breaking news
petroleum engineering career
-
హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు
తిరువనంతపురం: రైతు బిడ్డ రైతే అవుతాడు.. రాజు బిడ్డ రాజు అవుతాడు.. ఇది జమానా మాట. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా డైలాగ్ ప్రకారం విజయం ఎవడబ్బ సొత్తు కాదు. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు.. విజయం మన సొంతం అవుతుంది. ఈ మాటలు నిజం చేసి చూపారు ఆర్య రాజగోపాల్ అనే యువతి. పెట్రోల్ బంక్‌లో పని చేసే ఓ ఉద్యోగి కుమార్తె అయిన ఆర్య.. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్‌లో పీజీ అడ్మిషన్ సాధించారు. ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. ఏంటంటే ఆర్య తండ్రి పెట్రోల్ బంక్‌లో సాధారణ ఉద్యోగి అని చెప్పుకున్నాం కాదా. ఇప్పుడు ఆర్య పీజీ అడ్మిషన్ పొందిన కోర్సు పెట్రోలియమ్ ఇంజనీరింగ్ కావడం విశేషం. ఆర్య కథ కేవలం ఆమె చదవులో చూపిన ప్రతిభ గురించి మాత్రమే కాదు.. ఆమె పట్టుదల, సంకల్పం గురించి కూడా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఈ స్ఫూర్తిదాయక కథనం వివరాలు ఇలా ఉన్నాయి.. (చదవండి: Sarah: అదంతా సరే.. మరి.. ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’) కేరళ పయ్యనూర్‌కు చెందిన ఆర్య తండ్రి రాజగోపాల్ గత 20 ఏళ్లుగా పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్. కూతురు భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఊహించుకునేవాడు రాజగోపాల్. కూతురుకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంతో కష్టపడ్డాడు. తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే.. ఆర్య చదువుకు మాత్రం అడ్డంకులు ఎదురు కానీవ్వలేదు. తల్లిదండ్రుల కష్టాన్ని, కలలను అర్థం చేసుకున్న ఆర్య చదువులో ముందుండేది. మంచి మార్కులు తెచ్చుకుని పేరున్న విద్యాసంస్థల్లో సీటు సంపాదించుకుంది. దానిలో భాగంగానే ఆర్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి తన బ్యాచిలర్ పూర్తి చేసింది. ఇప్పుడు పీజీ చేయడం కోసం ఐఐటీ కాన్పుర్‌లో సీటు సాధించి.. తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చింది. (చదవండి: వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే) ఆర్య కుటుంబ నేపథ్యం... ఆమె ప్రయాణం.. ఇప్పుడు సాధించిన విజయం తదితర అంశాల గురించి అశ్విన్ నందకుమార్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలయ్యింది. ఆర్య కథ చదివిన వారు తండ్రికూతుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్య విజయం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలిసింది. ఈ క్రమంలో ఆయన ఆర్యను ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘ఆర్య విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆర్య రాజగోపాల్, ఆమె తండ్రి రాజగోపాల్ల విజయం పట్ల దేశ ఇంధన రంగంతో సంబంధం ఉన్న మనమందరం నిజంగా ఎంతో గర్వపడుతున్నాము. ఈ ఆదర్శవంతమైన తండ్రి-కుమార్తెల ద్వయం ఎందరికో స్ఫూర్తి.. కొత్త భారతదేశానికి స్ఫూర్తి, మార్గదర్శకులు. వారిరువురికి నా శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ Heartwarming indeed. Arya Rajagopal has done her father Sh Rajagopal Ji & indeed all of us associated with the country’s energy sector immensely proud. This exemplary father-daughter duo are an inspiration & role models for Aspirational New India. My best wishes.@IndianOilcl https://t.co/eiU3U5q5Mj pic.twitter.com/eDTGFhFTcS — Hardeep Singh Puri (@HardeepSPuri) October 6, 2021 చదవండి: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు -
ఎవర్ గ్రీన్.. పెట్రోలియం ఇంజనీరింగ్!
ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులకు తరగని డిమాండ్. ముడి చమురును భూమి నుంచి వెలికితీసి.. ఇంధనంగా మార్చే క్రమంలో ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే వారే.. పెట్రోలియం ఇంజనీర్లు. భూమి లోపల ఉన్న పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించి.. వెలికి తీయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. పెట్రోలియం ఇంజనీరింగ్! అవకాశాల పరంగా ఎవర్గ్రీన్ బ్రాంచ్‌గా నిలుస్తున్న పెట్రోలియం ఇంజనీరింగ్‌పై ప్రత్యేక కథనం.. పెట్రోలియం ఇంజనీరింగ్‌కు సంబంధించి యూజీ(అండర్ గ్రాడ్యుయేట్), పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్), పీహెచ్డీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ స్థాయిలో దేశంలోని పలు విద్యా సంస్థలు బీటెక్/ఎంటెక్ ప్రోగ్రామ్స్‌ను అం దిస్తున్నాయి. నాలుగేళ్ల బీటెక్ పెట్రోలియం ఇంజనీ రింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత.. రెండేళ్ల ఎంటెక్ కోర్సులో చేరే అవకాశం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధనల దిశగా కొనసా గాలనుకుంటే.. పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. పెట్రోలియం కోర్సులు పెట్రోలియం ఇంజనీరింగ్‌లో బీటెక్/ఎంటెక్‌తో పా టు పలు ఇన్స్టిట్యూట్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ ఎంటెక్ కోర్సునూ అందిస్తున్నాయి. మరికొన్ని కాలే జీలు పెట్రోలియం విభాగంలో ఎంఎస్ కోర్సుల్లో నూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి ఎంబీఏ –పెట్రోలియం కోర్సు కూడా అందుబాటులో ఉంది. అర్హతలు ► బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి 10+2/ ఇంటర్మీడియెట్ ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి. దాంతోపాటు సంబం ధిత ఎంట్రెన్స్ టెస్ట్‌లు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, యూపీఈఎస్‌ఈఏటీ (యూనివర్సి టీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రా డూన్) ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► పీజీ స్థాయిలో ఎంటెక్‌లో చేరేందుకు బీఈ/ బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు గేట్(గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లో ర్యాంకు సాధించాలి. ఇన్స్టిట్యూట్స్ ఎ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఐటీ)–ధన్‌బాద్; యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్–డెహ్రాడూన్; పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ–గాంధీనగర్; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ– విశాఖపట్నం; మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–పుణె; రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ–యూపీ; ఐఐటీ–ఖరగ్‌పూర్ (పీజీ స్థాయి); ఐఐటీ –గౌహతి(పీజీ స్థాయి); జేఎన్టీయూ–కాకినాడ తదితర ఇన్స్టిట్యూట్స్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ యూజీ, పీజీ స్థాయిలో పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఫీల్డ్ ఆపరే టర్, టెస్టింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, రిజ ర్వాయర్ ఇంజనీర్, డ్రిల్లింగ్ ఇంజనీర్, పైప్‌లైన్ ఇంజనీర్, సైంటిస్ట్ జియాలజిస్ట్, మినరాలజిస్ట్, వెల్ స్టిమ్యులేటింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కెరీర్ స్కోప్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు చేసిన ప్రతిభా వంతులకు దేశవిదేశాల్లో డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో చమురు, సహజవా యు నిక్షేపాల అన్వేషణ విస్తృతంగా కొనసాగుతోంది. దాంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో అవకాశాలకు కొదవలేదు. ముఖ్యంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, అస్సాం పెట్రోలియం లిమిటెడ్ తదితర కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. వేతనాలు చమురు రంగం అభివృద్ధి పథంలోనే ఉంటుంది. కాబట్టి పెట్రోలియం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి.. చక్కటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరు ఆకర్షణీయ వేతనాలు సైతం అందుకోవచ్చు. పెట్రో లియం ఇంజనీరింగ్ కోర్సు పూర్తికాగానే వార్షిక ప్రారంభ వేతనం రూ.5 లక్షల నుండి రూ.8 లక్షల వరకు దక్కుతోంది. గేట్ ర్యాంకు ద్వారా ఓఎన్జీసీ లాంటి కంపెనీల్లో అవకాశం అందుకుంటే.. రూ.పది లక్షలకు పైగానే వార్షిక వేతనం అందుతుంది. అనుభవం ఉన్నవారికి గల్ఫ్ దేశాలలో భారీ వేతనాలు లభిస్తున్నాయి. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ విభాగాల్లో పని చేసేవారికి వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు సైతం ఇస్తున్నారు. క్యాంపస్‌లోనే ఆఫర్స్ పెట్రోలియం రంగంలో అవకాశాలు ఏటే టా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందింది. ఈ కోర్సు పూర్తిచేసినవారు క్యాంపస్ లోనే భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. కాకినాడ, జేఎన్టీయూలో 2010లో ఈ విభాగం ప్రారంభించాక.. ఆరు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వెళ్లారు. అందరూ కెరీర్లో బాగా సెటిల్ అయ్యారు. ఓఎన్జీసీ, రియలన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ దగ్గరలో ఉండటం వల్ల అక్కడి నిపుణులతో మా విద్యార్థులకు లైవ్ ప్రాజెక్టుల్లో శిక్షణ ఇస్తున్నాం. పెట్రోలియం కోర్సులు చేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. – ప్రొఫెసర్ బి.బాలకృష్ణ, జేఎన్టీయూ–కే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ -
కెరీర్‌కు ఇంధనం..పెట్రోలియం ఇంజనీరింగ్
మారుతున్న ప్రాధమ్యాలు.. పెరుగుతున్న అవసరాలు వెరసి వివిధ రంగాల్లో కాలక్రమేణా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అదే సమయంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని వాటిని సమర్థంగా నిర్వహించే మానవ వనరులు కూడా ఎంతో అవసరం.. అటువంటి మానవ వనరులను తీర్చిదిద్దడంలోశాస్త్ర సాంకేతిక విద్య ప్రాధాన్యత ఎంతో.. ఆ మేరకు ఎప్పటికప్పుడు కరిక్యులంను రూపొందించడంతోపాటు ఎన్నో నూతన కోర్సులను శాస్త్ర సాంకేతిక విద్యలో ప్రవేశ పెడుతున్నారు.. అటువంటి కోర్సుల్లో పెట్రోలియం/ఎనర్జీ స్టడీస్ ఒకటి. ద్విచక్ర వాహనం నుంచి విమానం వరకు ఏ వాహనం నడవాలన్నా.. ఇంట్లో వాడే గ్యాస్ స్టౌవ్ నుంచి ఏసీ వరకు ఇలా ఏది పని చేయాలన్నా కీలక పాత్ర పోషించేది ఇంధనం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఇంధనం లభించని రోజు ప్రపంచమే ఆగిపోతుందేమో? అనే అంతగా మానవ దైనందిన జీవితాన్ని ఇంధన రంగం ప్రభావితం చేస్తోంది. అటువంటి ఇంధన రంగం గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఉద్దేశంతో పెట్రోలియం, ఎనర్జీ విభాగంలో పలు కోర్సులను ప్రవేశ పెట్టారు. బ్యాచిలర్ డిగ్రీ నుంచే అకడమిక్‌గా పెట్రోలియంకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్‌గా పెట్రోలియం కోర్సులను అందిస్తున్నారు. వీటిని బీటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్/కెమికల్ అండ్ పెట్రోలియం)గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్మీడియెట్/తత్సమానం (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) సబ్జెక్ట్లతో పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. డీప్‌వాటర్ ఇంజనీరింగ్, సబ్‌సీ టెక్నాలజీ వంటి కోర్సులను బీటెక్‌కు అనుబంధంగా చేయవచ్చు. బీటెక్ తర్వాత ఆసక్తి ఉంటే సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఎంటెక్/పీహెచ్డీ చేయవచ్చు. ఈ క్రమంలో ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్), ఎంటెక్ (గ్యాస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), ఎంటెక్ (పైప్ లైన్ ఇంజనీరింగ్), ఎంబీఎ (పెట్రోలియం ఇంజనీరింగ్, గ్యాస్ మేనేజ్మెంట్) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విధులు పెట్రోలియం ఇంజనీరింగ్ అభ్యర్థులు పెట్రోలియం ప్రొడక్షన్, ప్రాసెసింగ్ సంబంధిత విధులు నిర్వహిస్తుంటారు. చమురు అన్వేషణకు సంబంధించి ఒక ప్రదేశం/ వనరులు లభ్యమైనప్పుడు వీరి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో వీరు జియాలజిస్ట్‌లతో కలిసి సదరు నేల లేదా ఆయిల్ రిజర్వాయర్ భౌగోళిక లక్షణాలను విశ్లేషిస్తారు. వాటి ఆధారంగా పెట్రోలియం వెలికితీయడానికి అవసరమైన డ్రిల్లింగ్ పద్ధతులను రూపొందిస్తారు. అంతేకాకుండా సంబంధిత పరికరాలను కూడా తయారు చేస్తుంటారు. పెట్రోలియం ఇంజనీర్లకు అనుంబంధ అంశాలపై సమగ్ర అవగాహన ఉండాలి. ఈ క్రమంలో జియో ఫిజిక్స్, పెట్రోలియం జియాలజీ, డ్రిల్లింగ్, ఎకనామిక్స్, రిజర్వాయర్ ఇంజనీరింగ్, వెల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ లైఫ్ సిస్టమ్స్ వంటి అంశాలపై అవగాహన తప్పనిసరి. పెరుగుతున్న అవకాశాలు పెట్రోలియం ఇంజనీర్ అభ్యర్థులకు అవకాశాలు కొదవలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోలియం, సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడమే అనే మాట తలెత్తదు. డిమాండ్ పెరగడం అంటే తదనుగుణంగా నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుందనే భావించాలి. కాబట్టి ఈ కోర్సును పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు ఆయిల్ కంపెనీలు, గ్యాస్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు తదితరాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైస్ వాటర్ కూపర్ కన్సల్టెన్సీ సంస్థ అంచనా మేరకు వచ్చే ఐదేళ్లలో ఈ రంగలో దాదాపు 36 వేల నిపుణుల అవసరం ఏర్పడనుంది. నైపుణ్యం, అనుభవం మేరకు ఈ రంగంలో వివిధ రకాల జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి. అవి..రిజర్వాయర్ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, సీనియర్ జియో సైంటిస్ట్, డ్రిల్ బిట్ సిస్టమ్ ఫీల్డ్ ఇంజనీర్, పెట్రోలియం టెక్నాలజిస్ట్, డ్రిల్లింగ్ ఇంజనీర్, అనలిస్ట్, ప్రాసెస్ ఇంజనీర్, రిజర్వాయర్ పెట్రో ఫిజిక్సిస్ట్, టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ తదితరాలు. విదేశాల్లో పెట్రోలియంను బ్లాక్ గోల్డ్‌గా పేర్కొంటారు. పారిశ్రామికీకరణ, ఆర్థిక రంగం వృద్ధి బాటలో పయనించడంలో పెట్రోలియం పాత్ర ఎంతో కీలకం. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా చమురు అన్వేషణను పెద్ద ఎత్తున్న సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో పెట్రోలియం ఇంజనీరింగ్ అభ్యర్థులకు విదేశీ అవకాశాలు కూడా పుష్కలం. భారతీయ కంపెనీలు కూడా విదేశాల్లో పెట్రోలియం అన్వేషణలో నిమగ్నమవ్వడం కూడా ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. రష్యా, గల్ఫ్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ (ఓపెక్) ఇందుకు చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలు, ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాల్లో అధిక పే ప్యాకేజ్‌లు లభిస్తున్నాయి. వేతనాలు వేతనాల విషయానికొస్తే..సాఫ్ట్వేర్ రంగానికి దీటుగా జీతా లు అందించే రంగాల్లో ఇది ఒకటి. ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌కు కంపెనీని బట్టి వార్షిక సరాసరి వేతనం రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల మధ్య ఉంటోంది. కొన్ని సంస్థలు రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. అత్యధికంగా రూ. 30 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అదే అంతర్జాతీయ సంస్థల్లోనైతే సంవత్సరానికి లక్ష డాలర్లు కూడా అందుకునే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయం పెరుగుతున్న ఇంధన అవసరాలు ఒక వైపు, మరో వైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంతో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) పట్ల అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, ఎన్జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్- డెహ్రాడూన్; కోర్సు: ఎంటెక్ (పవర్ సిస్టమ్స్) వెబ్సైట్: www.upes.ac.in అమిటీ యూనివర్సిటీ-నోయిడా కోర్సు: ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ) వెబ్సైట్: www.amity.edu మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్; కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ) వెబ్సైట్: www.manit.ac.in టెరీ యూనివర్సిటీ-ఢిల్లీ; కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మేనేజ్మెంట్) వెబ్సైట్: www.teriuniversity.ac.in కేజీ బేసిన్లో పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, గెయిల్, ఆయిల్ ఇండియా, కేన్ ఇంజనీరింగ్ వంటి ప్రముఖ సంస్థలు సముద్రం డీప్‌వాటర్‌పోర్టు నుంచి ఆయిల్, గ్యాస్‌ను వెలికితీస్తున్నాయి. వీటికి అనుబంధంగా స్లమ్‌బర్గ్, హాలీబాటన్, వెదర్ఫర్డ్, యాసర్ సొల్యూషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు సంబంధిత పనుల్లో పాల్గొంటున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అవసరమైన మానవ వనరులను అందించడం కోసం పెట్రోలియం ఇంజనీరింగ్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లపై పట్టు ఉండాలి. పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌పై అవగాహన, ఆసక్తి అవసరం. సృజనాత్మకత, పరిశోధన పట్ల ఆసక్తి, కష్టపడే తత్వం కలిగి ఉండాలి. కోర్సు పూర్తి చేసిన తరువాత భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఆయిల్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లోను, రిలయన్స్, కేన్ ఇంజనీరింగ్, జిందాల్, టాటా పెట్రోల్, హిందుస్థాన్ పెట్రోల్, జాన్ ఇంజనీరింగ్, పెట్రోనెట్, మిచెల్ డ్రిల్లింగ్, టోటల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, డీప్ డ్రిల్లింగ్, స్లంబర్గ్, హాలీబాటన్, వెదర్పోర్డ్ వంటి ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో రూ. 6 నుంచి రూ. 12 లక్షలు వరకు అత్యధిక వేతనంగాను, రూ. 2 నుంచి రూ. 4 లక్షల వరకు అత్యల్ప వేతనంగా అందిస్తున్నాయి. రూ.30 లక్షల వరకు కూడా ఆఫర్ చేసే కంపెనీలు ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన విద్యార్థులకు గల్ఫ్ దేశాల్లో విరివిగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. దేశీయంగా ఓఎన్జీసీ సంస్థ ఈ రంగానికి సంబంధించి టాప్ రిక్రూటర్‌గా నిలుస్తోంది. ఈ సంస్థ ఏడాదికి 800 నుంచి 1000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ప్రొఫెసర్ కె.వి.రావు, ప్రోగ్రామ్ డెరైక్టర్, పెట్రోలియం కోర్సెస్, జేఎన్టీయూ-కాకినాడ. టాప్ రిక్రూటర్స్ ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ, షెల్, రిలయన్స్, హెచ్‌పీసీఎల్ ఎస్సార్, కెయిర్న్ ఎనర్జీ, బ్రిటిష్ పెట్రోలియం