'తాతగారి ఆశయాల కోసం పాటుపడతాం'
హైదరాబాద్ : ప్రముఖ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాల కోసం తామంతా పాటుపడతామని ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ వెల్లడించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ చిరస్థాయిగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని తెలిపారు. తెలుగువారంతా ఐక్యంగా ఉండాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తామని నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు.