breaking news
Premam trailer
-
కొన్ని.. మన చేతుల్లో ఉండవు: నాగ చైతన్య
-
కొన్ని.. మన చేతుల్లో ఉండవంటున్న చైతూ!
'ప్రేమకథలు ముగుస్తాయి. కానీ ఫీలింగ్స్ కాదు..' అంటూ మధురమైన ప్రేమకథ 'ప్రేమమ్'తో మన ముందుకొస్తున్నాడు చైతూ.. 'కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. దీన్ని(గుండెను) నమ్ముకుని ఫాలో అవుతూ వెళ్లిపోవడమే’ అంటూ 'ప్రేమమ్' ట్రైలర్‌ను ప్రేక్షకులు ముందుకు తెచ్చాడు నాగచైతన్య. బుధవారం ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ సరసన శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా కథానాయికలుగా నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. 2015లో మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్'కి రీమేక్‌గా అదే టైటిల్‌తో వస్తున్న సినిమాలో నాగాచైతన్య యాక్టింగ్ సరికొత్తగా ఉంటుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. 1.42 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. అందరికీ తెలిసిన ప్రేమకథను విభిన్నమైన స్క్రీన్ ప్లేతో అందించడం వల్ల 'ప్రేమమ్' మలయాళంలో ఘన విజయం సాధించింది. ఇదేరీతిలో నవ్యతతో కూడిన అభినయంతో ఆకట్టుకునేలా ట్రైలర్ ఉండటం, నాగచైతన్య నటనలో కొత్తదనం సినీ ప్రేమికులను అబ్బురపరుస్తోంది.