breaking news
national standard examination
-
ఆంధ్రా షుగర్స్‌కు షుగర్ కేన్ హార్వెస్టింగ్ మెషీన్ పేటెంట్
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వ చ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సరి్టఫికెట్ జారీ చేసింది. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనా«థ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేస్తోంది. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం. -
శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే.. ఒలింపియాడ్స్
దేశంలో ప్రీ యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థుల్లో బేసిక్ సెన్సైస్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఒలింపియాడ్స్‌ను ప్రవేశ పెట్టారు. మొత్తం ఐదు విభాగాల్లో ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి.. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ (పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం). ఐదు దశలుగా ఒలింపియాడ్స్ ఐదు దశలుగా ఉంటుంది. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్, ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్, ట్రైనిం గ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. వీటిల్లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచ ర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తుంది. మిగతావిభాగాలను హోమి బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్బీసీఎస్ఈ) పర్యవేక్షిస్తుంది. మొదటి దశ నేషనల్ ఒలింపియాడ్స్ దిశగా మొదటి దశ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎస్‌ఈఎస్). సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ విభాగాల్లో ఎన్‌ఎస్‌ఈఎస్ నిర్వహిస్తారు. ఇందులో జ్ఞాపక శక్తి కాకుండా.. విద్యార్థి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో సీబీఎస్ఈ 11, 12వ తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. కానీ ఆస్ట్రానమీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ ఆస్ట్రానమీ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. జూనియర్ సైన్స్ విభాగంలో.. సీబీఎస్ఈ పదో తరగతి స్థాయి సిలబస్ ఉంటుంది. ఇందులో సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా విధానం సబ్జెక్టును బట్టి వేర్వేరుగా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ కలయికగా ఇంగ్లిష్ భాషలో ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం రెండు గంటలు. ఫిజిక్స్ పేపర్ మొత్తం 180 మార్కులకు ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ, బి రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో 50 ప్రశ్నలు అడుగుతారు. తిరిగి పార్ట్-ఎ.. ఎ1, ఎ2 అనే రెండు సెక్షన్లుగా ఉంటుంది. ఎ1లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఎ2లో ఉండే 10 ప్రశ్నలకు ఇచ్చే ఆప్షన్స్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. ఇందులో సరైన సమాధానాలన్నిటిని గుర్తించాలి. పార్ట్-బిలో 5-6 షార్ట్ ఆన్సర్ టైప్ కొశ్చన్స్/ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగంలో పరీక్షలను మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ప్రతి పేపర్లో 80 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ దశను స్క్రీనింగ్ టెస్ట్‌గా పరిగణనిస్తారు. ఎంఐ ఆధారంగా మెరిట్ ఇండెక్స్ (ఎంఐ) ఆధారంగా రెండో దశకు అర్హత కల్పిస్తారు. ఈ క్రమంలో ప్రతి విభాగంలో టాప్ పది మంది విద్యార్థుల 80 శాతం సగటును దాని సమీప తక్కువ పూర్ణాంకానికి మెరిట్ ఇండెక్స్‌ను సమం చేస్తారు. దానికంటే ఎక్కువ స్కోర్ సాధించిన విద్యార్థులను రెండో దశకు అనుమతిస్తారు. ఉదాహరణకు ఏదైనా సబ్జెక్ట్‌లో మొదటి పది మంది విద్యార్థుల సగటు స్కోర్ 92 అనుకుంటే. అందులోని 80 శాతం సగటు స్కోర్ 73.6. దీన్ని సమీప పూర్ణాంకం 73కు పరిమితం చేస్తారు. ఈనేపథ్యంలో 73 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించిన విద్యార్థులను రెండో దశకు అనుమతిస్తారు. మినహాయింపు గతేడాది అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో (ఐదు విభాగాలు) పాల్గొన్న విద్యార్థులు మొదటి దశ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సదరు విద్యార్థులు నేరుగా రెండో దశ ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు మినహాయింపునిచ్చారు. ఇందుకోసం నేషనల్ కో-ఆర్డినేటర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐఎన్‌ఓఎస్ ఎన్‌ఎస్‌ఈఎస్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ.. ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ (ఐఎన్ ఓఎస్)కు ఎంపిక చేస్తారు. ఎన్‌ఎస్‌ఈఎస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థుల్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి 300 మంది చొప్పున విద్యార్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు. ఇందులో కూడా సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఉంటాయి. కాకపోతే ప్రశ్నలను నాన్-కన్వెన్షన్ పద్ధతిలో అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత అంతర్జాతీయ ఒలింపియాడ్ స్థాయిలో ఉంటుంది. బయాలజీ మినహా మిగతా విభాగాల్లో సమాధానాలను రాయడానికి కేటాయించిన సమయం మూడు గంటలు. బయాలజీకి మాత్రం రెండు గంట ల్లోనే జవాబులివ్వాల్సి ఉంటుంది. మూడో దశ.. ఓసీఎస్‌సీ ఐఎన్ఓఎస్లో అర్హత సాధించిన విద్యార్థులను మూడో దశ ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్‌సీ)కు ఎంపిక చేస్తారు. దీన్ని కీలక దశగా భావించవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు దేశం తరపున అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో ప్రతి సబ్జెక్టు నుంచి 35 మంది విద్యార్థులను ఓసీఎస్‌సీకి ఎంపిక చేస్తారు. జూనియర్ సైన్స్ విభాగం నుంచి మాత్రం 45 మందికి అవకాశం కల్పిస్తారు. హెచ్బీసీఎస్ఈలో శిక్షణ ఓసీఎస్‌సీకి ఎంపికైన విద్యార్థులకు హోమి బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్బీసీఎస్ఈ)లో శిక్షణనిస్తారు. ఇది రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటుంది. ఇందులో విద్యార్థులకు తమ సబ్జెక్టుల్లో సైద్ధాంతిక, ప్రయోగత్మక శిక్షణనివ్వడంతోపాటు వివిధ ప్రయోగాలను సొంతంగా చేసే అవకాశం కల్పిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో తరగతులు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి తర్వాత దశకు అర్హత కల్పిస్తారు. ఈ క్రమంలో ఫిజిక్స్, ఆస్ట్రానమీ నుంచి ఐదుగురు చొప్పున, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నలుగురు చొప్పున, జూనియర్ సైన్స్ నుంచి 12 మంది విద్యార్థులను తర్వాత దశకు ఎంపిక చేస్తారు. వీరికి పుస్తకాలు, నగదు రూపంలో పురస్కారాలను అందజేస్తారు. అంతేకాకుండా ఆయా సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలంపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. వీరికేకాకుండా ప్రతిభ చూపిన ఇతర విద్యార్థులకు కూడా బహుమతులను అందజే స్తారు. ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు సన్నద్ధం చేసేలా విద్యార్థుల శిక్షణ కోసం ఈ దశను ఉద్దేశించారు. ఇందులో హెచ్బీసీఎస్ఈ ఫ్యాకల్టీలు, శాస్త్రవేత్తలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రముఖ సంస్థల డెరైక్టర్లు, నిపుణులు కూడా పాల్గొంటారు. ఈ క్రమంలో కెమిస్ట్రీ, బయాలజీకి రెండు వారాలపాటు, ఫిజిక్స్ రెండు వారాల కంటే ఎక్కువ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగాలకు వారం రోజుల పాటు శిక్షణనిస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు విద్యార్థుల ముందు తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి భారతీయ విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. విద్యార్థులతోపాటు ఒలంపియాడ్స్‌కు వెళ్లే జట్టులో మార్గదర్శకం చేయడానికి ఉపాధ్యాయులు, నిపుణులు ఉంటారు. ఒలింపియాడ్‌కు హాజరయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రాథమిక స్థాయి పరీక్ష కాబట్టి జూనియర్ విభాగానికి ఎక్కువ ఆదరణ ఉంది. దాదాపు 30 వేల మంది నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌కు హాజరవుతుంటే.. 15 వేల మంది విద్యార్థులు జూనియర్ విభాగంలో పరీక్ష రాస్తున్నారు. విద్యార్థి తన వైజ్ఞానిక ఆలోచన, సమస్యా సాధన వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. తార్కిక శక్తి పెరుగుతుంది. ఇటువంటి పరీక్షల్లో రాణించాలంటే అవగాహన, ఇతర సబ్జెక్ట్లతో అనువర్తనం వంటి సామర్థ్యాలు ఉండాలి. జ్ఞాపక శక్తి ఆధారంగా కాకుండా హయ్యర్ ఆర్డర్ థింకింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. అంటే అనువర్తనం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం వంటి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఒలింపియాడ్‌లో ఏ దశలోనైనా ఎంత నేర్చుకున్నారు అనే దానికంటే ఏవిధంగా దాన్ని అన్వయించగలుగుతున్నారనే అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. చదవాల్సిన పుస్తకాలు: Indian National Physics Olympiad-The-ory Problems and Solutions(2006-2009) Indian National Physics Olympiad - Theory Problems (1998 - 2005) Indian National Chemistry Olympiad - Theory Papers with Solutions (2002-04) Indian National Chemistry Olympiad - Theory Papers with Solutions (2005-07) Indian National Biology Olympiad - Theory Papers (2002-2004)Indian National Biology Olympiad - Theory Papers (2005 - 2007) Question Papers of Indian National Astronomy Olympiad (1999 - 2008) Problem Primer for Olympiads Functional Equations Inequalities: An Approach Through Problems Challenge and Thrill of Pre-College Mathematics Experimental Problems in Chemistry గత పేపర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నైపుణ్యాల పరీక్ష.. ఒలింపియాడ్స్
దేశంలోని ప్రీ యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థుల్లో బేసిక్ సెన్సైస్ పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు.. ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యతను పరీక్షించేందుకు ఉద్దేశించినవి ఒలింపియాడ్స్. విద్యార్థుల్లో ఆయా సబ్జెక్ట్‌లలో అన్వయం, విశ్లేషణ, సునిశిత పరిశీలన, సృజనాత్మకత, నిర్ణయాత్మక సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించే లక్ష్యంతో ఒలింపియాడ్స్‌కు అంకురార్పణ జరిగింది. ఒలింపియాడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా ఆయా సబ్జెక్ట్‌లలో నిర్వహించే ఒలింపియాడ్స్‌కు హాజరుకావాలంటే మన దేశంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ), హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్బీసీఎస్ఈ) నిర్వహించే ఒలింపియాడ్స్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. మొత్తం ఐదు దశలుగా ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్, ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్, ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ (ప్రీ డిపార్చర్ కమ్ ట్రైనింగ్ క్యాంప్), ఇంటర్నేషనల్ ఒలింపియాడ్. ఐదు సబ్జెక్ట్‌లు: మొత్తం ఐదు సబ్జెక్ట్‌ల్లో ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్. ఇందులో మొదటి దశ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్ఈ)ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తుంది. మిగతావిభాగాలను మాత్రం హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్బీసీఎస్ఈ) పర్యవేక్షిస్తుంది. ఎన్ఎస్ఈ ఇలా: సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్ఈ)ను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ సబ్జెక్ట్‌లలో ప్రశ్నల క్లిష్టత సీబీఎస్ఈ 12వ తరగతి స్థాయిలో ఉంటుంది. సీబీఎస్ఈ పదో తరగతి సిలబస్ ఆధారంగా జూనియర్ ఒలింపియాడ్ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఫిజిక్స్ ప్రశ్నపత్రం మాత్రమే హిందీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో ఉంటుంది. అది కూడా 300 మంది విద్యార్థులు ఎంచుకుంటే మినహా మిగతా అన్ని సబ్జెక్ట్‌లకు ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది. 240 మార్కులు: జూనియర్ ఒలింపియాడ్‌తో సహా అన్ని విభాగాలకు ప్రశ్నపత్రం 240 మార్కులకు ఉంటుంది. సబ్జెక్ట్‌లను అనుసరించి పరీక్షా విధానం వేర్వేరుగా ఉంటుంది. ఫిజిక్స్ పేపర్ లో పార్ట్-ఏ, బీ రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏ కు 180 మార్కులు కేటాయించారు. పార్ట్-ఏ ను తిరిగి ఏ1, ఏ2గా విభజించారు. ఇందులో ఏ1లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇవి సింగిల్ కరెక్ట్ ఆప్షన్ ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్). ఏ2లో 10 ప్రశ్నలు వస్తాయి. వీటికి ఇచ్చిన ఆప్షన్స్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. ఇందులో సరైన సమాధానాలన్నిటినీ గుర్తించాలి. పార్ట్-బీలో 5-6 షార్ట్ ఆన్సర్ టైప్ కొశ్చన్స్/ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి 60 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ విభాగాలకు మాత్రం 80 ప్రశ్నలు ఇస్తారు. ఇవి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. ఆస్ట్రానమీ విభాగంలో మాత్రం అధిక శాతం ప్రశ్నలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి వస్తాయి. 20 శాతం ప్రశ్నలు బేసిక్ ఆస్ట్రానమీ నుంచి ఇస్తారు. జూనియర్ ఒలింపియాడ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆయా సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యత ఉంటుంది. రెండో దశకు అర్హత సాధించే క్రమంలో సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రతి విద్యార్థి 40 శాతం కనీసం స్కోర్ (మినిమమ్ అడ్మిసబుల్ స్కోర్) సాధించాలి. నమోదు ఇలా: మీరు చదివే స్కూల్/కాలేజీ ద్వారా నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్ఈ)కు పేరును నమోదు చేసుకోవచ్చు. లేదా ఐఏపీటీ వెబ్సైట్లో ఎన్ఎస్ఈ పరీక్షా కేంద్రాలు, సంప్రదించాల్సిన అధికారుల సమాచారం అందుబాటులో ఉంది. తద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. నేషనల్స్: నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను తర్వాతి దశ ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్స్ (ఐఎన్‌ఓఎస్)కు ఎంపిక చేస్తారు. వీటిని ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి ఇండియన్ నేషనల్ ఫిజిక్స్/కెమిస్ట్రీ/ బయాలజీ/ ఆస్ట్రానమీ/ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌గా వ్యవహరిస్తారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి 300 మందికి రెండో దశలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతానికి కేటాయించిన పరీక్షా కేంద్రాలు, ఆ సబ్జెక్ట్‌లో దేశ వ్యాప్తంగా హాజరైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రెండో దశకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అన్ని విభాగాలకు సంబంధించి 309 మంది మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్‌ల వారీగా: ఫిజిక్స్-49; కెమిస్ట్రీ-55; బయాలజీ-11; ఆస్ట్రానమీ-72; జూనియర్ సైన్స్- 122; మొదటి దశలో అనుసరించిన సిలబస్‌నే ఈదశలోనూ వినియోగిస్తారు. ప్రశ్నలు నాన్-కన్వెన్షన్ పద్ధతిలో ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత అంతర్జాతీయ ఒలింపియాడ్ స్థాయిలో ఉంటుంది. బయాలజీ మినహా మిగతా విభాగాల్లో సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం మూడు గంటలు. బయాలజీకి మాత్రం రెండు గంట ల్లోనే జవాబులను గుర్తించాలి. సైద్ధాంతిక + ప్రయోగాత్మక: ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌కు హాజరయ్యే క్రమంలో ఈ మూడో దశ.. ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్‌సీ)ను కీలకమైందిగా భావించవచ్చు. రెండో దశ ఐఎన్ఓఎస్లో చూపిన ప్రతిభ ఆధారంగా మూడో దశకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో ప్రతి సబ్జెక్ట్ నుంచి 35 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. జూనియర్ సైన్స్ విభాగం నుంచి 45 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఓసీఎస్‌సీకి ఎంపికైన విద్యార్థులకు హెచ్బీసీఎస్ఈలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రెండు నుంచి నాలుగు వారాల పాటు ఓరియెంటేషన్ క్యాంప్ ఉంటుంది. ఇందులో విద్యార్థులకు తమ సబ్జెక్టుల్లో సైద్ధాంతిక, ప్రయోగాత్మక శిక్షణనిస్తారు. వివిధ ప్రయోగాలను సొంతంగా చేసే అవకాశం కల్పిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి తర్వాత దశకు అర్హత కల్పిస్తారు. సైద్ధాంతిక, ప్రయోగాత్మక అనే రెండు నైపుణ్యాలాధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తారు. ఇందులో సైద్ధాంతిక నైపుణ్యానికి 60 శాతం, ప్రయోగాత్మక నైపుణ్యానికి 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ మెరిట్ ఆధారంగా ఫిజిక్స్, ఆస్ట్రానమీ నుంచి ఐదుగురు చొప్పున, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నలుగురు చొప్పున, జూనియర్ సైన్స్ నుంచి 12 మంది విద్యార్థులను తర్వాత దశకు ఎంపిక చేస్తారు. వీరికి పుస్తకాలు, క్యాష్ రూపంలో రూ.5 వేల మెరిట్ అవార్డులు ఇస్తారు. అంతేకాకుండా వీరికి ఆయా సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం లిభిస్తుంది. వీరికేకాకుండా థియరీ, ఎక్స్పెరిమెంటల్ పరంగా ప్రతిభ చూపిన ఇతర విద్యార్థులకు బహుమతులను కూడా అందజేస్తారు. ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్: అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు ఎంపికైన విద్యార్థుల శిక్షణకు ఉద్దేశించిన దశ.. ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. ఈ దశలో అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు హెచ్బీసీఎస్ఈలో శిక్షణనిస్తారు. ఇందులో హెచ్బీసీఎస్ఈ ఫ్యాకల్టీ, శాస్త్రవేత్తలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రముఖ సంస్థల డెరైక్టర్లు, నిపుణులు కూడా పాల్గొంటారు. ఇందుకోసం ప్రత్యేక ల్యాబొరేటరీలను కూడా ఏర్పాటు చేస్తారు. కెమిస్ట్రీ, బయాలజీకి రెండు వారాలపాటు, ఫిజిక్స్‌కు రెండు వారాల కంటే ఎక్కువ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగాలకు వారం రోజులు శిక్షణనిస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్: అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల విద్యార్థుల ముందు తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి భారతీయ విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. విద్యార్థులతోపాటు ఒలింపియాడ్స్‌కు వెళ్లే టీమ్‌లో మార్గదర్శకం చేయడానికి ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు. ఫిజిక్స్, ఆస్ట్రానమీలలో ప్రతి జట్టు నుంచి ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు. బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి జట్టు నుంచి నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు. జూనియర్ సైన్స్ విభాగంలో 12 మంది విద్యార్థులు (6 గురు చొప్పున రెండు జట్లు), ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఒలింపియాడ్స్‌ను రెండు రోజులపాటు నిర్వహిస్తారు. మొదటి రోజు థియరటికల్ ప్రాబ్లమ్స్, రెండో రోజు ఎక్స్పెరిమెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమాధానాల కోసం ఐదు గంటల సమయం కేటాయిస్తారు. కెమిస్ట్రీ ఒలింపియాడ్ కూడా థియరటికల్, ఎక్స్పెరిమెంటల్ ప్రశ్నల కలయికగా రెండు రోజుల పాటు ఉంటుంది. ఆస్ట్రానమీలో మాత్రం నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. థియరటికల్ ఎగ్జామ్ (15 స్వల్ప సమాధాన ప్రశ్నలు, 2-3 దీర్ఘ సమాధాన ప్రశ్నలు, సమయం ఐదు గంటలు), డేటా అనాలిసిస్ ఎగ్జామ్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించాలి, సమయం నాలుగు గంటలు), అబ్జర్వేషనల్ ఎగ్జామ్ (ఆకాశం/ప్లానిటోరియంలో.. నక్షత్రాలు, వివిధ అంశాలను పరిశీలిస్తూ సమాధానం ఇవ్వడం తరహా), టీమ్ కాంపిటీషన్. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. టెక్ట్స్ ఎగ్జామ్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి 10 ప్రశ్నల చొప్పున మొత్తం 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి, సమయం మూడు గంటలు), థియరటికల్ ఎగ్జామ్ (సమయం మూడు గంటలు), ఎక్స్పెరిమెంటల్ ఎగ్జామినేషన్ (సమయం మూడు గంటలు). మన రాష్ట్రం నుంచే అత్యధిక మంది మన రాష్ట్రం నుంచి దాదాపు 24,000 మంది విద్యార్థులు ఈ ఒలింపియాడ్స్‌కు హాజరవుతున్నారు. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షను దాదాపు 10 వేల మంది విద్యార్థులు రాస్తున్నారు. దేశం మొత్తం మీద మన రాష్ట్రం నుంచే అత్యధిక మంది విద్యార్థులు ఈ ఒలింపియాడ్స్‌కు హాజరువుతున్నారు. ఇందుకోసం 2012-13 విద్యా సంవత్సరంలో 351 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక విద్యార్థి సంబంధిత సబ్జెక్ట్‌లో తన అవగాహన స్థాయిని తెలుసుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో ప్రతిభను అంచనా వేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఇందులో ప్రశ్నలు అప్లికేషన్ మెథడ్‌లో ఉంటాయి. ఒక సమస్యకు సంబంధించి సూత్రాన్ని గుర్తుతెచ్చుకోవడానికి జ్ఞాపక శక్తి సరిపోతుంది. కానీ దాన్ని సమస్యకు అన్వయించి, సాధించడానికి మాత్రం మూల భావనలపై పట్టు అవసరం. ఇదే అంశం ఆధారంగా ఒలింపియాడ్స్‌లో ప్రశ్నలు ఉంటాయి. ఒక రకంగా జ్ఞాపక శక్తి కంటే నైపుణ్యాలను ఒలింపియాడ్స్‌లో పరీక్షిస్తారు. వివిధ రకాల ప్రయోగాలతో సైన్స్‌ను ఒక కొత్త కోణంలో, ఆసక్తికరంగా నేర్చుకునే విధంగా హెచ్బీసీఎస్ శిక్షణ ఉంటుంది. సునిశిత పరిశీలన, ప్రయోగాత్మకంగా, అనువర్తనం వంటి స్కిల్స్ పెంపొందించేలా ఈ శిక్షణ ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బెంచ్‌మార్క్ ఎగ్జామ్‌గా ఒలింపియాడ్స్‌ను పరిగణించవచ్చు. -ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, ప్రొఫెసర్ ఇన్చార్జ్ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఆంధ్రప్రదేశ్. ఎన్ఎస్ఈ అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ: 12వ తరగతి/ దిగువ తరగతులు చదువుతుండాలి. వయసు: 1994 జూలై 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి (ఆస్ట్రానమీ విద్యార్థులకు వయసు: 1995, జనవరి 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి). జూనియర్ సైన్స్: పదో తరగతి/దిగువ తరగతి వయసు: 1999,జనవరి 1న/తర్వాత జన్మించినవారు షెడ్యూల్: నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్: నవంబర్ 24, 2013. ఎన్రోల్మెంట్కు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2013. నేషనల్ ఒలింపియాడ్స్: ఫిబ్రవరి 1-2, 2014. ఫలితాల వె ల్లడి: మార్చి 1, 2014 ఓసీఎస్‌సీ షెడ్యూల్: ఏప్రిల్-జూన్, 2014. వివరాలకు:www.olympiads.hbcse.tifr.res.in, www.iapt.org.in రిఫరెన్స్ బుక్స్ Indian National Physics Olympiad Theory Problems and Solutions (2006 - 2009) Biological Sciences D.J. Taylor, N.P.O. Green and G.W. Stout. Principles of Bio-chemistry A.L. Lehninger, D.L.Nelson and M.M.Cox The Nature of Life John Postlethwait and Janet Hopson Textbooks of Physics and Mathematics by NCERT, upto Class XII. Concepts of Physics H.C.Verma Astronomy: Principles and Practice M.N. Roy and R.C. Clark Indian National Chemistry Olympiad Theory Examination Papers (2002 - 2007), Savita Ladage and Swapna Narvekar. Challenge and Thrill of PreCollege Mathematics Author: V Krishnamurthy, C R Pranesachar, K.N. Ranganathan, and B J Venkatachala. Experimental Problems in Chemistry, Savita Ladage, Swapna Narvekar and Indrani Sen. అవార్డులు ప్రతి సెంటర్లో టాప్ 10 శాతం మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. ప్రతి రాష్ట్రం/సబ్జెక్ట్ నుంచి టాప్ ఒక శాతం మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తారు. ప్రతి సబ్జెక్ట్‌లో జాతీయ స్థాయిలో టాప్ ఒక శాతంలో ఉన్న విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లతోపాటు బహుమతులను కూడా ప్రదానం చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌లో టాప్ 35లో నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. ఐదు సబ్జెక్ట్‌లు.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్‌లలో ఐదు దశలుగా ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్(240మార్కులు) ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్స్ ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్