breaking news
Prathipati Sarath
-
ప్రత్తిపాటి దోపిడీ లో బయటపడ్డ సంచలన నిజాలు
-
ప్రత్తిపాటి శరత్ కు 14 రోజుల రిమాండ్
-
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఐదో రోజు శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు
-
ఐదో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితుల ఇళ్లు, కంపెనీ కార్యాలయాల్లో సోమవారం కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ ప్రత్యేక అధికారుల బృందం గత ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్ ఇళ్లల్లో, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ఇళ్లల్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా హవాలా రూపంలో నగదు పంపిణీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆదాయ పన్ను అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్లో ఆదాయపు పన్ను అధికారుల తనిఖీలు సోమవారం ముగిశాయి. -
ప్రత్తిపాటి కుమారుడు కంపెనీలో ఐటీ సోదాలు
-
ప్రత్తిపాటి శరత్ కంపెనీలో సోదాలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ/కడప: ఆదాయపన్ను శాఖ దాడులతో టీడీపీ నాయకుల అక్రమాల డొంక కదులుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం మొదలైన ఐటీ శాఖ సోదాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మరోవైపు మాదాపూర్‌లోని డీఎన్సీ ఇన్ఫ్రా కంపెనీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) ప్రకటించింది. తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి 69 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ మేరకు చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. డీఎన్సీ ఇన్ఫ్రా కంపెనీ యాజమాని నరేన్ చౌదరికి టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. నారా లోకేశ్ అనుచరుడు కిలారి రాజేశ్‌తో నరేన్ చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం. కిలారి రాజేశ్‌కు చెందిన రెండు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కిలారు రాజేష్ వ్యవహారంతో చంద్రబాబు, లోకేశ్ టెన్షన్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు కాగా, చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 9 మందితో కూడిన ఐటీ అధికారుల బృందం నిన్నటి నుంచి సోదాలు కొనసాగిస్తోంది. మరోవైపు సీఆర్పీఎఫ్ అదనపు సిబ్బంది ఈ ఉదయం శ్రీనివాసరావు నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశముందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. జాడ లేని శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) హైదరాబాద్ కార్యాలయంలో ఐటీ సోదారులు ఈ ఉదయం ముగిశాయి. పలు కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న శ్రీనివాసులరెడ్డి నివాసంలో దాదాపు 30 గంటల పాటు సాగిన సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఐటీ అధికారులు వెళ్లిపోయారు. శ్రీనివాసులరెడ్డి ఎక్కడ ఉన్నారనేది తెలియరాలేదు. వరుస ఐటీ దాడులతో టీడీపీ ముఖ్య నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ అక్రమాలు బయటపడతాయన్న భయంతో టీడీపీ నేతలు వణుకుతున్నారు. (చదవండి: చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు)