రౌడీ షీటర్ షకీల్ మృతి
మేడ్చల్ : గ్యాంగ్స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు షకీల్ గుండెపోటుతో మృతి చెందాడు. నగర శివారులో ఆయనకు గుండెపోటు రావడంతో అనుచరులు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ వుండలంలోని ఘనాపూర్ మెడిసిటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. విశ్వసనీయు వర్గాల సమాచారం ప్రకారం.. నయీమ్ అనుచరుడు షకీల్కు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయునను అనుచరులు మండలంలోని ఘనాపూర్ గ్రావు పరిధిలో ఉన్న మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో షకీల్ మృతదేహాన్ని స్వస్థలం నల్లగొండ జిల్లా భువనగిరికి తరలించారు. షకీల్ మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని మేడ్చల్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. అయితే, షకీల్పై రాష్ట్ర వ్యాప్తంగా 150కి పైగా కేసులున్నాయి. ఆయన మావోయిస్టు సాంబశివుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు.