breaking news
Robotic Arm
-
సత్తా చాటిన ఇస్రో.. అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్
-
‘ఇస్రో’ రోబో హస్తం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేసిన రోబోటిక్ హస్తం అంతరిక్షంలో తన కార్యాచరణ ప్రారంభించింది. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక పరిణామమని నిపుణులు చెబుతున్నారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకొనే దిశగా స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్) మిషన్‌లో భాగంగా ఈ రిమోట్ రోబోటిక్ చెయ్యిని అంతరిక్షంలోకి పంపించారు. శ్రీహరికోటలోని షార్ నుంచి గత నెల 30వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లింది. మన దేశానికి చెందిన మొట్టమొదటి రోబోటిక్ హస్తం రీలొకేటబుల్ రోబోటిక్ మ్యానిప్యులేటర్–టెక్నాలజీ డెమాన్ర్స్టేటర్(ఆర్ఆర్ఎం–టీడీ) కార్యాచరణ మొదలుపెట్టిందని, ఇది మనకు గర్వకారణమని ఇస్రో వెల్లడించింది. పూర్తి స్థాయిలో విజయవంతమైన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఎం–టీడీని నడిచే రోబోటిక్ హస్తంగా పరిగణిస్తారు. ఇండియాలో ఇలాంటిది అభివృద్ధి చేయడంలో ఇదే మొదటిసారి. ఇందులో ఏడు జాయింట్లు ఉన్నాయి. అవి అన్ని వైపులా కదులుతాయి. అంతరిక్షంలోని స్పేడెక్స్ మిషన్‌లో భాగమైన పీఎస్4–ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్(పోయెం–4) ఫ్లాట్‌పామ్‌పై చురుగ్గా నడవగలదు. నిర్దేశించిన చోటుకు వెళ్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మర చెయ్యిని రూపొందించారు. ఇందులో కంట్రోలర్లు, కెమెరాలు, అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు. భారతీయ అంతరిక్ష స్టేషన్(బీఏఎస్) పేరిట సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి భారత్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఏఎస్ నిర్మాణం, నిర్వహణకు రోబోటిక్ టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీని స్వయంగా అభివృదిచేసుకొనే దిశగా రోబోటిక్ హస్తం కీలకమైన ముందడుగు అని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. -
రోబోటిక్ చేయిని రూపొందించిన భారత సంతతి విద్యార్థి
న్యూయార్క్: అతి త క్కువ ఖర్చుతో రోబోటిక్ చేయిని రూపొందించి భారత సంతతి విద్యార్థి ప్రశంసలు అందుకున్నాడు. సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులో భాగంగా ఈ రోబోటిక్ చేయిని రూపొందించిన నిలయ్ మెహతా.. అమెరికా పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందించే బ్లూ రిబ్బన్ అవార్డును అందుకున్నాడు. కాలిఫోర్నియాలోని ఇర్విన్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న మెహతా ఈ ప్రాజెక్టు కోసం నాలుగు నెలలుగా కష్టపడినట్లు చెప్పాడు. ఆరెంజ్ కంట్రీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌కు అర్హత సాధించి నాలుగు మొదటి బహుమతులు కూడా అందుకున్నాడు. సాధారణంగా కృత్రిమ చేయి 35వేల డాలర్లు(సుమారు రూ.22 లక్షలు ) ఉంటుంది. నిలయ్ రూపొందించిన ఈ రోబోటిక్ ధర కేవలం 260 డాలర్లు(రూ. 16,500) మాత్రమే.