breaking news
Nilgiri trees
-
ఎకో ఫ్రెండ్లీ గ్రాఫెన్‌ను ఆవిష్కరించిన విద్యార్థులు
సాక్షి, కాజీపేట : నిట్ వరంగల్, ఆస్ట్రేలియా విద్యార్థులు సంయుక్తంగా ఎకో ఫ్రెండ్లీ గ్రాఫెన్‌ను ఆవిష్కరించారు. నీలగిరి చెట్టు(బంకచెట్టు) బెరడుకు వివిధ రకాల రసాయన చర్యలు నిర్వహించి గ్రాఫెన్ ఇంధనం సృష్టించి నూతన పరిశోధనకు నాంది పలికారు. సాధారణంగా భారతదేశం, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధికంగా లభించే నీలగిరి చెట్లను విద్యుత్ ప్రవాహానికి ఉపయోగించే కాపర్‌కు దీటుగా రూపకల్పన చేయాలనే లక్ష్యంతో నిట్ వరంగల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్లు సాయికుమార్ మంచాల, వీఎస్ఆర్కే.తాండవ, ఆస్ట్రేలియా ఆర్ఎంఐటీ యూనివర్సిటీకి చెందిన జంపయ్య దేశెట్టి సంయుక్తంగా ప్రొఫెసర్లు డాక్టర్ విష్ణుశంకర్, సురేష్ పర్యవేక్షణలో పరిశోధనలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు ప్రకృతిలో లభించే నీలగిరి చెట్లను ఇంధన తయారీకి ఉపయోగించవచ్చని అంతర్జాతీయ పరిశోధన పత్రాలు, స్థిరమైన రసాయన శాస్త్రం, ఇంజినీరింగ్‌లో పొందుపరిచినట్లు గైడ్ విష్ణుశంకర్ గురువారం నిట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. ఈ పరిశోధనలు రాబోవు రోజుల్లో పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్ అందించేందుకు తోడ్పడతాయని వివరించారు. -
నీలగిరి చెట్ల నుంచి జెట్ ఇంధనం!
మెల్బోర్న్: తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే జెట్ విమానాల ఇంధనాన్ని యూకలిప్టస్(నీలగిరి) చెట్లను ఉపయోగించి తయారు చేయొచ్చని తేలింది. ‘ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల యూకలిప్టస్(జామాయిల్)చెట్లను పెంచినట్లయితే విమానయాన పరిశ్రమకు కావాల్సిన 5 % ఇంధనాన్ని వాటి నుంచి తయారు చేయొచ్చు’ అని ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీకి చెందిన కార్స్టెన్ కుల్హీమ్ పేర్కొన్నారు. మొత్తం ఈ పరిశ్రమ ద్వారా 2 శాతం కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతోంది. శిలాజ ఇంధనాలతో పోల్చితే యూకలిప్టస్ ఇంధనం ఖరీదైందని, కాకపోతే వీటివల్ల కార్బన్‌డై ఆక్సైడ్ తక్కువగా విడుదలవుతుందన్నారు. జెట్ విమానాలకు శిలాజేతర ఇంధనాలు వాడడం కాస్త కష్టమని, అయితే పునరుత్పాదక ఇథనాల్, బయోడీజిల్ కొంతమేరకు ఫర్వాలేదని చెప్పారు. యూకలిప్టస్ నూనెలో మోనోటర్పీన్లు ఉంటాయని, వాటిని అధిక శక్తినిచ్చే ఇంధనాలుగా మార్చొచ్చని తెలిపారు.