breaking news
pod hotel
-
భారత్‌లో జపాన్ ‘స్లీపింగ్ పాడ్స్’.. క్యూ కడుతున్న జనం
గత కొన్నేళ్లుగా భారతదేశంలోని పర్యాటకుల అభిరుచులు మారుతున్నాయి. తక్కువ బడ్జెట్లో విలాసవంతమైన, సురక్షితమైన బస కోసం వెతికే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇటువంటి వారికి ‘క్యాప్సూల్ హోటల్స్’, ‘స్లీపింగ్ పాడ్స్’ సరికొత్త చిరునామాగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలో స్లీపింగ్ పాడ్స్ విస్తృతి, వాటి ధరలు, ప్రత్యేకతలపై సమగ్ర కథనం..నగరాల్లో క్యాప్సూల్ హోటల్స్జపాన్లో పుట్టిన ఈ ‘క్యాప్సూల్’,‘పాడ్’ హోటల్ సంస్కృతి ఇప్పుడు దేశంలోని మెట్రో నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా సోలో ట్రావెలర్స్ (ఒంటరి ప్రయాణికులు), ఐటీ ఉద్యోగులు, బిజినెస్ పర్యటనలకు వచ్చే వారు వీటిపై అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ స్థలంలో అధిక సౌకర్యాలను అందించే ఈ టెక్నాలజీ, భారతీయ పర్యాటక రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతోంది.ముంబై రైల్వే స్టేషన్లో తొలి ప్రయోగంభారతదేశంలో ఈ తరహా ఆధునిక బస సౌకర్యం తొలుత ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రారంభమైంది. భారతీయ రైల్వే (ఐఆర్సీటీసీ) సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పాడ్ హోటల్ ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ పొందింది. రైలు ప్రయాణికులు గంటల తరబడి వెయిటింగ్ రూముల్లో వేచి ఉండనవసరం లేకుండా, తక్కువ ధరలోనే ఏసీ సౌకర్యంతో కూడిన ఈ చిన్న గదులలో విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కలిగింది.కొచ్చిలో ఫ్యూచరిస్టిక్ ‘కొచ్చి పాడ్స్’కేరళలోని కొచ్చి నగరంలో ఎర్నాకులం సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో ‘కొచ్చి పాడ్స్’ ప్రారంభమయ్యాయి. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్, అంతరిక్ష నౌకను తలపించేలా రూపొందించారు. షానాజ్ సలావుద్దీన్ అనే పారిశ్రామికవేత్త నేతృత్వంలో తిరువనంతపురం తర్వాత కొచ్చిలో ఈ సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి.దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి?ప్రస్తుతం భారతదేశంలో ముంబై, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చి తదితర నగరాల్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు, బిజీగా ఉండే రైల్వే స్టేషన్ల పరిసరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో కూడా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.పాడ్ హోటల్స్‌లో ప్రత్యేక సౌకర్యాలుఈ స్లీపింగ్ పాడ్స్ చిన్నవిగా కనిపించినా, ఇందులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. వైఫై, క్లైమేట్ కంట్రోల్ (ఏసీ), రీడింగ్ లైట్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్, పవర్ సాకెట్లు, చిన్న వానిటీ మిర్రర్ మొదలైనవి ప్రతి పాడ్‌లోనూ ఉంటాయి. భద్రత కోసం కార్డ్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది. అలాగే లగేజీ కోసం ప్రత్యేకంగా లాకర్లు, వాష్ రూమ్స్ కామన్‌గా అందుబాటులో ఉంటాయి.గోప్యత, భద్రతకు పెద్దపీటఈ హోటళ్లలో ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. పురుషులు, మహిళలు, ఫ్యామిలీల కోసం వేర్వేరు ఫ్లోర్లను కేటాయిస్తున్నారు. ఇది సోలో మహిళా ప్రయాణికులకు సురక్షితమైన అనుభూతిని అందిస్తుంది. హోటల్ మొత్తం సీసీటీవీ సర్వైలెన్స్‌లో ఉండటం ఎంతో భద్రతను కల్పిస్తుంది.సామాన్యులకు అందుబాటులో..సాధారణంగా హోటళ్లలో ఒక రోజుకు చెల్లించే రూ. 2,000 నుండి రూ. 5,000 ఖర్చుతో పోలిస్తే, పాడ్ హోటల్స్ చాలా చౌక అని చెప్పుకోవచ్చు. కొచ్చి పాడ్స్ లాంటి చోట్ల నాలుగు గంటల బసకు కేవలం రూ. 499 నుండే ధరలు ప్రారంభమవుతున్నాయి. 12 గంటలు లేదా 24 గంటల ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ‘పే యాజ్ యూ స్టే’ (ఉన్నంత సమయానికే చెల్లించండి) అనే విధానం ప్రయాణికులకు ఆర్థికంగా కలిసొచ్చే అంశంగా మారింది.పర్యాటక రంగంలో సరికొత్త మలుపుమారిన కాలానికి అనుగుణంగా ప్రయాణికులు సౌలభ్యాన్ని, టెక్నాలజీని కోరుకుంటున్నారు. భారీ హోటల్ బిల్లులు కట్టలేని వారికి, కేవలం కొద్దిసేపు ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వారికి ఈ జపనీస్ స్టైల్ స్లీపింగ్ పాడ్స్ ఒక వరంలా పరిణమించాయి. తక్కువ ఖర్చుతో కూడిన ఈ డిజిటల్ బస సౌకర్యం భవిష్యత్తులో దేశంలోని నగరాలన్నింటికీ విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: పిల్లల పొట్టకొట్టి.. రూ. 2,000 కోట్లు మూటగట్టి.. -
ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే
పని మీద ఊరుకానీ ఊరు వెళ్తే.. ఉండటానికి చోటు ఒక సమస్యగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో లాడ్జిల్లో ఉందామంటే కంఫర్ట్‌గా ఉండకపోవచ్చు. పోనీ మంచి సౌకర్యాలున్న హోటల్లో దిగాలంటే.. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యను తీర్చేందుకు నెలకొల్పిన కాన్సెప్ట్ ‘క్యాప్సుల్ హోటల్’. జపాన్‌లో చాలా ఏళ్ల క్రితమే మొదలైన ఈ ట్రెండ్.. వయా సింగపూర్, ఇండియా మీదుగా యూరప్‌ని చేరింది. ఇప్పుడు బ్యూటీసిటీ మిలాన్‌లో క్యాప్సుల్ హోటల్స్‌దే హవా నడుస్తోంది. ఇంతకీ ఈ ఇస్మార్ట్ హోటల్ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఎందుకు వాటికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు..? (చదవండి: జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్‌లో..!) క్యాప్సుల్ హోటల్స్.. సింపుల్‌గా చెప్పాలంటే చిన్నసైజులో ఉండే బెడ్రూమ్స్తో కూడిన కాంప్లెక్స్‌లివి. ఒక చిన్న ఛాంబర్లో మినిమమ్ ఫెసిలిటీస్‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. హోటల్స్‌తో పోలిస్తే రేటు చాలా తక్కువ. రాత్రిళ్లు పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పైగా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే పనుల మీద వేరే ఊర్లకు వెళ్లేవాళ్లు, టూరిస్టులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వెస్ట్రన్ వరల్డ్‌లో వీటినే ‘పాడ్ హోటల్స్’ అంటారు. సాధారణంగా ఈ తరహా హోటల్స్ ఎయిర్పోర్ట్ దగ్గర్లో కనిపిస్తుంటాయి. అక్కడ వాటిని ‘స్లీప్‌బాక్స్’ పేరుతో పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోనూ క్యాప్సుల్ హోటల్స్ బిజినెస్ పెరుగుతోంది. కమర్షియల్‌గా మార్చేశారు జపాన్ ఉమెడ జిల్లా ఒసాకాలో తొలి క్యాప్సుల్ హోటల్ని 1979లో ఏర్పాటు చేశారు. జపనీస్ ఫేమస్ ఆర్టిటెక్ట్ కీషో కురోకావా ఆ హోటల్ని డిజైన్ చేయడం విశేషం. ఆ తర్వాత టోక్యోలో మరో మూడు బ్రాంచ్‌లు ఏర్పాటయ్యాయి. నిజానికి వీటిని ఏర్పాటు చేయడం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోడ్‌సైడ్ జీవితాల్ని గడిపేవాళ్ల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చలికాలంలో రాత్రిళ్లు ఉండేందుకు తక్కువ ఖర్చుతో వాళ్లకు క్యాప్సుల్ హోటల్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, రాను రాను ఇదొక బిజినెస్‌గా మారింది. మూడేళ్లలోనే జపాన్ మొత్తం మీద నలభైకి పైగా క్యాప్సుల్ హోటల్స్ వెలిశాయి. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం విస్తరించాయి. సకల సౌకర్యాలు క్యాప్సుల్ హోటల్ ఛాంబర్లు చూడటానికి స్లీపర్ కోచ్ బస్సుల్లా ఉంటాయి. ఒక ఛాంబర్‌కి మరో ఛాంబర్ ఆనుకుని ఉంటుంది. ప్లాస్టిక్ టబ్ లాంటి నిర్మాణానికి అద్దాల సెటప్‌తో డోర్, దానికొక కర్టెన్ ఉంటుంది. లోపలికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. లోపల చిన్న బెడ్, లైట్, పవర్ ప్లగ్, వై–ఫై ఫెసిలిటీ ఉంటాయి. కొన్నిసార్లు టీవీ, ల్యాప్‌ట్యాప్‌ని ఇస్తారు. న్యూస్ పేపర్, రీడింగ్ మెటీరియల్స్ అందిస్తారు. జస్ట్ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే సరిపోతాయివి. క్యాప్సుల్ హోటల్స్ ఆడ, మగకి విడివిడిగా ఉండొచ్చు. లేదంటే కపుల్ స్పెషల్‌గా ఉంటాయి. ఛాంబర్ కాంప్లెక్స్ బయట సామాన్లు భద్రపరుచుకోవడానికి ఒక లాకర్ ఉంటుంది. క్యాప్సుల్‌లో తినడానికి, సిగరెట్ తాగడానికి వీల్లేదు. అయితే బాత్రూమ్లు మాత్రం బయట కామన్‌గా ఉంటాయి. కొన్నింటిలో రెస్టారెంట్, షవర్స్, స్నాక్ బార్స్, పూల్స్.. ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ సెపరేట్‌గా ఉంటాయి. కాకపోతే వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే క్లాస్ట్రోఫోబియా(ఇరుకుప్రదేశాలంటే భయం) ఉన్నవాళ్లు క్యాప్సుల్ హోటల్‌కి దూరంగా ఉండటమే బెటర్. మైనస్లున్నాయ్ ఒకరకంగా చెప్పాలంటే ఇది తొమ్మిది గంటల హోటల్. అంటే రాత్రి పూట పడుకోవడానికి, పగటిపూట విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలా సెట్ చేశారు. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సిందే(చెక్ అవుట్). మళ్లీ కంటిన్యూ కావాలంటే మళ్లీ రిజిస్ట్రర్‌లో రికార్డు చేసుకోవాలి. అంతేకాదు పాడ్ హోటల్ కావడంతో ఛాంబర్లో రీసౌండ్ మాత్రం బాగా వస్తది. దీంతో మిగతా ఛాంబర్లకు ఆ సౌండ్ వినిపిస్తుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినా త్వరగా రియాక్ట్ కావడానికి ఛాన్స్ కూడా ఉండదు. మరోవైపు వీటిని ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని మరిచిపోయి.. కమర్షియల్ పర్పస్‌గా మార్చేశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పైగా ఛాంబర్స్‌ని మరీ కుదించి ‘మార్చురీ’ టైప్‌లో డిజైన్స్ చేస్తున్నారని జపాన్ ఆర్టిటెక్ అసోషియేషన్ ఒక వాదనను వినిపించింది. ఇవన్నీ పక్కనపెడితే.. కంఫర్ట్ కోసం వెతుక్కునే వాళ్లకు అన్నివిధాల చీప్ అండ్ బెస్ట్ ఈ క్యాప్సుల్ హోటల్స్. మన దగ్గర కూడా.. జపాన్ నుంచి మొదలైన ఈ హోటల్ ట్రెండ్.. చైనా, ఇండోనేసియా, ఇండియా, హాంకాంగ్, బెల్జియం, పోలాండ్స్కి విస్తరించాయి. యూరోప్‌లో అక్కడక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరల్లో క్యాప్సూల్స్ హోటల్స్ కనిపిస్తాయి. మన దేశంలోనూ క్యాప్సుల్ హోటల్ని ‘అర్బన్ పాడ్’ పేరుతో ముంబైలోని అంధేరీ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఒక హోటల్లో ఉండే బెనిఫిట్సే ఇందులోనూ అందుతాయి. పైగా రేటు కూడా రీజనబుల్. దీంతో ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా టూరిస్టుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పందనతో దేశంలో మరిన్ని చోట్ల క్యాప్సుల్ హోటల్స్‌ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!
న్యూఢిల్లీ: రైలు ఎక్కేందుకు ట్రాఫిక్ కారణంగా కాస్త ముందుగా వెళ్లాలనుకునే ప్రయాణికులు అక్కడ స్టేషన్లో విశ్రాంతి రూం సరిగా ఉండక ఎక్కడ బస చేయాలో తోచక ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం ముంబై రైల్వే శాఖ సరికొత్త పాడ్ రూంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంది హోటల్‌కి వెళ్లి రూం అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి వారి కోసం ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని మొదటి అంతస్తులో 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూంను అందుబాటులోకి తీసుకువచ్చింది. (చదవండి: అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ) అయితే వీటిలో క్లాసిక్ పాడ్లు, ప్రైవేట్ పాడ్లు "లేడీస్-ఓన్లీ" పాడ్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పాడ్లు వంటి గదులు ఉన్నాయి. దీన్ని క్యాప్సూల్ హోటల్‌గా పిలిచే ఈ పాడ్ హోటల్లో ఒక్కో మంచంతో కూడిన చిన్న గదులు ఉంటాయి. ఈ మోడల్ జపాన్‌లో ఉద్భవించింది. ఇది కేవలం రాత్రి బస చేయడానికి లేదా చిన్న వ్యాపార పర్యటనలో అలసటతో నిద్రపోవడానికి బయట హోటల్‌కి వెళ్లడానికి విముఖత చూపే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ కాంపాక్ట్ వసతి పరిష్కారాన్ని అందించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూలో "స్నీక్ పీక్" అనే పేరుతో ఈ అత్యధునిక సరికొత్త విశ్రాంతి పాడ్ రూంలకు స్వాగతం అంటూ వాటికి సంబంధించిన వీడియోను ఒకటి సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. (చదవండి: బాప్రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!!) Koo App Sneak Peek! Welcome to the new-age Pod retiring rooms by @RailMinIndia at Mumbai Central. View attached media content - Ashwini Vaishnaw (@ashwinivaishnaw) 17 Nov 2021 -
భారత్‌లో తొలి పాడ్ హోటల్ ఇదే!
ముంబై: అంతరిక్ష సినిమాలు ప్యాసెంజర్, ఇంటర్స్టెల్లార్ చూసిన వాళ్లకు పాడ్స్ (పడక గదులు) ఎంత చిన్నగా, చూడముచ్చటగా ఉంటాయో తెల్సిందే. ఒక్కసారైనా అలాంటి పడక గదుల్లో నిద్రించి కలల ప్రపంచంలో తేలిపోవాలనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లకే కాదు, అవసరానికి ఖరీదైనా హోటల్ గదుల్లో బసచేసే స్థోమత అంతగా లేనివారు కూడా అలాండి పాడ్స్‌లో పడుకునేందుకు భారత్‌లో వీలవుతుంది.. దేశంలోనే మొట్టమొదటి పాడ్స్ హోటల్ ముంబైలో కొలువుతీరింది. అసలే స్థలాభావం ఎక్కువగా ఉండే ముంబైలో, అందులోనూ అత్యంత ఖరీదైన అంధేరి ప్రాంతంలో బస్ డిపో పక్కన 140 పాడ్స్ హోటల్‌ను నిర్మించారు. శలాబ్ మిట్టల్, హిరేన్ గాంధీ పారిశ్రామిక వేత్తలు కలసి అర్బన్ పాడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈ హోటల్‌ను నిర్మించారు. ఇందులో 50 నుంచి 90 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పడక గదుల్లో శాటిలైట్ టెలివిజన్, ఉచిత వైఫై, విలువైన వస్తువులను దాచుకునేందుకు పర్సనల్ లాకర్, పడుకునేందుకు, చదువుకునేందుకు అడ్జస్టబుల్ లైట్లు, ప్రైవసీ కోసం డోర్ లాక్ సిస్టమ్‌లు ఉన్నాయి. అనుబంధంగా బాత్రూమ్లు, 60 సీట్ల కామన్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ముంబై లాంటి ఖరీదైన నగరంలో ఇన్ని సౌకర్యాలున్న గదులను రోజుకు రెండు వేల నుంచి రెండున్నర వేల రూపాయలకు ఇస్తున్నారు. బుధవారమే ప్రారంభమైన ఈ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ ఉచితం. ప్రపంచంలోనే తొలి పాడ్స్ హోటల్ జపాన్‌లోని ఒసాకా నగరంలో 1979లో ఏర్పాటైంది. అక్కడ క్యాప్సుల్స్ అని పిలిచే ఈ హోటల్ గదులను కిషో కురోకవా అనే ఆర్టిటెక్ట్ డిజైన్ చేశారు. ఇప్పడు ఇలాంటి పాడ్స్ హోటళ్లు రష్యా, అమెరికా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, సింగపూర్, మలేషియా నగరాలకు విస్తరించాయి. భారత్‌లో మాత్రం ఇదే తొలి పాడ్స్ హోటల్. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలాంటి హోటళ్లకు అనువైనవి. తక్కువ ఖర్చుతో ఖరీదైన సౌకర్యం పొందాలనుకున్నవారికి, ఒంటరిగా ప్రయాణించే వారికి ఓ పాడ్స్ హోటళ్లు ఎంతో సౌకర్యవంతమైనవి.


