breaking news
Pending bill
-
రిజర్వేషన్ల పెంపుపై నేడు సమావేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు, పీడీ యాక్ట్ సవరణకు సంబంధించిన బిల్లులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసింది. శుక్రవారం హోం శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబందించి కేంద్రం కోరిన వివరణలు, సమగ్ర ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పంపిన బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీలకు 6 నుంచి 10 శాతా నికి పెంచేందుకు రూపొందించిన బిల్లును అసెం బ్లీ ఆమోదించింది. కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ హోం శాఖకు సూచించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రధాన కారణం గా చూపింది. ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్రం పంపిన బిల్లులోని అంశాల ను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించిం ది. రెండు శాఖలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో రిజర్వేషన్ల పెంపు విషయంలో పీట ముడి పడింది. అలాగే పీడీ యాక్ట్‌ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. శుక్రవారం జరిగే సమావేశంలో పెండింగ్ బిల్లులపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బిల్లులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు, కేంద్రం లేవనెత్తిన అంశాలను నివేదించేందుకు సాధారణ పరిపాలన శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనుంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను సైతం సమావేశానికి ఆహ్వానించింది. -
‘ఇందిరమ్మ’.. గిదేందమ్మా!
♦ పెండింగ్ బిల్లులు రూ.342.02కోట్లు ♦ సకాలంలో డబ్బులు రాక లబ్ధిదారుల అవస్థలు ♦ పునాదులు, మొండిగోడలకే పరిమితమైన 54,501 ఇళ్లు ♦ తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు గూడు కోల్పోయి.. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు తాళ్లపల్లి లక్ష్మి. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రారంభించింది. బిల్లులు అందక మధ్యలోనే పనులు నిలిపివేసింది. ఈమె భర్త పదేళ్ల క్రితమే మరణించాడు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆమె, కొడుకు పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇల్లు మంజూరు కావడంతో తమ వద్ద ఉన్న కొంత బంగారం అమ్మి నిర్మాణం చేపట్టింది. రూ.1.50లక్షలు అప్పు తెచ్చి నిర్మాణం వేగవంతం చేసింది. స్లాబ్ వరకు వచ్చే సరికి ప్రభుత్వం లక్ష్మికి రూ.11వేలు చెల్లించింది. అవి తెచ్చిన అప్పు వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో స్లాబ్ వరకు వచ్చిన ఇంటి నిర్మాణాన్ని ఆపేసింది. బిల్లు ఎప్పుడు వస్తుందో.. ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందోనని నెలల తరబడి లక్ష్మి ఆశగా ఎదురుచూస్తోంది. ఇందిరమ్మ పథకంలో భాగంగా మూడు దశల కింద నిరుపేద లబ్ధిదారులు జిల్లాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పది నియోజకవర్గాల్లో 54,501 ఇళ్లకు.. రూ.342.02కోట్లు చెల్లించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందులో అత్యధికంగా భద్రాచలం నియోజకవర్గానికి రూ.71.37కోట్లు, ఇల్లెందుకు రూ.45.47కోట్లు చెల్లించాలి. అయితే లబ్ధిదారులు నిర్మాణం చేపట్టిన ఇళ్లన్నీ పునాదులు, గోడలు, రూఫ్ లెవల్, స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయాయి. అప్పు తెచ్చి ఇళ్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో నిర్మాణాల మధ్య పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో మండలాలవారీగాా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. నెలలు గడిచినా పూర్తి కావడం లేదు. గత నిర్మాణాల్లో పలు అవకతవకలు జరిగాయని, నిర్మాణం చేపట్టిన ఇళ్లలో అర్హులకే బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఇతర అధికారిక పనులు ఉండడంతో ఇళ్ల తనిఖీలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో తమ బిల్లులు ఎప్పుడోస్తాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఉన్న గూడు కూల్చేసి.. ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో గతంలో ఉన్న గూడును లబ్ధిదారులు తొలగించి.. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం బిల్లుల మంజూరు నిలిపివేయడంతో ఏమి చేయాలో పాలుపోక మొండి గోడలపైనే రేకులు వేసుకుని నివసిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు బిల్లులు వస్తాయనే ఆశతో కొంత అప్పు తెచ్చి.. సగం వరకు ఇళ్లు నిర్మించినా.. బిల్లులు రాకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నాళ్లిలా ఉండాలని సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. అధికారులు, సిబ్బంది మాత్రం త్వరలోనే వస్తాయంటూ సమాధానమిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో లబ్ధిదారులు వినతులు ఇస్తున్నా.. బిల్లులు మాత్రం రావడం లేదు. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండాపోయింది. తొలి విడత 24,433 ఇళ్లకే.. నెలల తరబడి అధికారులు లబ్ధిదారుల ఇళ్లను తనిఖీ చేసి.. ప్రభుత్వానికి నివేదిక పంపారు. తొలి విడతగా కేవలం 24,433 ఇళ్లకే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడతాయోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకా లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నా.. వారి ఇళ్ల తనిఖీలు ఎప్పుడు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో కూడా రాజకీయ ప్రమేయంతో అధికారులు ముందుగా కొందరు లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, కొన్ని గ్రామాల్లో అసలైన లబ్ధిదారుల ఇళ్లను తనిఖీ చేయకుండానే వదిలేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. -
ఉమ్మడి బిల్లులు ఎవరు చెల్లించాలి?
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని పెండింగ్ బిల్లులతో పాటు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం విడిపోయాక పలు శాఖలు సమర్పించిన బిల్లులను ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఈ పంచాయతీని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలోని అపెక్స్ కమిటీ ముందు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ నిర్ణయించింది. వాస్తవానికి ఇలాంటి సమస్యలు తలెత్తకూడదని, ఉమ్మడి రాష్ట్ర బిల్లులన్నింటినీ రాష్ట్ర విభజనకు వారం రోజుల ముందే అంటే మే 25నే చెల్లించేందుకు ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని శాఖల్లో నిధులు అందుబాటులో లేని కారణంగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, వీటిని తొలు త తెలంగాణ ఖజానా చెల్లించాలని, ఆ తర్వాత అకౌంటెంట్ జనరల్ ద్వారా అందులో 58% మేర నిధులను ఆంధ్రా ఖజానా నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం, విభజనకు ముందు నెలలకు సంబంధించి దాదాపు రూ.3,000 కోట్ల మేరకు బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులన్నింటిపై నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ఆర్థిక శాఖ సంబంధిత ఫైలును అపెక్స్ కమిటీకి పంపిం ది. ఏ జిల్లాల్లో పెండింగ్ బిల్లులు ఉంటే ఆ జిల్లాల రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని చెల్లించాలనే ప్రతిపాదన చేసింది.