provision
-
రుణాలపై ప్రొవిజనింగ్ తగ్గించే యోచనలో ఆర్బీఐ
బ్యాంకులు అనుసరిస్తున్న ప్రాజెక్టు రుణాల ప్రొవిజనింగ్‌ను తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రాజెక్ట్ ఫైనాన్స్ ప్రొవిజనింగ్‌ను గతంలో ప్రతిపాదించిన 5 శాతం నుంచి 1-2.5 శాతానికి తగ్గించబోతున్నట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేలా రుణదాతలకు ఈ విధాన మార్పు వల్ల ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే అధిక ప్రొవిజనింగ్ రుణ లభ్యతను పరిమితం చేస్తుంది. బ్యాంకులు రుణాలపై రిస్క్‌ను పరిమితం చేసేందుకు తమ లాభాల్లో కొంత భాగాన్ని ప్రొవిజనింగ్ రిజర్వుకు కేటాయించాల్సి ఉంటుంది.ఈ మార్పు ఎందుకు?మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పెద్ద ఎత్తున పెట్టుబడులకు ప్రాజెక్టు ఫైనాన్స్ రుణాలు కీలకం. ఇంతకు ముందు ప్రతిపాదించిన అధిక ప్రొవిజనింగ్ అవసరాలు ఇంకా కార్యరూపం దాల్చని ప్రాజెక్టులతో ముడిపడి ఉన్న బ్యాంకింగ్ నష్టాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రొవిజనింగ్‌ను తగ్గించడంతో ఇప్పటికే అమలవుతున్న రవాణా, ఇంధనం, పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్ట్‌లకు మరింత రుణాన్ని అందించే అవకాశం ఉంటుందని ఆర్బీఐ గుర్తించింది. దీనికి తోడు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, క్యాపిటల్ మార్కెట్ల హెచ్చుతగ్గులతో సహా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి దీర్ఘకాలిక పెట్టుబడులకు సవాళ్లను సృష్టించింది. ప్రొవిజనింగ్ అవసరాన్ని తగ్గించడం వల్ల బ్యాంకులు ఆర్థిక భారం లేకుండా రుణ సౌలభ్యాన్ని కొనసాగించేందుకు వీలుంటుందని ఆర్బీఐ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?బ్యాంకులు, ఆర్థిక వృద్ధిపై ప్రభావంక్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్కు సంబంధించి ఆర్బీఐ విధాన మార్పులను బ్యాంకింగ్ రంగం నిశితంగా గమనిస్తోంది. ప్రొవిజనింగ్ అవసరాన్ని 1-2.5 శాతానికి తగ్గిస్తే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలను ప్రోత్సహించవచ్చు. తద్వారా దేశీయ పెట్టుబడులు పెరుగుతాయి. ఇది మౌలిక సదుపాయాల వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక విస్తరణకు మద్దతు ఇవ్వడం అనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. గతంలో నిర్బంధ బ్యాంకింగ్ నిబంధనల వల్ల పెట్టుబడి ఆలస్యం జరిగిన రంగాల్లో ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అనుమతులను పెంచడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. -
నోట్ల రద్దు నిబంధనలకు విరుద్ధం
• సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ • తదుపరి విచారణ నేటికి వారుుదా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు, తదనుగుణంగా కేంద్రం తీసుకున్న చర్యలు ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. ‘‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26 (2) కింద పెద్ద నోట్లను రద్దు చేశారు. కానీ ఇలా రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదు. ఈ సెక్షన్ కింద ఓ సిరీస్, డినామినేషన్ నోట్లను మాత్రమే రద్దు చేయడానికి వీలుంటుంది. కేంద్రం అన్ని సిరీస్ నోట్లనూ రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధం. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ఉన్న ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి’’ అని కోర్టును కోరారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దు నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున వెంకటరమణ వాదనలు వినిపించారు. ‘‘పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులన్నీ మానుకుని ఉదయం నుంచి క్యూలలో నిలబడుతున్నారు. అరుునా వారికి నగదు అందడం లేదు. ప్రతి చోటా కొత్తగా రూ.2 వేల నోటే ఇస్తున్నారు. రూ.1000, రూ.500 నోట్లు లేక, చిల్లర దొరక్క అంతా ఇబ్బందుల పాలవుతున్నారు. వ్యాపారులు దారుణంగా నష్టపోతున్నారు. రద్దు చేసిన నోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు మాత్రమే కేంద్రం గడువిచ్చింది. నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.1000 నోట్లను రద్దు చేశామన్న కేంద్రం, రూ.2 వేల నోటును ఎందుకు తేవాల్సి వచ్చిందో చెప్పడం లేదు. పౌరులకున్న సొమ్మును పొదుపు చేసుకునే, దాచుకునే హక్కును కేంద్రం హరించింది’’ అని వాదించారు. అనంతరం విచారణ శుక్రవారానికి వారుుదా పడింది. -
రెవెన్యూలో స్థానిక అలజడి
♦ పనిచేసే చోట ఉండకపోతే ఇంటికే ♦ హెడ్‌క్వార్టర్‌లో లేకుంటే హెచ్ఆర్ఏ కట్ ♦ తాజాగా మరో సర్క్యులర్ జారీ ♦ పద్ధతి మార్చుకోకపోతే చర్యలు ♦ ఉద్యోగవర్గాల్లో కలవరం రెవెన్యూ యంత్రాంగాన్ని ‘స్థానిక నివాసం’ అంశం వణుకు పుట్టిస్తోంది. పనిచేసే కేంద్రంలో నివాసం ఉండాలనే నిబంధన కలవరపరుస్తోంది. సర్వీసు నియమావళి ప్రకారం స్థానికంగా ఉండాలనే నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందేనని తాజాగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య పరిణామంతో హైద రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగవర్గాల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మూడో వంతు మంది జంటనగరాల నుంచే వచ్చి వెళ్తున్నారు. దాదాపు ప్రతిశాఖలోనూ ఇదే తంతు కొనసాగుండడంతో ‘హెడ్‌క్వార్టర్ ’లో తప్పనిసరిగా ఉండాలనే ఆంక్షలు అమలు కావడంలేదు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి హెడ్‌క్వార్టర్‌లో ఉండాల్సిందే ఎక్కడ పనిచేసే వారు అక్కడే ఉండాలి. హెడ్‌క్వార్టర్‌లో నివసించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ అంశంపై ఇప్పటికే ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాం. పౌర సేవలు అందించడంలో కీలకంగా వ్యవహరించే వీఆర్ఓలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లోనే ఉండాలి. - ఆమ్రపాలి, జేసీ2 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ) త మ క్లస్టర్ పరిధిలోని ఒక గ్రామాన్ని తమ నివాస కేంద్రంగా ప్రకటించాలి. ఈ సమాచారాన్ని తహసీల్దార్లకు అందించాలి. తహసీల్దార్ మొదలు ఆఫీస్ సబార్డినేట్ వరకు తమ నివాసానికి సంబంధించిన ల్యాండ్‌లైన్, మొబైల్ బిల్లులను పై అధికారులకు సమర్పించాలి. నివాస ధ్రువీకరణపత్రం పొందుపరచాలి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ యంత్రాంగం స్థానికంగా ఉండకపోవడంతో పౌరసేవలు సరిగా అందడంలేదని గుర్తించిన భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమాండ్ పీటర్ స్థానికంగా ఉండాలనే నిబంధనను తూ.చ.తప్పకుండా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనలను పాటించని సిబ్బందికి తాఖీదులు ఇవ్వాలని, తీరు మార్చుకోకపోతే హెచ్ఆర్ఏలో కోత పెట్టాలని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రవర్తన మారకపోతే సస్పెన్షన్ వేటు వేయాలని తేల్చిచెప్పారు. తహసీల్ కార్యాలయాల ఉద్యోగులేకాకుండా.. వీఆర్ఓలకు కూడా ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆదేశించారు. అవినీతిని రూపుమాపాలంటే వీఆర్ఓలు కూడా స్థానికంగా ఉండాలని, వారికి కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించినందున.. వీఆర్ఓలు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని ఉత్తర్వులిచ్చారు. రాజధాని నుంచే రాకపోకలు రెవెన్యూ ఉద్యోగులు విధిగా హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని నిర్దేశిస్తూ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు వారం రోజుల క్రితం సర్క్యులర్ ఇచ్చారు. అయినప్పటికీ అధికశాతం ఉద్యోగులు ఇంకా హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు అంతర్గత పరిశీలనలో తేలింది. 37 మంది తహసీల్దార్లలో కేవలం నలుగురు మాత్రమే స్థానికంగా ఉంటున్నారని స్పష్టమైంది. అలాగే వివిధ తహసీళ్లలో పనిచేసే 111 జూనియర్ అసిసెంట్లు, 60 మంది ఆర్ఐ, సీనియర్ అసిసెంట్లు, 55 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 434 మంది వీఆర్ఓలు పనిచేసే చోట నివసించడం లేదని వె ల్లడైంది. ఆఖరికి ఆఫీస్ సబార్డినేట్లు కూడా మండల కేంద్రాల్లో ఉండడంలేదని తేలింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండని అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరోసారి స్థానికతను గుర్తు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా బుధవారం తహసీల్దార్లకు మరో సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించింది. వాస్తవానికి రాజధాని చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఉద్యోగులు పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలుచేయడం జిల్లాలో ఆచరణసాధ్యం కాదని ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. జిల్లాకే హెడ్క్వార్టర్లేనప్పుడు మమ్ముల్ని పనిచేసే కేంద్రంలోనే ఉండమనడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, విద్య, సంక్షేమశాఖలకు వర్తింపజేయని హెడ్‌క్వార్టర్ నిబంధనలు తమపై రుద్దడమేమిటనీ రెవెన్యూ వర్గాలు మండిపడుతున్నాయి. అన్ని శాఖలకు ఈ నియమావళి అమలు చేస్తే బాగుంటుంది తప్ప.. తమకే వర్తింపజేయడం సరికాదని, దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. -
మురికివాడల్లో పరిస్థితులు మెరుగుపడాలి
సదస్సులో వక్తల మనోగతం సాక్షి, సిటీబ్యూరో: నగరాల్లోని మురికి వాడల్లో పరిస్థితులను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మెట్రో పోలిస్ సదస్సులో భాగంగా బుధవారం ‘అర్బన్ పూర్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ’ అనే అంశంపై చర్చ జరిగింది. ఇందులో యూఎస్ఎఫ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మ్యాగీ కాజల్, నిదాన్ అండ్ నాస్వి వ్యవస్థాపకులు అర్బింద్ సింగ్, చింతన్ డెరైక్టర్ భారతి చతుర్వేది, ప్రముఖ ఆర్కిటెక్ట్ కీర్తిషా, ఏపీఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. పలువురు మాట్లాడుతూ మురికి వాడల్లో కాలుష్యం పెరిగిపోవడంతో అనారోగ్యకర వాతావరణం నెలకొంటుందని, వర్షం వస్తే ఆ కాలనీలు నీట మునిగిపోతున్నాయన్నారు. ఇళ్లు నిర్మించి ఇచ్చినంత మాత్రానో... మరో సదుపాయం కల్పించినంతమాత్రానో వారి పరిస్థితులు మారవన్నారు. సమాజంలో ఉండే మిగతా వారిలా పేదలకు కూడా తగిన సదుపాయాలను అందుబాటులో తేవాలని వక్తలు సూచించారు. ముఖ్యంగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, సాంఘిక న్యాయం, సమానత్వం కూడా ఉన్నప్పుడే మురికి వాడలు ఉండవన్నారు. ఎందరో పేదలు ఫుట్‌పాత్‌లపైనే జీవనాన్ని సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కత్తాలో 25 ఏళ్లగా ఫుట్‌పాత్‌లపైనే జీవితాలు వెళ్లదీస్తున్న మహిళలెందరో ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులు మారేందుకు ప్రభుత్వాలు, సంస్థలు తగిన కృషి చేయాల్సి ఉందని సూచించారు. పేదల కోసం అనేక కార్యక్రమాలు: కమిషనర్ హైదరాబాద్ నగరంలోని పేదల కోసం తాము వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. మురికి వాడల ప్రజలు క లుషిత జలాల వల్ల పలు వ్యాధుల బారిన పడుతుండటాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఇందుకోసం మంచి నీటిని అందించేందుకు 150 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్వారా 600 మందికి కూడా ఉపాధి అవకాశాలుంటాయన్నారు. అంతేగాక డ్రైవర్ కమ్ ఓనర్, ఈవ్యాన్, నైట్‌షెల్టర్లు, రూ.5లకే భోజనం వంటి కార్యక్రమాలను ఆయన వివరించారు.