breaking news
public houses
-
ముంచేశారు...!
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల గోడు వర్ణనాతీతం. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 65గ్రామాల ప్రజలు ఇళ్లు, భూములు కోల్పోయారు. పొట్టచేతబట్టుకొని కట్టుబట్టలతో ఊళ్లు ఖాళీచేసి 30ఏళ్లు అవుతున్నా పాలకులు కరుణించడం లేదు. నేటికీ వారి బతుకుకు భరోసా లభించడంలేదు. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప వారి జీవితాలు ఇంకా చీకటిమయంగానే ఉన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు వారికి షరా మాములుగా మారాయి. సాక్షి, మహబూబ్‌నగర్ :శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వ ల్ల జిల్లాలో కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజ కవర్గాల పరిధిలోని 65 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 11,192 కుటుంబాలకు చెందిన 35,903 మంది నిరాశ్రయులు అయినట్లు ప్రభుత్వ గ ణాంకాలు సూచిస్తున్నాయి. వీరంతా కూడా 1981లో వారి వారి గ్రామాలను ప్రభుత్వం బలవంతంగా ఖా ళీ చేయించింది. నష్టపరిహారం కింద ఎకరాకు కేవ లం రూ.2,500, ఇంటికి రూ.5వేలు మాత్రమే అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో నిర్వాసితులు ఆందోళనలు చేపట్టడంతో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా జీఓ 98 విడుదల చేశారు. దీని ప్రకారం ప్రతి కుటుంబం నుంచి అర్హతను బట్టి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా వారిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. చివరికి బాధితులందరూ కోర్టు తలుపు తట్టారు. రాష్ట్ర హైకోర్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ, ప్రతి కుటుంబానికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచిస్తూ 2006లో తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు 2వేల మంది ఉన్నారని కమిటీ గుర్తించింది. అందుకు అనుగుణంగా నీటిపారుదలశాఖతో పాటు జెన్కోలలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్ తదితర ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచిస్తూ గతేడాది జీఓ నెంబర్ 68 విడుదలైంది. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్‌రావు ఈ విషయమై స్వయంగా అధికారులను ఆదేశించినా ఇప్పటికీ అమలు కావడంలేదు. కుచించుకుపోతున్న అర్హుల జాబితా శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల తలరాత మారడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 65 గ్రామాల పరిధిలో దాదాపు 1,192కుటుంబాలు నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాల్సి ఉంది. అయితే ఏళ్లు గడుస్తుండడంతో చాలా గ్రామాలకు చెందిన నిర్వాసితులు ముంబై, పూణె తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారుల ప్రత్యేక కమిటీకి కేవలం 2వేల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. దాదాపు 8వేల దరఖాస్తులు తగ్గాయి. వీరిలో చాలా మంది వయస్సు దాటిపోవడం చేత కూడా అర్హత సాధించలేకపోయారు. ఇంకా ఆలస్యమయ్యే కొద్ది మరింత తగ్గిపోయే ప్రమాదముంది. నేతల అలసత్వం... ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 65 గ్రామాలు ముంపునకు గురికాగా.. కర్నూలు జిల్లాలో 38 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే కర్నూలు జిల్లాకు చెందిన దాదాపు 2,750 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ల భించాయి. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉ న్నప్పుడు 2వేల మందికి ఉద్యోగ అవకాశం లభించింది. మిగతా వారికి కూడా అవకాశం ఇ వ్వాలంటూ 2013లో నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి నిరాహారదీక్ష చేసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి 750 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం 30 ఏళ్లలో 105 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం కలిగింది. ఇలా జిల్లా ముంపు బాధితులను పట్టించుకునే నాధుడు లేకపోవడంతో అడుగడునా వివక్ష కొనసాగుతూనే ఉంది. -
మావోయిజం వెలుగులో.. అమరుల యాదిలో
విప్లవ స్ఫూర్తినిస్తూ ముగిసిన విరసం మహాసభలు చివరి రోజు కవిగాయక సభ, సెమినార్లు కవుల కవితాగానం రచయితల పుస్తక పరిచయం హన్మకొండ కల్చరల్ /సుబేదారి, న్యూస్‌లైన్: విప్లవాల పురిటిగడ్డ అయిన వరంగల్‌లో నిర్వహించిన విప్లవ రచయితల సంఘం (విరసం) 24వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. తొలిరోజు శనివారం ఆదివాసీ ఉద్యమాలు.. స్వపరిపాలనపై సదస్సు, ర్యాలీ, బహిరంగ సభలు జరిగాయి. రెండో రోజు ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో కవిగాయక సభ, కాళోజీ సాహిత్యం తాత్వికత, అభివృద్ధి భావజాలం, విచ్ఛిన్నమవుతున్న మనిషి అంశాలపై జరిగిన సెమినార్లలో వక్తలు దర్భశయనం శ్రీనివాసచార్య, ఎన్.వేణుగోపాల్ మాట్లాడారు. విప్లవోద్యమ మేధావి మహిత అనే బుక్‌లెట్‌ను వరవరరావు ఆవిష్కరించారు. విరసం సభలకు క్రాంతి జనతన సర్కారు పంపిన సందేశాన్ని వరవరరావు చదివి వివరించారు. లక్ష్మి అలియాస్ మహిత విప్లవోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసింద ని... జీవితాంతం విప్లవం కోసం కృషి చేసిందని... లక్ష్మి, శోభ తనకు ఇద్దరు బిడ్డల్లాంటివారని వరవరరావు అన్నారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే... హృదయంతో కవిత్వం చెప్పిన కవి కాళోజీ : దర్భశయనం శ్రీనివాసచార్య కర్షక కర్రులు కదిలిన్నాళ్లు వ్యవసాయక దేశం అని హృదయంతో కవిత్వం చెప్పిన కవి కాళోజీ అని కవి దర్భశయనం శ్రీనివాసచార్య అన్నారు. అంబేద్కర్ భవన్లో ‘కాళోజీ సాహిత్యం.. తాత్వికత’అంశంపై విరసం సభ్యుడు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక మానవుడు మరొకరిని మానవుడుగా చూడడమే మానవత అని తాత్విక దృక్పథంతో కాళోజీ చెప్పారని గుర్తు చేశారు. నేను, నా భావన లేని మన భావన అనునది కాళోజీ సమభావన అని పేర్కొన్నారు. పీవీ నరసింహరావులాంటి వాళ్ల పేరుతో సంబోధించి నామవాచకాల రూపంలో కవిత లు రాసిన గొప్పకవి కాళోజీ అని... ఆయన కవితల్లో సర్వనామాలు తక్కువని పేర్కొన్నారు. కాళోజి ప్రజాస్వామికవాది అని.... చివరి శ్వాసవరకు ప్రజల కోసం వారి తరఫున పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ గూర్చి చెబుతూ దేశాల పునర్నిర్మాణం లక్షల సార్లు జరుగుతదని కాళోజీ అన్నారని ఆయన ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఆకాంక్షించడానికి ఆయన చెప్పారు. కవిగాయక సభలో... మనిషి ఒంటరి వాడయ్యాడని... కొనుగోలుదారుడిగా, అమ్మకందారుడిగా మారిపోతున్నాడని.... అందుకే అస్థిత్వాల ప్రాధాన్యం పెరిగిపోతున్నదని వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశా రు. పీపుల్స్‌వార్ నాయకుడు కవి చిర్ర సదానందం అలియాస్ కౌముది కవితావేదికగా జరిగిన కవిగాయక సభను గాయకుడు సుదర్శన్, విరసం సభ్యుడు అరసవెల్లి కృష్ణ, కవి వడ్డెబోయిన శ్రీనివాస్ నిర్వహించారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కళ్యాణ్‌రావు కవిత చదివి వినిపించారు. ఆయనతోపాటు 30 మంది వరకు కవితలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలు పుస్తకాలను ఆవిష్కరించారు. కలింగసీమ, ప్రజా సమస్యల పోరాటాలు పుస్తకాన్ని పరిచయం చేసిన విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళింగ, రాయలసీమ ప్రాంతాలు కూడా రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి దోహదకారి అవుతుందన్నారు. కృష్ణాభాయి రాసిన సాహిత్య సమాలోచన పుస్తకాన్ని పరిచయం చేసిన నల్లూరి రుక్మిణి మాట్లాడుతూ ఆరేళ్లుగా ఉద్యమకారుల అభిప్రాయా లు, చర్చలు ప్రత్యక్షంగా పరిచయం చేస్తూ రాసిన విషయాలు అందరూ చదువదగినదిగా ఉందన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ చారిత్రక పత్రాలు పుస్తకాన్ని పరిచయం చేసిన మెట్టు రవీందర్ మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ అంటే మన దేశం నుంచి తెల్లవాళ్లు పోయి నల్లవాడి పాలన వచ్చినట్లేనన్నారు. సౌర్వభౌమాధికారంతో ప్రజాస్వామిక తెలంగాణకావాలన్నారు. ముంద్రస్థాయి యుద్ధం పుస్తకాన్ని పరిచ యం చేసిన రివేరా మాట్లాడుతూ వార్తల్లో ప్రస్తావించడం ద్వారా కూడా ఉద్యమాన్ని నిశ్శబ్దంగా దెబ్బ తీస్తున్న ప్రయత్నాలను వివరించారు. మరిన్ని పుసకావిష్కరణలు పోరాట జలపాతం, ఆదివాసీ పోరాట కథలు పుస్తకాలను పులి అంజయ్య తల్లి సామనర్సక్క, పోలెం సుదర్శన్‌రెడ్డి సహచరి భారతి... అల్లం రాజయ్య రాసిన వసంత గీతం నవలను గంగారం తల్లి లక్ష్మి , నల్లా ఆదిరెడ్డి(శ్యాం) అన్న సుధాకర్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలోని ప్రతి అడుగు విశ్లేషణాత్మకంగా నవలగా రాశాడ ని... సాహిత్య చరిత్రలోనే ఇదొక అరుదైన ప్రక్రియ అని అన్నారు. నందిని సిధారెడ్డి కవితా సంపుటి ఇక్కడి చెట్ల గాలి పుస్తకాన్నిపరిచయం చేసిన వి.చెంచయ్య మాట్లాడుతూ సాహిత్యేతర రంగాలకు చెందిన వారు కూడా చదవాల్సిన పుస్తకమన్నారు. పిల్లనగ్రోవి తుఫా న్ పుస్తకాన్ని వడ్డెబోయిన శ్రీనివాస్ పరిచయం చేశారు. నేను తెలంగాణోన్ని పుస్తకాన్ని పరిచయం చేసిన వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్ష కేవలం రాష్ట్ర ఏర్పాటు కాదు... తెలంగాణ ప్రజల స్వాభిమాన ఆకాంక్ష అన్నారు. ఆకుల భూమ య్య చివరి ప్రసంగాన్ని ఆవిష్కరించిన విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ మాట్లాడుతూ వస్తున్నది సరిహద్దుల తెలంగాణ మాత్రమేనని... వర్గపోరాటం ద్వారా వచ్చేదే నిజమైన తెలంగాణ అని అన్నారు.