీ ప్రయోజనం కల్పించాం. ప్రతి పేద వాడికి సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాము. రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు మూడో ఏడాది తొలి విడతగా ఇవాళ అర కోటి మందికి పైగా రైతులకు రూ.3,928 కోట్లు వారి ఖాతాల్లో వేస్తున్నాము. 2019–20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. ఇవాళ్టి మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను. రైతన్నలకు రూ.68 వేల కోట్ల సాయం – రైతు భరోసా కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.17,029 కోట్లు ఇవ్వగలిగాము. – వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా కలుపుకుని 67.50 లక్షల మంది రైతులకు రూ.1,261 కోట్లు ఇచ్చాం. – వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.1,968 కోట్లు ఇచ్చాం. – ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపోయిన 13.56 లక్షల మంది రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1038 కోట్లు ఇచ్చాం. – ధాన్యం కొనుగోలుకు రూ.18,343 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు రూ.4,761 కోట్లు ఖర్చు చేయగలిగాం. – ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లపై రూ.1700 కోట్లు ఖర్చు చేశాం. – గత ప్రభుత్వం వదిలి పెట్టిపోయిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు మీ బిడ్డ తీర్చాడు. విత్తన సేకరణ బకాయిలు కూడా రూ.384 కోట్లు తీర్చాం. – శనగ రైతులకు బోనస్ కింద దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశాం. – సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి కోసం 13.58 లక్షల ఎకరాలలో రూ.1,224 కోట్లు ఖర్చు చేశాం. – ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50కే ఇస్తూ, ఏటా దాదాపు రూ.760 కోట్ల భారం భరిస్తూ, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1,560 ఖర్చు చేశాం. మొత్తంగా గత 23 నెలల్లో రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా, మీ బిడ్డగా తెలియజేస్తున్నా. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? ప్రతి రైతుకూ ఈ పథకం ద్వారా మేలు – దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, అటవీ హక్కు పత్రాలు (ఆర్ఓఎఫ్ఆర్) పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకం వర్తింప చేస్తున్నాం. – రాష్ట్రంలో దాదాపు 50 శాతం రైతులకు అర హెక్టారు (1.25 ఎకరాలు) భూమి మాత్రమే ఉంది. అదే ఒక హెక్టారు (2.5 ఎకరాల) వరకు భూమి ఉన్న రైతులు దాదాపు 70 శాతం ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రభుత్వం చేస్తున్న రూ.13,500 సాయం, ఆ రైతులందరికీ దాదాపు 80 శాతం సరిపోతుంది. – ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినా, అధికారంలోకి రాగానే రైతన్నల కష్టాలు చూసి, చెప్పిన దాని కన్నా ఒక ఏడాది ముందుగానే, ఇస్తామన్న దాని కన్నా మరో వెయ్యి రూపాయలు ఎక్కువగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున, అయిదేళ్లలో మొత్తం 67,500 రూపాయల చొప్పున సహాయం చేస్తున్నాము. ఆ విధంగా రైతన్నలకు రూ.17,500 అదనంగా ఇవ్వగలుగుతున్నాం. ఈ నెలలోనే మరో రూ.2 వేల కోట్లు – వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ నెల 25న దాదాపు 38 లక్షల మంది రైతులకు దాదాపు రూ.2 వేల కోట్లు అందించబోతున్నాం. – 5 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతులు, మహిళలు, పిల్లలు, ముఖ్యంగా పేద వర్గాలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ 23 నెలల పరిపాలన సాగింది. కోవిడ్‌తో యుద్ధం – ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. ఒకవైపు కోవిడ్‌తో యుద్ధం చేస్తూ, మనందరం సామాన్య జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంది. కోవిడ్‌ను సమూలంగా తీసేయాలి అంటే, వాక్సినేషన్ ఒక్కటే అని అందరికీ తెలుసు. కానీ మన దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటన్నది కూడా అందరికీ తెలుసు. – దేశంలో 45 ఏళ్ల పైబడిన వారు దాదాపు 26 కోట్లు ఉంటే, వారికి రెండు డోస్‌ల చొప్పున మొత్తం 52 కోట్ల డోస్‌లు ఇవ్వాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు 60 కోట్లు ఉన్నారు. వారికి 120 కోట్ల డోస్‌లు కావాలి. వీరందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే మొత్తం 172 కోట్ల డోస్‌లు కావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు 18 కోట్ల డోసులు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. అంటే దాదాపు 10 శాతం మాత్రమే ఇవ్వగలిగాం. – రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా 45 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 1.48 కోట్లు ఉన్నారు. వారందరికీ దాదాపు 3 కోట్ల డోస్‌లు కావాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు మరో 2 కోట్లు. వారికి రెండు డోస్‌ల చొప్పున 4 కోట్ల డోస్‌లు కావాలి. ఆ విధంగా వీరందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్లు కావాల్సి ఉండగా, మనకు కేంద్రం సరఫరా చేసింది కేవలం 73 లక్షల డోస్‌లు మాత్రమే. అంటే 10 శాతం కూడా మించని పరిస్థితి. – ఎందుకు ఈ పరిస్థితి అంటే, దేశంలో కేవలం రెండు కంపెనీలు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ మాత్రమే వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ నెలకు కోటి, సీరమ్ సంస్థ 6 కోట్లు.. రెండూ కలిపి నెలకు 7 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. – కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి. ఒకవైపు చేయాల్సిన పనులు చేస్తూనే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలి. ఆ విధంగా రైతులు తమ పని చేసుకుపోవాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కొన్ని విన్నప్పుడు అవి సాధ్యమవుతాయా? అనిపిస్తుంది. కానీ సీఎం జగన్, అలా సా«ధ్యం చేసి చూపారు. గత ముఖ్యమంత్రి రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారు. కానీ మీరు మాత్రం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. ఎవరైనా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని చూస్తారు. కానీ మీరు మాత్రం ఆ సంఖ్య క్రమంగా పెంచుతూ పోతున్నారు. ఈ ఏడాది యానాం రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఈ స్థాయిలో రైతులకు అండగా నిలుస్తున్నందుకు రైతాంగం తరఫున మీకు కృతజ్ఞతలు. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 52.38 లక్షల మంది రైతులకు రైతు భరోసా మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా రూ.3,928 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. దేవుడి దయతో మీ బిడ్డగా ఈ గొప్ప కార్యక్రమం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు 600 పేజీల మేనిఫెస్టో ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం మనమంతా చూశాం. అలాంటి పరిస్థితి రాకూడదని, ఎన్నికలప్పుడు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ప్రకటించాం. దాన్ని భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తామని చెప్పాం. తూచ తప్పకుండా ఈ 23 నెలల కాలంలో అందులో 90 శాతానికి పైగా అమలు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. -ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడు మీరు నాకు రెండెకరాలు సొంత పొలం ఉంది. మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నా. మూడు విడతల్లో నాకు రైతు భరోసా డబ్బులు అందుతున్నాయి. ఇందుకు మీకు ధన్యవాదాలు. గతంలో పంట షావుకార్లకు అమ్మాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్బీకేల వద్దే ధైర్యంగా అమ్ముకుంటున్నాం. నా ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మా ఊళ్లోనే అందుతున్నాయి. పంట నష్టపోతే పరిహారం ఇచ్చారు. వైఎస్సార్‌కు తగ్గ కుమారుడిగా మీరు అన్ని విధాలా ప్రజలను ఆదుకుంటున్నారు. – గోవిందరాజులు, జెడ్.భావారం, తూ.గో జిల్లా -
జనయాత్ర
► తాడిపత్రి నియోజకవర్గంలో జనసంద్రం మధ్య సాగుతున్న రైతు భరోసా యాత్ర ► రెండోరోజు యాత్రలో మూడు కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా ► క్రిష్టిపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ ► పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో జగన్‌ను చూసేందుకు భారీగా వచ్చిన జనం ► నేడు తాడిపత్రి నియోజకవర్గంలో ముగియనున్న యాత్ర.. రేపటి నుంచి కదిరి పరిధిలో. సాక్షిప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఐదో విడత రైతు భరోసా యాత్ర రెండోరోజు జనసంద్రం మధ్య దిగ్విజయంగా సాగింది. ప్రతిపల్లె జగన్నినాదంతో మార్మోగింది. అభిమాన నేత రావడంతో జనం తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చారు. ఆయనతో కరచాలనం చేసి ఆనందపరవశులయ్యారు. జన ఉప్పెన మధ్య జగన్ కాన్వాయ్ నిదానంగా ముందుకు సాగింది. అయినా పలుగ్రామాల్లో ప్రజలు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండి జగన్‌ను స్వాగతించారు. రైతు భరోసా యాత్ర రెండో రోజు గురువారం పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి మొదలైంది. ఆ గ్రామంలోని జెడ్పీటీసీ సభ్యుడు చిదంబర్‌రెడ్డి నివాసంలో బసచేసిన జగన్‌ను ఉదయం తాడిపత్రి నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, కార్యకర్తలు కలిశారు. అక్కడి నుంచి లక్షుంపల్లికి చేరుకున్నారు. మార్గమధ్యంలో పొలాల్లో వ్యవసాయపనులు చేస్తున్న మహిళా కూలీలు జగన్‌ను చూసి పరుగెత్తుకొచ్చారు. వారిని చూసిన జగన్ కాన్వాయ్‌ను ఆపారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. లక్షుంపల్లి వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ ఊరు దాటేందుకు గంట సమయం పట్టింది. దారిలో చిన్నపిల్లలను ఆప్యాయంగా ముద్దాడారు. వృద్ధులను ‘ఏం పేరు అవ్వా.. ఏం పేరు తాతా?’ అంటూ పలకరించారు. యువకులతో కరచాలనం చేశారు. కొంతమంది చిన్నారులు, యువకులు సెల్ఫీలు తీసుకున్నారు. కాన్వాయ్ వస్తుంటే మిద్దెలపై నుంచి బంతిపూల వర్షం కురిపించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్‌గా గతంలో పనిచేసిన నాగరాజు వీల్‌చైర్‌లో రాగా అతన్ని జగన్ పలకరించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, వైఎస్సార్సీపీ కార్యకర్త అని ముద్రవేసి ఫీల్డ్అసిస్టెంటుగా తొలగించారని నాగరాజు వాపోయాడు. ఆపై మరింత ఆరోగ్యం క్షీణించి ఇలా కుర్చీకి పరిమితమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత వైఎస్సార్సీపీ నాయకుడు సూర్యనారాయణరెడ్డి ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లారు. అక్కడి నుంచి ముప్పాలగుత్తి, బుర్నాకుంట మీదుగా కదరగుట్టపల్లికి చేరుకున్నారు. దారిలో యాడికి కాలువను పరిశీలించారు. ఆ తర్వాత క్రిష్టిపాడుకు చేరుకోగా.. డప్పులు, బ్యాండ్వాయిద్యాలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ ఊరు దాటేందుకు రెండు గంటల సమయం పట్టిందంటే ఏస్థాయిలో జనం తరలివచ్చారో ఇట్టే తెలుస్తోంది. ఈ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబానికి భరోసా ఇచ్చారు. తర్వాత ఇదే గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన అన్నెం శ్రీరాములు అనే వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. ఇక్కడి నుంచి నేరుగా యాడికి మండలం రాయలచెరువు చేరుకున్నారు. మహిళలు దిష్టితీసి తిలకం దిద్ది హారతి పట్టారు. గ్రామస్తులంతా రోడ్డుపైకి రావడంలో హైవే కిక్కిరిసింది. అక్కడి నుంచి కూర్మాజీపేటకు చేరుకోగా.. గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఆపై రామరాజుపల్లికి చేరుకున్నారు. తర్వాత గ్రామస్తుల కోరిక మేరకు భోగాలకట్టకు వెళ్లి..అక్కడి నుంచి నగరూరుకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు దాసరి కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలను పరామర్శించారు. అటు నుంచి నేరుగా యాడికి చేరుకున్నారు. రామిరెడ్డి ఇంట్లో బస చేశారు. రెండోరోజు యాత్రలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, వీఆర్ రామిరెడ్డి, అదనపు సమన్వయకర్త రమేశ్‌రెడ్డి, శింగనమల నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి, చవ్వారాజశేఖరరెడ్డి, మీసాల రంగన్న, కోటి సూర్యప్రకాశ్‌బాబు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మహానందరెడ్డి, ట్రేడ్‌యూనియన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు. నేటి యాత్ర ఇలా.. మూడోరోజు రైతు భరోసా యాత్ర వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ వెల్లడించారు. వైఎస్ జగన్ యాడికిలో రామిరెడ్డి నివాసం నుంచి బయలుదేరి కమ్మవారిపల్లి, పసలూరు, గార్లదిన్నె, చిన్నపప్పూరు మీదుగా రామకోటి చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత పెద్దపప్పూరు, షేక్‌పల్లి, నామనాంకంపల్లి, వరదాయపల్లి మీదుగా ముచ్చుకోటకు చేరుకుంటారు. రైతు లీలా కృష్ణమూర్తి కుటుంబానికి భరోసానిస్తారు.