ongol
-
రూ.16 కోట్ల ఇంజక్షన్.. గుండెల్ని పిండేసే కథ
చిత్రంలో పచ్చటి పచ్చికపై ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను చూస్తే ముచ్చటేస్తుంది కదా.! కానీ ఆ నవ్వుల వెనుక గుండెల్ని పిండేసే వ్యథ దాగి ఉంది. తప్పటడుగులు కూడా వేయలేని ఆ చిన్నారుల పరిస్థితిని తలుచుకుంటూ వారి తల్లిదండ్రులు మౌనంగా రోదిస్తున్నారు. ‘ఈ బాధ ఇంకెన్నాళ్లు.. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నారు. కానీ వారిలో ఎక్కడో ఓ ఆశ.. పిల్లలకు వైద్యం చేయించాలన్న తపన.. ఆత్మహత్య ఆలోచనను విరమించుకునేలా చేశాయి. సాక్షి, ఒంగోలు: ఒంగోలుకు చెందిన దండే వినయ్‌కుమార్ బిల్డర్, ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య వేదవతితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్ మకాం మార్చారు. అక్కడ వీరికి లాసిత్ అయ్యన్ జన్మించాడు. ఆరు నెలలు గడిచినా కదలిక లేదు. పెద్దల సూచనతో ఏడాది వరకు వేచి చూశారు. కనీసం పక్కకు కూడా పొర్లకపోతుండటంతో ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆస్పత్రిలో జెనెటిక్ పరీక్షలు చేయించగా స్పైనల్ మస్క్యులర్ ఏట్రోఫీ(ఎస్ఎంఏ)–టైప్ 2గా నిర్ధారణ అయింది. ప్రపంచంలో ఎక్కడా మందు లేదని వైద్యులు స్పష్టం చేశారు. బతికినన్నాళ్లు చూసుకోవడమే తప్ప మరో మార్గం లేదని చెప్పడంతో హతాశులయ్యారు. రెండో కుమారుడికీ అదే జబ్బు వినయ్, వేదవతి దంపతులకు మరో కుమారుడు మోక్షిత్ జన్మించగా ఆ చిన్నారికీ ఎస్ఎంఏ టైప్–2 సోకింది. మోక్షిత్ పరిస్థితి తన అన్న కంటే కొంత ఫర్వాలేదు. కొద్దిసేపు కూర్చోగలడు. ఈ చిన్నారులిద్దరూ ఆరోగ్యంగా కనిపిస్తారు కానీ ఏదైనా వస్తువు ఇస్తే చేయి చాచి అందుకోలేరు. కూర్చున్న కాసేపటికే నేలమీద వాలిపోతారు. అసలే బలహీనమైన కండరాలు.. రోజురోజుకూ శక్తి క్షీణిస్తుండటంతో ఆ పిల్లల వ్యధ వర్ణణాతీతం. బిడ్డల్ని బతికించుకోవాలన్న తాపత్రయంలో ఎస్ఎంఏపై వినయ్‌కుమార్ ఎంతో స్టడీ చేశాడు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న 400 మందితో ‘‘క్యూర్ ఎస్ఎంఏ ఇండియా’’ అనే సంస్థను స్థాపించి సమాచారం పంచుకుంటున్నారు. అన్నీ అమ్మే.. చిన్నారులిద్దరూ పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తల్లి వేదవతే విద్యాబుద్ధులు నేర్పుతోంది. వారి తెలివితేటలకు అబ్బురపడుతూ మానసిక క్షోభను మరిచిపోతోంది. ఆరు, ఏడేళ్ల వయసున్న వీరు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడమే కాదు, జనరల్ నాలెడ్జ్‌పైనా పట్టు సాధించారు. వివిధ అంశాల గురించి వివరంగా చెప్పగల నేర్పు వీరి సొంతం. 2017లో మందులు అందుబాటులోకి.. 2017 డిసెంబర్లో అమెరికాకు చెందిన బయోజిన్ కంపెనీ స్పిన్రజా అనే మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి ఏడాది ఐదు ఇంజక్షన్లకు అయ్యే ఖర్చు రూ.5 కోట్లు కాగా.. ఎస్ఎంఏ బాధితులు జీవించినంత కాలం ఇంజక్షన్లు వేసేందుకు మరో రూ.3 కోట్లు వెచ్చించాలి. కొద్దికాలం క్రితం రోచె అనే కంపెనీ రిస్డీ ప్లామ్ అనే ఓరల్ డ్రగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజు ఒక్కో సాచెట్ పిల్లవాడికి ఇవ్వాలి. దీని ఖరీదు రూ.80 వేలు. కానీ జీవితకాలం ఈ సాచెట్లు ఇస్తూనే ఉండాలి. ఇదిలా ఉండగా అవాక్సిస్ కంపెనీ జోల్జెన్ ఎస్ఎంఏ అనే ఇంజక్షన్ అందుబాటోకి తెచ్చింది. ఒక్కసారి ఈ ఇంజక్షన్ చేస్తే వ్యాధి నయమవుతుందని చెబుతున్నారు. దీని ఖరీదు ఏకంగా రూ.16 కోట్లు. అదృష్టవశాత్తు అమెరికాలోని డైరెక్ట్ రిలీఫ్ ఫండ్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎంఏ సోకిన 360 మందిని గుర్తించి జీవితాంతం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చింది. అందులో మోక్షిత్ ఒకడు. దీంతో త్వరలోనే ఆ చిన్నారి కోలుకుంటాడనే నమ్మకం కలిగింది. సాయం చేసే దాతలు 7799373777, 8977274151ను సంప్రదించవచ్చు. లేదా ఐడీబీఐ బ్యాంక్ అకౌంట్ నం.0738104000057169, ఒంగోలు బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఐబీకేఎల్ 0000738కు నగదు అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేసి ఆదుకోండి నా బిడ్డల ఆరోగ్యం బాగుండుంటే నేనే పది మందికి అండగా ఉండేవాడిని. కానీ ఇటువంటి అరుదైన జబ్బులకు వైద్యం చేయించాలంటే కష్టసాధ్యం. నా ఆస్తి మొత్తం అమ్ముకున్నా తొలి ఏడాది ఒక ఇంజెక్షన్ కూడా వేయించలేను. అందుకే ఇటీవల క్రౌడ్ ఫండింగ్‌కు సంబంధించి ఇంపాక్ట్ గురూలో యోగేష్ గుప్తాకు లభించిన ఆదరణ చూసి ఆన్లైన్లో అప్రోచ్ అయ్యాను. వారు పరిశీలించి ఫండింగ్ సేకరించడం మొదలుపెట్టారు. ఒంగోలుకు చెందిన ఆసిఫ్, అన్వేష్ స్మైల్ ఎగైన్ అనే సంస్థను స్థాపించి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మేము ఒక సంస్థ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలిశాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – దండే వినయ్ కుమార్, వేదవతి చదవండి: విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
ప్రకాశం సిగలో మరో మణిహారం..
సాక్షి, కందుకూరు: ప్రకాశం జిల్లా సిగలో కేంద్రీయ విద్యాలయం మరో మణిహారంగా నిలవనుంది. కందుకూరు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి ఎట్టకేలకు అనుమతులు వచ్చాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయాల అడిషనల్ కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కందుకూరులో విద్యాలయం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆసియాలోనే అతి పెద్ద రెండో రెవెన్యూ డివిజన్ కందుకూరుకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. దీని కోసం రెండేళ్ల క్రితమే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పక్కా ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. ఎంపీ చొరవతో స్థానిక బాలురు ఉన్నత పాఠశాల ఆవరణలోని మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కాలేజీలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ స్వయంగా అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు విద్యాలయం ప్రారంభానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రీయ విద్యాలయాల అధికారులు పలుమార్లు తాత్కాలిక భవనాలు, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాదే కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అవుతుందని అంతా భావించారు. పలు సాంకేతిక కారణాలతో కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో కందుకూరుకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు రావడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కందుకూరు పట్టణంలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. నాణ్యమైన విద్యకు ప్రామాణికం అత్యుత్తమ విద్యాబోధనకు కేంద్రీయ విద్యాలయాలు నిలయాలుగా ఉంటున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ విద్యాలయాల్లో సీబీఎస్సీ సిలబస్‌తో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన సాగుతుంది. ఫస్టుక్లాస్ నుంచి 5వ తరగతి వరకు ప్రస్తుతం క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అదనపు తరగతులు పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. కందుకూరు ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా సంస్థ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యాలయం మంజూరైనా బోధన, బోధనేత సిబ్బంది నియామకం జరగాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాశ్వత భవనాలు టీఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో.. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజీలో తాత్కాలిక భవనాలు, తరగతి గదులు ఏర్పాటు చేసినా శాశ్వత భవనాలు మాత్రం స్థానిక టీఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో నిర్మించనున్నారు. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయ అధికారులు ఆ స్థలాలను పరిశీలించి వెళ్లారు. రెవన్యూ అధికారులు సైతం టీఆర్ఆర్ కాలేజీ ఆవరణలో స్థలాన్ని సరిహద్దులు నిర్ణయించి కేంద్రీయ విద్యాలయాలకు అందించారు. -
103వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
సమస్యల వలయంలో బీసీ హాస్టల్
గుండాయపాలెం (ఒంగోలురూరల్): మండలంలోని ఏకైక బాలుర వసతి గృహం సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విద్యార్థుల వసతి గృహం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. గత ఏడాది నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువులో మట్టి హాస్టల్ ముందు ఉన్న ఆట స్థలంలో మూడు వంతుల భాగం వరకు మెరక చేశారు. పనులు చివరి దశలో ఉండగా అప్పటి బీసీ కార్పొరేషన్ డీడీ మయూరి సర్పంచ్ వెంకటేశ్వరమ్మకు హాస్టల్ అభివృద్ధి పనులు చేపట్టవద్దనీ, హాస్టల్లో ప్రవేశించవద్దనీ లేఖ రాశారు. దీంతో పనులు హాస్టల్ పనులు ఆగిపోయాయి. అనంతరం హాస్టల్‌ను సందర్శించిన బీసీ కార్పొరేషన్ డీడీ లక్ష్మిసుధ హాస్టల్ పరిస్థితులపై ఆరా తీశారు. దీనిపై స్పందించిన సర్పంచ్ హాస్టల్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న పరిస్థితులు డీడీకి వివరించారు. దీనిపై స్పందించిన డీడీ లక్ష్మిసుధ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి హాస్టల్‌కు నిధులు మంజూరుచేయిస్తామని అప్పట్లో వారికి హామీ ఇచ్చారు. కానీ నేటికి హాస్టల్లో నిర్మాణ పనులు కార్యరూపం దాల్చలేదు. పాములకు ఆవాసాలు హాస్టల్లో చిల్లచెట్లు పెరిగి పోవడంతో పాములకు, పురుగులకు ఆవాసంగా మారింది. సాయంత్రం 5 గంటలు దాటితే విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పాఠశాల ఆవరణలో మేక పోతును వధించడం, మద్యం సేవించి కోళ్లను విచ్చలవిడిగా కోయడంపై విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామస్తులు లిఖిత పూర్వకంగా అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
చికిత్స పొందుతూ తిరుమలరావు మృతి