breaking news
rammohanaravu
-
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా రామ్మోహనరావు
‘ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడిగా మల్టీ డైమన్షన్ సంస్థ అధినేత పి. రామ్మోహనరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెండేళ్ల పాటు ఈ పదవీ కాలం కొనసాగుతుంది. -
అలా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది
‘‘చాలా మంది నిర్మాతలు, దర్శకులు తమ బిడ్డలను హీరోలను చేయడంతో పాటు, వాళ్లని అగ్రస్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. కానీ, నా బిడ్డలకు అదృష్టం లేదని బాధపడేవాణ్ణి. అయితే, ఇండస్ట్రీలో ఉన్నది డెబ్భై శాతం మంది నా బిడ్డలే అని చెప్పుకోవడం గర్వంగా ఉంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఎలుకా మజాకా’. ఈ చిత్రం లోగోను దాసరి ఆవిష్కరించారు. ‘‘మురళీ రామ్మోహనరావు రాసిన ‘ఎలుక వచ్చె ఇల్లు భద్రం’ నవల ఆధారంగా ఈ చిత్రం తీశాను. గ్రాఫిక్స్ ఓ హైలైట్’’ అని దర్శకుడు చెప్పారు. -
వీరభద్రస్వామికి కన్నీటి వీడ్కోలు
రామవరప్పాడు : రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన హీరో రాజేంద్రప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి మృతదేహం పోస్టుమార్టం అనంతరం శుక్రవారం ప్రసాదంపాడులోని అతని స్వగృహనికి చేరుకుంది. డ్రగ్స్ అండ్ కంట్రోల్ అడ్మినిస్టేటివ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వీరభద్రస్వామి మంగళవారం రాత్రి రామవరప్పాడు బళ్ళెం వారి వీధిలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన విషయం విధితమే. వీరభద్రస్వామి కూతురు, కొడుకు కెనడాలో ఉండడంతో వారు వచ్చే వరకూ పోస్టుమార్టం వాయిదా వేశారు. తండ్రిని కడసారి చూసుకునేందుకు కూతురు, కొడుకు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలోని మృతదేహన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని బంధువులు, సన్నిహితుల సందర్శనార్థం గ్రామానికి తీసుకోచ్చారు. సినీ హిరో రాజేంద్రప్రసాద్ విగతజీవిగా మారిన తన సోదరుడ్ని చూసి కన్నీటి పర్యంతరమయ్యారు. మృతదేహనికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మృతుడికి చిన్ననాటి మిత్రుడైన నగర మేయరు కోనేరు శ్రీధర్, మృతుడి సహ ఉద్యోగులు, స్నేహితులు, మృతదేహనికి పూలమాలలు వేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.