pongal celebrations
-
గరం టీమ్ సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival Celebrations 2022 : సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival 2022 Celebrations: ఊరంతా సంక్రాంతి
-
Sankranti 2022: సంక్రాంతి శోభ
-
Sakshi TV Exclusive :సంక్రాంతి సందడంతా సాక్షిలోనే
-
పండుగ అందరిదీ కావాలి
ఒకరూ ఇద్దరూ కాదు... ఎటుచూసినా బాధాసర్పదష్టులే కనిపిస్తున్నప్పుడు, జీవితంపై ఒక రకమైన అనిశ్చితి అలుముకున్నప్పుడు, చుట్టూ చీకట్లు ఆవరించినప్పుడు సమష్టిలో సేద తీరాలనుకోవటం మనిషి లక్షణం. అందుకు పండుగను మించిన శుభ సందర్భం మరేముంటుంది? అందునా సంక్రాంతి తెలుగింట పెద్ద పండుగ. పట్టణమంతా పల్లెకు తరలే సందర్భం. సరిగ్గా పంటలు చేతికందే సమయం కనుక ఇతర పండుగల కన్నా ఎప్పుడూ ఇది రెట్టింపు కాంతులీనుతుంది. పల్లె పల్లెనా పంటల పరిమళాలు, ప్రతి ముంగిటా రంగవల్లుల సొబగులు, వాటిల్లో గొబ్బెమ్మలు, తెల్లార కుండా రంగురంగుల వస్త్రధారణతో ముస్తాబై సూర్యుడితోపాటే అందరినీ పలకరించటానికొచ్చే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు అందరినీ సమ్మోహనపరుస్తాయి. ఇంట్లో అమ్మ చేసే పిండివంటలు, నాన్న కొనిపెట్టిన కొత్త బట్టలు, దూరప్రాంతాలనుంచి తరలివచ్చే బంధుగణం పిల్లలకు ప్రీతిపాత్రమైతే...ఈ పెద్ద పండుగనాడు రకరకాల దానాలతో తరించాలని పెద్దలు భావి స్తుంటారు. మకరరాశిలో వుండే శ్రవణ నక్షత్రానికి శని అధిపతి గనుక అతణ్ణి శాంతింపజేయడానికి నువ్వులు దానమిస్తారు. ధనుర్మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి క్రమేపీ ఉత్తరాభిముఖుడై కదులుతూ కర్కాటక రాశికి చేరతాడు. ఈ ఆరునెలలకాలాన్ని ఉత్తరాయణమంటారు. ఈ ఆర్నెల్లూ దేవతలకు పగలు కనుక ఆ సమయంలో వారు మేల్కొనివుండి కోర్కెలు నెరవేరుస్తారన్న విశ్వాసం సనాతన సంప్రదాయం పాటించేవారికుంటుంది. అందుకే దీన్ని దేవయానం అని, పుణ్యకాలమని కూడా అంటారు. భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్య ఘడియల కోసమే అంపశయ్యపై వేచి చూశాడు. దక్షిణాయనం పితృదేవతలు సంచరించే కాలం. ఇది నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ నింపు తుందని... సంక్రాంతితో ఈ పితృయానం ముగిసి వారు తమ తమ స్థానాలకు వెళ్తారని భావిస్తారు. అందుకే వారినుద్దేశించి కృతజ్ఞతాపూర్వక తర్పణాలు వదులుతారు. అందుకే ఇది ‘పెద్దల పండుగ’ కూడా. సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణంలో సూర్యుడు తేజోమయమూర్తిగా రూపుదిద్దుకోవ టంతో ప్రకృతి ఉత్సాహం, ఉల్లాసం నింపుకుంటుందంటారు. తమ సంపదకూ, సుఖసంతోషాలకూ కారణమైన భూమికి, తోటి రైతులకూ, పాలేర్లకూ, కూలీలకూ, పశుపక్ష్యాదులకూ రైతులు కృతజ్ఞ తలు చెప్పుకునేదీ ఈ సంక్రాంతినాడే. ఇంకా నింగితో సయ్యాటలాడే గాలిపటాల సందడి, కోడి పందేలు, ఎడ్ల పరుగుల పోటీ, గొర్రెపొటేళ్ల పోటీలు... అన్నిటికీ సంక్రాంతే సందర్భం. ఇతర పండగ లన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకుంటే, సంక్రాంతిని సూర్యగమనం ఆధారంగా జరుపుకోవటం మరో విశిష్టత. మానవాళికి స్థిర వ్యవసాయం అలవాటైన కాలం నుంచే సూర్యుణ్ణి ఆరాధించే సంప్రదాయం అన్నిచోట్లా అలవడింది. ఇది ఇప్పటి అర్థంలో ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితమైనది కాదు... భూగోళం నలుచెరగులా విస్తరించిన అఖండ విశ్వాసమే. సూర్యుణ్ణి జగత్సాక్షిగా, కర్మసాక్షిగా భావిం చటం అన్నిచోట్లా మనిషికి పరంపరగా వస్తున్న సంప్రదాయం. ఈ జగత్తుకంతటికీ ఆదిత్యుడే మూల కారకుడని ఆదిత్యహృదయం అంటుంది. భూమ్మీద వుండే సమస్త జీవజాలం, భూ లోపలి పొరల్లో లభ్యమయ్యే రకరకాల ఖనిజాలు, ఇంధనాలు... అన్నీ సూర్యుడులో సంభవించే వివిధ మార్పుల పర్యవసానంగా ఏర్పడినవే. సూర్యుడి గమనంలో ఏర్పడే మార్పులు వేడిమిని, శీతగాలుల్ని, వర్షపా తాన్ని నిర్ణయిస్తాయి. అందువల్లే పర్షియన్లు, గ్రీకులు, యూరొపియన్లు, ఈజిప్షియన్లు, మెక్సికన్లు కూడా సూర్యారాధన చేసేవారు. వారూ తొలి పంటను సూర్యుడికి నివేదించేవారు. అన్ని ఖండాల్లోని ప్రాచీన సమాజాల్లోనూ ఇప్పుడు మనం జరుపుకునే సంక్రాంతి తరహాలోనే రకరకాల వేడుకలతో పండగ జరిపేవారు. గాలి పటాలను ఎగరేయటమూ ఇంతే. సూర్యుడి సుముఖానికి వెళ్లి ప్రణమి ల్లడానికి ఇదొక ప్రతీక. ఇవన్నీ మానవాళిలో వుండే విశ్వాసాల అఖండతనూ, వారి మధ్య సాంస్కృ తిక సారూప్యతనూ వెల్లడిస్తాయి. ఉగ్రరూపంతో విరుచుకుపడిన కరోనా మహమ్మారితో భూగోళమంతా ఏడాదికాలంగా తలపడుతోంది. ఈ పోరు ముగిసిట్టేనా లేక ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదముందా అనేది తేల డానికింకా సమయం పడుతుంది. ఉన్న కొలువులు పోయినవారూ, కొలువులున్నా వేతనాల కోతతో విలవిల్లాడేవారూ, తమ బంధువులో, మిత్రులో కరోనా కాటుతో కనుమరుగయ్యారన్న వేదనతో విషాదంలో మునిగినవారూ, వ్యాపారాలు సజావుగా నడవని వారూ, అనుకున్నవన్నీ తలకిందు లయ్యాయని బాధపడేవారూ... ఇలా ఎటుచూసినా ఈ కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యమైనా, పడుతూ లేస్తూ సాగే బడుగు దేశమైనా కాస్త హెచ్చుతగ్గులతో ప్రపంచ పౌరుల బాధలన్నీ ఒక్కటే. ప్రకృతి పగబట్టి కరువు విలయతాండవం చేయటమో, అకాలవర్షాలు ముంచెత్తి పంట నష్టానికి దారితీయడమో రివాజుగా సాగుతోంది. దానికితోడు ప్రభు త్వాల విధానాలతో విత్తనాలు మొదలుకొని పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ ఆకాశాన్నంటి వ్యవసాయం భారమవుతోంది. ఇవన్నీ రైతులను అప్పుల ఊబిలోకి దించుతున్నాయి. కొత్తగా వచ్చిన సాగు చట్టాల వల్ల తమకు మరింత ముప్పు ముంచుకురాబోతున్నదని శంకించిన వేలాది మంది రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో రెండు నెలలుగా బైఠాయించారు. ఆ చట్టాల రద్దు తప్ప తమకేదీ సమ్మతం కాదంటున్నారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా చూస్తే ఒక విధమైన నిరాశానిస్పృ హలే వ్యాపించాయి. బతుకుబండి మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందోనన్న ఆందోళన అందరిలోనూ వుంది. ఇలాంటి సమయంలో ఒక పలకరింపు, ఒక ఓదార్పు సాంత్వననిస్తాయి. అందరిలోనూ మనం ఒంటరికామన్న భరోసానిస్తాయి. సంక్రాంతి వంటి పెద్ద పండుగ ఇందుకొక సందర్భం కావాలని, అందరిలోనూ కొత్త ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ నింపాలని మనసారా కోరుకుందాం. -
పశువును కనుము
సంక్రాంతి మూడవరోజును ‘కనుము’గా నిర్థారించారు మన పెద్దలు. ‘కనుము’ నేరుగా పండుగ కాదని పండుగను అనుసరించి వచ్చే పండుగ రోజు అని చెబుతారు. ‘కనుము’ అంటే ‘జాగ్రత్తగా చూడు’ అని అర్థం. అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన రోజులు అనే అర్థం కూడా వస్తుంది. ‘కనుము’ వ్యావహారికంలో ‘కనుమ’ అయ్యింది. కనుము అనే మాటకి పశువు అనే అర్థం కూడా చెబుతారు. అందుకని దీనిని పశువుల పండుగగా జరపడమనేది తెలుగు ప్రాంతంతో పాటు తమిళనాట ఉంది. పాడిపంటలలో తోడ్పడే పశువులను ‘చూడండి’, సత్కరించండి అనే అర్థం ‘కనుము’లో ఉంది. సూర్యుడు దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి తొంగి చూశాడు కనుక ‘కనుము’ అయ్యిందని కూడా అంటారు. సంక్రాంతి ఉత్తరాయణానికి మొదటి రోజు. ఉత్తరాయణం – దేవతలకు ప్రీతికరమైన కాలం. ఒకవైపు ఇలా పుణ్యకాలం కావడం మరో వైపు పంటలు వచ్చే సమయం కాబట్టి ఈ సంబరమంతా ఒకరోజులో ముగిసేది కాదు కనుక ‘కనుము’ ఒక కొనసాగింపు పండగరోజు అయ్యింది. ఇంటికి వచ్చిన బంధుమిత్రులెవరూ కదలకుండా ఉండాలనే ఉద్దేశంతో ‘కనుము పండుగ నాడు కాకులు కూడా కదలవని’ శాస్త్రం పెట్టారు. పశువులను పూజించాలి: ‘గవామంగేషుతిష్ఠంతి భువనాని చతుర్దశ’.... అంటే ముక్కోటి దేవతలు, 14 లోకాలు గోవుల శరీరంలో ఉంటాయని శాస్త్రం చెబుతోంది. గో శబ్దానికి ఎద్దులు అనే అర్థం కూడా ఉంది. అనేక పూజలు పురస్కారాలకు పశువులను ఆదిమానవుడి దగ్గర నుంచి ఉపయోగిస్తూనే ఉన్నాం. ఎద్దులతో వ్యవసాయం చేసి ఆహారం పొందగలుగుతున్నాం. అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో పశువుల్ని కూడా భక్తిగా కొలుచుకోవడం ఆచారంగా వస్తోంది. పూర్వకాలంలో ప్రభువులు పశువులను కడిగి, కొమ్ములకు అలంకరించి, అలంకరణ (బంగారు డిప్పలు) కాళ్ల గిట్టలకు వెండి తొడుగులు మెడలో వెండి మువ్వలు వేసినట్లు కావ్యాలు చెబుతున్నాయి. పట్టు వస్త్రాలు కప్పడం, పసుపుకుంకుమలతో పూజించడం, కొత్త ఎడ్లకు గడ్డి వేసి, ఆహార పదార్థాలు ఇవ్వడం, ఆ రోజు హుషారుగా పరుగులు తీసేలా చూస్తూ పశువులకు కూడా పండుగ చేస్తారు. సంక్రాంతికి పంటలు చేతికి వస్తాయి. ఇళ్లన్నీ సిరిసంపదలతో తులతూగుతూంటాయి. ఇంత సంపన్నులు కావడానికి మూలమైన వారిని జాగ్రత్తగా చూసుకోమని అంటే వారి కోసం పండగ చేయాలి అనే అర్థంలో కనుము పండుగ ఏర్పడింది. రైతన్నకి పశువులంటే పంచప్రాణాలు. అందుకే కనుమునాడు పశువుల్ని అలంకరిస్తారు. కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని పశువులకే నివేదన చేస్తారు రైతులు. అంటే పశువుల ద్వారా లభించిన ధాన్యాన్ని, ఆ పశువులకే తొలి నైవేద్యంగా పెట్టి, పశువుల పట్ల కృతజ్ఞతను తెలియచేసుకుంటారు రైతులు. అలాగే కనుమ నాడు కాకులకు ఆహారం తప్పనిసరిగా పెట్టడం ఆచారంగా వస్తోంది. పక్షులకు సైతం...: కనుమును తమిళులు మాట్టు పొంగలి అంటారు. మాట్టు అంటే పశువు. అందుకే కనుము అంటే పశువులకి చేసే ముఖ్యమైన పండుగగా భావిస్తారు. రైతులకు పక్షులతో కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే సంక్రాంతి సమయంలో ఇంటి చూరుకు లేదా గుమ్మాలకు వరిధాన్యం కంకులు వేలాడదీస్తారు. కనుము నాడు గోపూజ చేయడంతో పాటు, గోకల్యాణం కూడా చేస్తారు. పూర్వం ఈ పండుగనాడు పశువులకు ప్రత్యేకమైన ఆహారం తయారుచేసి తినిపించేవారు. ఇందుకోసం... ప్రతి ఇంటివారు తెల్లవారుజామునే కత్తి, సంచి తీసుకుని దగ్గరలో ఉన్న అడవికి వెళ్లేవారు. మద్దిమాను, నేరేడు మాను చెక్క, మోదుగపూలు, నల్లేరు, మారేడు... వంటి కొన్ని మూలికలను సేకరించి, చిన్నచిన్న ముక్కలుగా చేసి, పెద్ద మొత్తంలో ఉప్పు జత చేసి, రోట్లో వేసి దంచేవారు. ఆ పొడిని ఉప్పు చెక్క అంటారు. దీనిని పశువులకు తినిపించాలి. వాస్తవానికి ఈ చెక్క పొడిని తినడానికి పశువులు ఇష్టపడవు. అతి కష్టంతో ఒక్కొక్క దాని నోటిని తెరిచి చారెడేసి ఉప్పు చెక్కను నోట్లో పోసి మూస్తారు. ఇలా రెండు మూడు దోసెళ్లు పోస్తారు. ఏడాదికోసారి ఉప్పుచెక్కను తినిపిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని వీరి నమ్మకం. ఉప్పు చెక్క తినిపించాక, వీటికి పరిశుభ్రంగా స్నానం చేయిస్తారు. కొమ్ములను అందంగా చెక్కి, రంగులు పూస్తారు. కోడెదూడల కొమ్ములకు తొడుగులు తొడిగి, మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. ఈ సమయంలో చేలన్నీ పంటలు కోసి ఖాళీగా ఉండటంతో, వీటిని పొలాల్లోకి వదిలేస్తారు. పశువులన్నీ స్వేచ్ఛగా పొలాలలో పరుగులు తీసి పరవశించడం కనులారే చూసే పండుగే కనుము. -
సంక్రాంతి సంబరాలు @ ఘట్కేసర్
-
అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు
సాక్షి, ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, ఆశీర్వచన మండపంలో బొమ్మల కొలువు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల సందడి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది తొలిసారిగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రులు
-
తెలుగు రాష్ట్రాల్లో వెల్లి విరుస్తున్న పండుగ శోభ
-
ఫ్యాక్షన్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు
-
పండగ సంబరాల్లో.. ఎమ్మెల్యే డాన్సులు
పెద్ద పండగ అంటే చాలు.. కోనసీమలో సంబరాలు మిన్నంటుతాయి. ఆ సంబరాలకు చిన్నా పెద్దా తేడా ఉండదు. అందుకే ఓ ఎమ్మెల్యే గారు చిందేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి... పండుగ సందర్భంగా నిర్వహించిన రికార్డింగు డ్యాన్సులో డాన్సర్లతో కలిసి బ్రహ్మాండంగా స్టెప్పులేశారు. 'నీ ఇల్లు బంగారం కాను.. నా ఒళ్లు సింగారం కాను' అనే పాటకు డాన్సులు చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులలో ఆయన కూడా పాల్గొని అక్కడున్న అమ్మాయిలతో చేతులు కలిపి డాన్సులు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమలో యథేచ్ఛగా కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డాన్సులు జరిగాయి. సాధారణంగా రాత్రిపూట నిర్వహించే రికార్డింగ్ డ్యాన్సులు ఈసారి అధికార పార్టీ నేతల అండదండలతో పగలే మొదలు పెట్టేశారు. వాడ్రేవుపల్లి. మగటనల్లి, కేశనపల్లి, శంకరగుప్తంలలో అశ్లీల నృత్యాలు చోటుచేసుకున్నాయి. వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పాల్గొన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారు విస్తుపోయారు. -
కోనసీమలో జోరుగా అశ్లీల నృత్యాలు
ఎప్పుడూ పచ్చదనంతో కళకళ్లాడే కోనసీమ అశ్లీల నృత్యాల అడ్డాగా మారిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మగటపల్లి, కేశనపల్లి, శంకరగుప్తంలలో యథేచ్ఛగా రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలావుంటే ఇక రాష్ట్ర పరిస్థితేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కొంత మంది రాజకీయ నాయకులకు తెలిసి జరుగుతున్న వ్యవహారాలేననేది ఇక్కడ బహిరంగ రహస్యమే. అశ్లీల నృత్యాలు పతాక స్థాయికి చేరినప్పటికీ పోలీసులు తమకు పట్టనట్టు వ్యవహరించడం కొసమెరుపు. -
ప్రారంభమైన ప్రభలతీర్థం
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం పప్పులవారిపాలెం గ్రామంలోని డ్యాం సెంటర్ వద్ద ఘనంగా ప్రభలతీర్థం ప్రారంభమైంది. తరలి వస్తున్న ప్రభలను చూడడానికి ప్రజలు పోటెత్తుతున్నారు. ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కోనసీమలోని జగ్గన్నతోట తదితర ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఎక్కడెక్కడో స్థిరపడినవాళ్లంతా కూడా ఈ పండుగ కోసం వస్తుంటారు.