breaking news
No petrol-diesel vehicles
-
10–15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో నిబంధనను అమల్లోకి తేనున్నాయి. పదేళ్లు దాటిన వాహనాలకు బంక్‌ల్లో డీజిల్, పెట్రోల్ నిరాకరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్‌తో నడిచే వాహనాలకు జూలై ఒకతో తేదీ నుంచి బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయవద్దంటూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ విధానం మిగతా ప్రాంతాల్లోనూ విడతల వారీగా అమల్లోకి రానుందని సమాచారం. ఇందులో భాగంగా వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ (ఏఎన్పీఆర్) కెమెరాల నెట్‌వర్క్‌ను ఢిల్లీలో ఉన్న 520 బంకుల్లో ఏర్పాటయ్యాయి. వాహన డేటాబేస్‌తో అనుసంధానించిన ఈ వ్యవస్థలు, పాతబడిన, నిబంధనలను పాటించని వాహనాలను అప్పటికప్పుడు గుర్తిస్తాయి. జూలై 1వ తేదీ నుంచి ఈ కెమెరాలు బంకుల్లోకి వచ్చే వాహనాలను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. వాహన రిజి్రస్టేషన్ నంబర్ సాయంతో ఇతర వివరాలను తక్షణమే క్రాస్ చెక్ చేస్తాయి. వాహనం ఈఎల్వీ(ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్)గా గుర్తించినా లేదా చెల్లుబాటయ్యే పొల్యూషన్ సరి్టఫికెట్ లేకున్నా సిస్టమ్ ఆపరేటర్‌కు ఆడియో హెచ్చరికను జారీ చేస్తాయి. అక్టోబర్ 31 నుంచి గుర్గావ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్, సోనిపట్ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎన్సీఆర్ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అమలులోకి రానుంది. ఢిల్లీలో 10–15 ఏళ్లు దాటిన వాహనాలు 62 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ గుర్తించింది. -
వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.కాగా, పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చి చెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యాజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు.గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు. ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజా రవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఢిల్లీ రోడ్లపై కదలని వాహనాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రోడ్లపై పెట్రోల్, డీజిల్ క్యాబ్‌లను అనుమతించబోమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంపై క్యాబ్ డ్రైవర్లు సంతృప్తిగా లేరు. క్యాబ్స్ తరుపువారు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మే 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాహనాలు అనుమతించబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు రోడ్లపై వాహనాలను రెండో రోజు అడ్డుకుంటున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్డు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెయిన్ రోడ్ల కూడళ్లలో తమ నిరసన తెలిపితేనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు తమ గోడును అర్థం చేసుకుంటుందని వారు భావించినట్టు కనిపిస్తోంది. మెహ్రౌలి-బదార్పుర్ రోడ్డు మార్గంలో, కార్కారీకి వెళ్లే మార్గంలో ఉన్న దక్షిణ ఢిల్లీలోని సాకెత్ మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీ-నోయిడా మార్గం, దౌలా కువాన్, మహిపాల్ పుర్, గుర్గావ్ కు వెళ్లే ఇతర ప్రధాన మార్గాలలో టాక్సీ డ్రైవర్లు తమ నిరసన తెలుపుతూ వాహనాలను అడ్డుకుని దార్లను మూసివేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ తమ నిరసన తెలుపుతున్నారని టాక్సీ డ్రైవర్ల తీరును వివరించారు. డీజిల్, పెట్రోల్ వాహనాలను సీఎన్ జీ వాహనాలుగా మార్చుకునే పరిజ్ఞానం అందుబాటులో లేదని, అందుకే కొంత గడువు ఇవ్వాలని క్యాబ్స్ యజమానులు సుప్రీంకోర్టును అభ్యర్థించగా... ఇప్పటికే చాలినంత సమయం ఇచ్చామని, తమ ఆదేశాలను పాటించి తీరాలని సుప్రీం గట్టిగా మందలించిన విషయం తెలిసిందే.