breaking news
Osaka University scientists
-
30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగారా!
టోక్యో: జపాన్‌లోని ఒక ఆసుపత్రి సిబ్బంది, రోగులు సుమారు 30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగు నీరుగా ఉపయోగించారట. అబ్బా ఏంటి ఇది ? అది కూడా జపాన్లోనా అని ఆశ్యర్యపోకండి. అసలేం జరిగిందంటే జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయ ఆసుపత్రి పరిసరాల్లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో తవ్వుతుండగా కొన్ని పంపు నీటి పైపులు తప్పుగా ఏర్పాటు చేయబడినట్లు గుర్తించింది. (చదవండి: వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్‌కి చెక్ పెట్టేలా కొత్త చట్టం) పైగా ఆ తాగునీటి పైపులు మరుగుదొడ్డికి అనుసంధానం చేసి ఉంది. ఈ ఆసుపత్రి 1993లో ప్రారంభమైనప్పుడు 120 పైపులు నుంచి నాసిరకం నీరు వస్తున్నట్లు అప్పట్లో ఫిర్యాదుల కూడా వచ్చాయి. కానీ ఇప్పుడ విచారిస్తే ఆ టాయిలెట్ వాటర్‌ని రోగులు, సిబ్బంది 30 ఏళ్లుగా వినియోగించినట్టు తేలింది. దురదృష్టమేమిటంటే ఆసుపత్రికి సంబంధించిన భవనాలు నిర్మిచాలనుకునే వరకు ఎవ్వరు వీటిని గుర్తించలేకపోయారు. అయితే ఆ నీటిని తాగినందు వల్ల ఎవ్వరు అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి రికార్డుల్లో నమోదు కాలేదు. అధునాతన వైద్య సంరక్షణను అందించే విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఇలా జరగడం తమను ఆందోళనకు గురిచేసిందని తనని క్షమించండి అంటూ ఆ ఆసుపత్రి డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ కజుహికో నకటానీ సిబ్బందిని, రోగులను వేడుకున్నారు. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) -
సముద్రపు నీటితో విద్యుత్
టోక్యో: సముద్రపు నీటి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు తోడ్పడే సరికొత్త టెక్నాలజీని జపాన్‌లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సూర్యరశ్మి సహాయంతో సముద్రపు నీటిని హైడ్రోజన్ పెరాక్సైడ్(ఏ2ై2)గా మార్చగలిగే ‘ఫొటో ఎలక్ట్రో కెమికల్ సెల్’ను రూపొందించారు. ఈ సెల్ సౌరశక్తిని గ్రహించినప్పుడు సముద్రపు నీటిలోని క్లోరిన్ సహాయంతో ఉత్తేజితమై... రసాయన చర్యలు జరుపుతుంది. దీంతో నీటిలో కొంత భాగం హైడ్రోజన్ పెరాక్సైడ్‌గా మారుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఫ్యూయల్ సెల్లో వినియోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అయితే ఇంకా ఇది ప్రాథమిక దశలోనే ఉందని, మరింతగా మెరుగుపరిచి ఎక్కువ స్థాయిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షునిచి ఫుకుజుమి తెలిపారు.