breaking news
Naveen gulathi
-
ఆప్తబంధువు ఎల్ఐసీ
జీవిత బీమా సంస్థ అన్ని వర్గాల ప్రజలకు ఆప్త బంధువులా నిలిచిందని ఎస్పీ నవీన్ గులాఠీ అన్నారు. కడప నగరంలోని నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రంలో జరిగిన బీమా ముగింపు ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. కడప కల్చరల్ : జీవిత బీమా సంస్థ అన్ని వర్గాల ప్రజలకు ఆప్త బంధువులా నిలిచిందని కడప ఎస్పీ నవీన్ గులాఠీ అన్నారు. బీమా ముగింపు ఉత్సవాలు ఆదివారం కడప నగరంలోని నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎల్ఐసీలో పాలసీ తీసుకుంటే జీవితానికి ఆదరువుగా నిలుస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్లతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సంస్థ సహాయకారిగా నిలవడం అభినందనీయమన్నారు. సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ జి.బాబురావు మాట్లాడుతూ వారోత్సవాల్లో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. మార్కెటింగ్ మేనేజర్ మునికృష్ణయ్య సంస్థ ఆవిర్భావం, ప్రస్తానం గురించి వివరించారు. ఎస్డీఎం బాబురావు ఎస్పీ గులాఠీకి జ్ఞాపికను అందజేశారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులు, ఉద్యోగులకు బహుమతులను అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
రౌడీయిజం అంతు చూస్తా
శ్రీకాకుళం క్రైం: రౌడీయిజం అంతు చూస్తానని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎ.ఎస్.ఖాన్ అన్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో పరిపాలన విభాగం డీసీపీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చిన ఆయన, ఇప్పటివరకు ఎస్పీగా ఉన్న నవీన్ గులాఠీ నుంచి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రౌడీయిజాన్ని సమూలంగా రూపుమాపుతానన్నారు. ఇసుక మాఫియాపై గనుల శాఖ నుంచి ఫిర్యాదు అందితే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భూ కబ్జాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూకబ్జాదారులకు కొందరు ఎస్సైలు, సీఐలు కొమ్ముకాస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ వారిపైన డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారని.. బాధితులు న్యాయం కోసం ఎవరినైనా సంప్రదించవచ్చని బదులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ప్రశాంతతకు మారుపేరని వ్యాఖ్యానించారు. రాయలసీమ వైపు నుంచి వచ్చే అధికారులు తమ పనితీరు మార్చుకోవలసి ఉంటుందన్నారు. ఎందుకంటే అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, అది తమ బాధ్యతని తెలిపారు. కడపకు బదిలీపై వెళ్తున్న నవీన్ గులాఠీకి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. నవీన్ గులాఠీ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఎస్పీ ఖాన్ గతంలో మంచి విజయాలు సాధించారని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటారన్నారు. జిల్లా ప్రజలు చాలా మంచి వాళ్లని, వారిని విడిచిపెట్టి వెళ్లటం బాధకరమైనా విధి నిర్వహణలో బదిలీలు తప్పవని వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజలు, నాయకులు, మీడియా వారు తనకు ఎంతో సహకరించారని అన్నారు. తన హాయంలో వరుస ఎన్నికలు సవాల్‌గా మారని, అయితే పక్కా ప్రణాళికతో విజయం సాధించామన్నారు. దేవుని దయ వల్ల జిల్లాలో తాను విధులు నిర్వహించినంత కాలం ఎటువంటి ఇబ్బం దులు రాలేదని తెలిపారు. తాను విధులు నిర్వహించిన ప్రాంతాలన్నింటిలోకి శ్రీకాకుళం జిల్లా ఎంతో ప్రశాంతమైనదని చెప్పా రు. గతంలో తాను విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పనిచేశానని, ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో మంచివారని చెప్పారు. కొత్త ఎస్పీకి పోలీస్ యంత్రాంగం స్వాగతం కొత్త ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు జిల్లా పోలీసు యంత్రాంగం ఆదివారం ఘనంగా స్వాగతం పలికింది. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ కార్యాలయానికి వచ్చి ఎస్పీని కలిసి పరిచయం చేసుకున్నారు. ఇదే సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎస్పీ నవీన గులాఠీకి ఘన వీడ్కోలు పలికారు. తనను ఇంత వరకు సహకరించినందుకు గులాఠీ జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.